విషయసూచిక
జనవరి 15, 2014
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania.
అధ్యయన ప్రతి
మార్చి 3-9, 2014
సకల యుగముల రాజైన యెహోవాను ఆరాధించండి
7వ పేజీ • పాటలు: 27, 46
మార్చి 10-16, 2014
100 ఏళ్ల రాజ్యపాలన—మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
12వ పేజీ • పాటలు: 17, 10
మార్చి 17-23, 2014
యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి
17వ పేజీ • పాటలు: 41, 11
మార్చి 24-30, 2014
దుర్దినములు రాకముందే యెహోవాను సేవించండి
22వ పేజీ • పాటలు: 54, 17
మార్చి 31, 2014–ఏప్రిల్ 6, 2014
“నీ రాజ్యము వచ్చుగాక”—ఎప్పుడు?
27వ పేజీ • పాటలు: 14, 30
అధ్యయన ఆర్టికల్స్
▪ సకల యుగముల రాజైన యెహోవాను ఆరాధించండి
ఈ ఆర్టికల్, యెహోవా ఎల్లప్పుడూ రాజేనన్న విషయాన్ని నొక్కిచెప్పడంతోపాటు, ఆయన పరలోకంలో అలాగే భూమ్మీద ఉన్న ప్రాణులపై తన రాచరికాన్ని ఎలా చూపించాడో తెలియజేస్తుంది. సకల యుగములకు రాజైన యెహోవాను ఆరాధించిన కొంతమందిని ఆదర్శంగా తీసుకోమని కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది.
▪ 100 ఏళ్ల రాజ్యపాలన—మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
తన మొదటి 100 ఏళ్ల పాలనలో మెస్సీయ రాజ్యం సాధించినవాటిపై మన కృతజ్ఞతను ఈ ఆర్టికల్‌పెంచుతుంది. అంతేకాక, ఆ రాజ్యానికి యథార్థమైన పౌరులుగా ఉండమని మనలో ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది, దానితోపాటు 2014 వార్షిక వచనానికున్న పూర్తి అర్థం గురించి ధ్యానించేలా మనల్ని పురికొల్పుతుంది.
▪ యౌవనంలో జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోండి
▪ దుర్దినములు రాకముందే యెహోవాను సేవించండి
నేను నా జీవితాన్ని ఎలా ఉపయోగిస్తాను? యెహోవాకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న అది. ఈ ఆర్టికల్స్‌లో, మరింత ఎక్కువగా యెహోవా సేవచేసేలా క్రైస్తవ యువతీయువకులకు మార్గనిర్దేశం ఇచ్చే సూత్రాలను చర్చిస్తాం. అంతేకాక, తమ పరిచర్యను విస్తృతపర్చుకునేందుకు వయసు పైబడుతున్న క్రైస్తవుల ముందున్న అవకాశాల గురించి కూడా పరిశీలిస్తాం.
▪ “నీ రాజ్యము వచ్చుగాక”—ఎప్పుడు?
లోకంలోని పరిస్థితులవల్ల లేదా తమకు నచ్చినవాటి వెంట పరుగులు తీయడంవల్ల నేడు చాలామంది ధ్యాస పక్కకు మళ్లుతుంది. దేవుని రాజ్యం త్వరలోనే ఈ దుష్టలోకాన్ని అంతం చేస్తుందని క్రైస్తవులు నమ్మడానికి గల మూడు రుజువుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
ఇంకా ఈ సంచికలో
ముఖచిత్రం: లావోవ్ నగరంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు సాక్ష్యం ఇస్తున్న దృశ్యం
యుక్రెయిన్
జనాభా
4,55,61,000
ప్రచారకులు
1,50,887
15 భాషల్లో, 1,737 సంఘాలు, 373 గుంపులు ఉన్నాయి. ఆ భాషల్లో యుక్రెనియన్, రొమేనియన్, రష్యన్, రష్యా సంజ్ఞా భాష, హంగేరియన్ భాషలు ఉన్నాయి