కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 10/15 పేజీలు 31-32
  • ఇతరులను హెచ్చరించడానికి మరింతగా కృషి చేయగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులను హెచ్చరించడానికి మరింతగా కృషి చేయగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఎల్లప్పుడూ ప్రకటించాడు
  • వాళ్లు ఏ అవకాశాన్నీ వదులుకోలేదు
  • ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి
  • డబ్బుంటేనే సంతోషంగా ఉంటామా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • భూకంపం తర్వాతి పరిణామాలను తట్టుకోవడం
    తేజరిల్లు!—2002
  • మేము మొదట రాజ్యమును వెదికాము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “శ్రమల్లో విశ్వసనీయత”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 10/15 పేజీలు 31-32

ఇతరులను హెచ్చరించడానికి మరింతగా కృషి చేయగలరా?

ఎ ట్రిప్‌డౌన్‌మార్కెట్‌ స్ట్రీట్‌ అనే మూకీ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రజల జీవన పరిస్థితులను అందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆ సినిమాను నిర్మించిన వాళ్లు, చేత్తో తిప్పగలిగే ఒక కెమేరాను ఓ వాహన ముందుభాగంలో అమర్చి, అది ప్రయాణిస్తున్నప్పుడు రోడ్ల మీదున్న ప్రజలను చిత్రీకరించారు. గుర్రపుబళ్లు, మోటారు వాహనాలు, వస్తువులు కొనుక్కునే ప్రజలు, వార్తాపత్రికలు అమ్మేవాళ్లు, ఇలా ఆ సినిమాలో ఎక్కువగా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి.

బహుశా 1906 ఏప్రిల్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన విషాదం ఏమిటంటే, దీని నిర్మాణం పూర్తైన కొన్ని రోజుల తర్వాత, అంటే ఏప్రిల్‌18న ఆ ప్రాంతంలో ఓ పెద్ద భూకంపం, అగ్ని ప్రమాదం సంభవించాయి. ఈ రెండు విపత్తుల వల్ల వేలమంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి, నగరంలోని ఆ ప్రాంతమంతా నేలమట్టం అయ్యింది. కొన్నిరోజుల్లోనే తమ జీవితాలు బుగ్గిపాలు కానున్నాయని ఆ సినిమాలో కనిపించిన వాళ్లకు తెలియదు. ఆ సినిమా నిర్మించిన వాళ్లలో ఒకరి బంధువైన స్కాట్‌ మిల్జ్‌ అనే ఆయన ఇలా అన్నాడు: “నేను అక్కడే, ఆ స్థలంలోనే ఎంతోమందిని చూశాను. ఆ విపత్తు తమను పొట్టనపెట్టుకోబోతుందని వాళ్లకు తెలియదు పాపం. వాళ్లకు జరిగింది చూసి మనం బాధపడడం తప్ప ఏమి చేయలేం.”

ఎలాంటి హెచ్చరిక లేకుండా 1906లో వచ్చిన భూకంపం, దానివల్ల సంభవించిన అగ్నిప్రమాదం శాన్‌ఫ్రాన్సిస్కోలోని చాలా భాగాన్ని నేలమట్టం చేశాయి

మన కాలంలో కూడా అలాంటి విపత్తే ముంచుకు రాబోతుంది. మనం కూడా మన ఇరుగుపొరుగు గురించి బాధపడకుండా ఉండలేం. అతి త్వరలోనే రానున్న విపత్తు గురించి, అంటే ఈ దుష్ట వ్యవస్థ నాశనం గురించి ఏ మాత్రం తెలియక వాళ్లు తమతమ పనుల్లో మునిగివున్నారు. అయితే ఆ విపత్తు, ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చే భూకంపం లాంటిది కాదు. రాబోయే యెహోవా తీర్పు దినం గురించి మన పొరుగువాళ్లను హెచ్చరించడానికి మనకు కొంచెం సమయం మిగిలివుంది. మీరు బహుశా ప్రతీవారం ఇంటింటి పరిచర్యలో కొంత సమయం గడుపుతూ ఉండవచ్చు, అయితే ప్రజలను హెచ్చరించడానికి మీరింకా ఏమి చేయవచ్చు?

యేసు ఎల్లప్పుడూ ప్రకటించాడు

యేసు ఈ విషయంలో ఆదర్శప్రాయుడు, ఎందుకంటే భూమ్మీదున్నప్పుడు ఆయన ప్రతీ సందర్భంలో ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన కలిసిన ప్రతి ఒక్కరికీ ప్రకటించాడు; దారిలో ప్రయాణిస్తూ ఒక సుంకరితో మాట్లాడాడు, మధ్యాహ్న సమయంలో బావి దగ్గర కలిసిన ఓ స్త్రీతో కూడా మాట్లాడాడు. (లూకా 19:1-5; యోహా. 4:5-10, 21-24) ఆఖరికి విశ్రాంతి తీసుకొనే సమయంలో కూడా యేసు ఇష్టంగా ఇతరులకు బోధించాడు. యేసుకు తన పొరుగువారి మీద కనికరం ఉంది కాబట్టే వాళ్లకు కేవలం పైపైన ప్రకటించి ఊరుకోలేదు. (మార్కు 6:30-34) యేసుకు ఉన్నటువంటి అత్యవసర భావాన్ని నేడు కొంతమంది ఎలా అనుకరిస్తున్నారు?

వాళ్లు ఏ అవకాశాన్నీ వదులుకోలేదు

మెలేకా, భద్రత ఎక్కువగా ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. అందులో నివసించే వాళ్లలో చాలామంది విదేశీ విద్యార్థులే. వాళ్ల ఫోన్‌ నంబర్లు కాని, వాళ్ల పేర్లు కాని ఆ అపార్ట్‌మెంట్‌ ఫోన్‌ జాబితాలో లేవు. అందుకే ఆమె అపార్ట్‌మెంట్‌ లాబీలో, లిఫ్ట్‌లో వాళ్లను కలిసినప్పుడు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడానికి ప్రత్యేకంగా కృషి చేసింది. “ఓ విధంగా ఈ అపార్ట్‌మెంట్‌నే నా క్షేత్రంగా భావించాను” అని ఆమె అంటోంది. మెలేకా చాలా భాషల సాహిత్యాన్ని తన దగ్గర ఉంచుకుంటుంది. ఆమె పొరుగువాళ్లలో చాలామంది కరపత్రాలను, పత్రికలను తీసుకుంటారు. దానితోపాటు ఆమె మన వెబ్‌సైట్‌, jw.org వైపుకు కూడా వాళ్ల అవధానాన్ని మళ్లిస్తుంటుంది. ఆమె అనేక బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టింది.

సోనియా అనే సహోదరి కూడా వీలైనప్పుడల్లా సాక్ష్యమిస్తూనే ఉంటుంది. ఒక క్లినిక్‌లో పనిచేస్తున్న ఆమె తన సహోద్యోగుల్లో ప్రతీ ఒక్కరికి సంపూర్ణంగా సాక్ష్యమివ్వాలని లక్ష్యం పెట్టుకుంది. వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ విషయాలు ఆసక్తికరంగా ఉంటాయో తెలుసుకుంది. తర్వాత, మధ్యాహ్న భోజన విరామ సమయంలో వాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిలు విషయాలు మాట్లాడడం మొదలుపెట్టేది. అలా సోనియా రెండు బైబిలు అధ్యయనాలు ప్రారంభించగలిగింది. అలాగే ఆమె విరామ సమయంలో, హాస్పిటల్‌ లాబీలో వేచిచూసే వాళ్లకు కూడా సాక్ష్యమివ్వాలని ఆమె ప్రణాళికలు వేసుకుంది.

ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి

ఆ భూకంపం నుండి బతికిబయటపడ్డ ఒకాయన, “ఇప్పటివరకూ ఏ రాష్ట్రం గానీ, నగరం గానీ ఇంత భయంకరమైన విపత్తును చవిచూడలేదు” అని అన్నాడు. అయితే ‘దేవుణ్ణి ఎరుగనివారి’ మీదకు వచ్చే ఉగ్రతాదినంతో పోలిస్తే అలాంటి విపత్తులన్నీ చాలా చిన్నవి. (2 థెస్స. 1:6-8) ప్రజలు తమ మనస్సును, హృదయాన్ని మార్చుకుని తన సాక్షులు ప్రకటించే హెచ్చరికా సందేశానికి ప్రతిస్పందించాలని యెహోవా ఎంతగానో కోరుకుంటున్నాడు.—2 పేతు. 3:9; ప్రక. 14:6, 7.

రోజువారీ పనుల్లో మీకు ఎదురయ్యే వాళ్లకు సాక్ష్యమిచ్చేందుకు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా?

మనం ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నామని ప్రజలు గుర్తించేలా, స్వార్థపూరిత ఆశలను వదిలిపెట్టి యెహోవాను వెదికేలా వాళ్లకు సహాయం చేయడం మీకున్న అరుదైన అవకాశం. (జెఫ. 2:2, 3) మీ తోటి ఉద్యోగులకు, పొరుగువాళ్లకు, రోజువారీ పనుల్లో తారసపడేవాళ్లకు సాక్ష్యమిచ్చే ప్రతీ అవకాశాన్నీ మీరు చేజిక్కించుకోగలరా? ఇతరులను హెచ్చరించడానికి మీరు మరింతగా కృషిచేస్తారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి