విషయసూచిక
మార్చి 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
ఏప్రిల్ 29, 2013–మే 5, 2013
యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”
3వ పేజీ • పాటలు: 45, 32
మే 6-12, 2013
యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?
8వ పేజీ • పాటలు: 31, 23
మే 13-19, 2013
దేవుణ్ణి తెలుసుకున్నాం, మరి ఇప్పుడేమిటి?
13వ పేజీ • పాటలు: 54, 24
మే 20-26, 2013
19వ పేజీ • పాటలు: 51, 1
మే 27, 2013–జూన్ 2, 2013
యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి
24వ పేజీ • పాటలు: 27, 10
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”
క్రైస్తవులందరూ నిత్యజీవం బహుమతిగా దొరికే పరుగుపందెంలో ఉన్నారు. కానీ, వారసత్వంగా వచ్చిన పాపం కారణంగా మనందరం తడబడతాం. తడబడేలా చేసే ఐదు విషయాలను మనం ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాక మనం వాటివల్ల తడబడకుండా పరుగుపందెంలో ఎలా విజయం సాధించవచ్చో కూడా చూస్తాం.
▪ యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?
హృదయం గురించి యిర్మీయా పుస్తకంలో ఎంతో ఉంది. ‘సున్నతి పొందని హృదయం’ అంటే ఏమిటో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అది క్రైస్తవులకు కూడా ఎందుకు ప్రమాదకరమో తెలుసుకుంటాం. అంతేకాక, మనం యెహోవాను “ఎరుగు హృదయము” ఎలా సంపాదించుకోవచ్చో చూస్తాం.—యిర్మీ. 9:25, 26; 24:7.
▪ దేవుణ్ణి తెలుసుకున్నాం, మరి ఇప్పుడేమిటి?
మనం దేవుణ్ణి తెలుసుకునేందుకు, ఆయనకు మనం తెలిసేందుకు వేయాల్సిన అడుగులు ఏమిటి? క్రైస్తవులు ఆధ్యాత్మిక పరిణతి సాధించిన తర్వాత కూడా వాళ్ల ప్రగతి ఎందుకు, ఎలా కొనసాగుతుంది? ఆ ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబు చూస్తాం.
▪ యెహోవా మన నివాస స్థలం
ఆధ్యాత్మికంగా ప్రమాదకరమైన లోకంలో జీవిస్తున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా మనకు ఎలా అత్యంత సురక్షితమైన నివాస స్థలంగా ఉంటాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
▪ యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి
దేవుని పేరు కలిగిన ప్రజలుగా ఉండడం అంటే అర్థమేమిటి? ఆ నామాన్ని ‘స్మరిస్తూ ఉండడం’ అంటే ఏమిటి? తన నామాన్ని అవమానపర్చేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడు? ఈ ఆర్టికల్‌లో వాటికి జవాబులు చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
18 ఓదార్పు పొందండి, ఇతరుల్ని ఓదార్చండి
29 నిజంగానే దాన్ని జోసిఫస్ రాశాడా?
ముఖచిత్రం: ఫిన్‌లాండ్ దేశానికి, అనేక ద్వీపాలతో ఎన్నో కిలోమీటర్ల పొడవునా విస్తరించిన సముద్ర తీరం ఉంది. ప్రత్యేకంగా ఫిన్‌లాండ్‌లోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో వేల సరస్సులు కూడా ఉన్నాయి. అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో కొంతకాలంపాటు సేవచేయడానికి వెళ్లే కొందరు ప్రచారకులు పడవల్లో వెళ్తారు
ఫిన్‌లాండ్
జనాభా:
53,75,276
జనాభా నిష్పత్తి:
283 మందికి 1 సాక్షి
క్రమ పయినీర్లు:
1,824