విషయసూచిక
మే 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
జూన్ 27, 2011–జూలై 3, 2011
క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘మెలకువగా ఉండండి’
7వ పేజీ
జూలై 4-10, 2011
క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘సిద్ధంగా ఉండండి’
11వ పేజీ
జూలై 11-17, 2011
జీవితంలో మీరు ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు?
16వ పేజీ
జూలై 18-24, 2011
‘ఆహా, దేవుని బుద్ధి ఎంత గంభీరం!’
21వ పేజీ
జూలై 25-31, 2011
యెహోవాపై పూర్తి నమ్మకముంచితే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం
28వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-15 పేజీలు
కుటుంబం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలంటే కుటుంబంలోని ప్రతీ వ్యక్తి ఏమి చేయాలో మొదటి ఆర్టికల్ తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే కంటిని తేటగా ఉంచుకోవడం, ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడం, క్రమంగా కుటుంబ ఆరాధన చేయడం ఎంత అవసరమో రెండవ ఆర్టికల్ తెలియజేస్తుంది.
3వ అధ్యయన ఆర్టికల్ 16-21 పేజీలు
యెహోవా సేవకుల జీవితాల్లో ఆయనే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. ఈ విషయంలో మనం మొదటి స్త్రీయైన హవ్వ, నమ్మకస్థుడైన యోబు, దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు నుండి ఏమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది.
4వ అధ్యయన ఆర్టికల్ 21-25 పేజీలు
రోమీయులు 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అలంకారార్థ ఒలీవ చెట్టు గురించి రాశాడు. ఆ చెట్టుకు సంబంధించిన ఆయా భాగాలు వేటిని సూచిస్తున్నాయి? దాని గురించి మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తుండగా యెహోవా సంకల్పం గురించి ఎక్కువగా తెలుసుకుంటాం, ఆయన బుద్ధి ఎంత గంభీరమో చూసి ఆశ్చర్యపోతాం.
5వ అధ్యయన ఆర్టికల్ 28-32 పేజీలు
దావీదు రాజు కూర్చిన 3వ, 4వ కీర్తనలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది. మనం యెహోవా సహాయం కోసం ప్రార్థించి, ఆయన మీద పూర్తి నమ్మకముంచితే ధైర్యంగా ఉండగలుగుతామని ఈ ప్రేరేపిత పాటలు చూపిస్తున్నాయి. తన కుమారుడైన అబ్షాలోము తనపై కుట్ర పన్నడం వంటి కష్టాలు ఎదురైనప్పుడు దావీదు అలాగే చేశాడు.
ఇంకా ఈ సంచికలో
3 దేవుని వాక్యాన్ని మీరు నిజంగా ఆస్వాదిస్తున్నారా?
6 “మంచి పర్యవేక్షకుడు, ప్రియమైన స్నేహితుడు”
26 పరిపూర్ణ నాయకుడైన క్రీస్తును అనుసరించాలి