విషయసూచిక
ఫిబ్రవరి 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఏప్రిల్ 4-10, 2011
సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది
6వ పేజీ
ఏప్రిల్ 11-17, 2011
దేవుని ఆమోదాన్ని సంపాదించుకుంటే నిత్యజీవాన్ని పొందుతాం
13వ పేజీ
ఏప్రిల్ 18-24, 2011
పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి
24వ పేజీ
ఏప్రిల్ 25–మే 1, 2011
మీరు దుర్నీతిని ద్వేషిస్తున్నారా?
28వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1వ అధ్యయన ఆర్టికల్ 6-10 పేజీలు
భూమ్యాకాశాలను సృష్టించడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించాడో ఈ ఆర్టికల్ ద్వారా మరింత ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. అలాగే, సృష్టికర్తయైన యెహోవా దేవుడు జ్ఞానవంతుడు, శక్తివంతుడు అనే మన నమ్మకం కూడా బలపడుతుంది.
2వ అధ్యయన ఆర్టికల్ 13-17 పేజీలు
సాధారణంగా ప్రజలు వస్తుపరమైన భద్రత కోసం తాపత్రయపడుతుంటారు. కానీ దేవుని ఆమోదం సంపాదించుకోవడం కోసం ఎక్కువగా కృషిచేయాలని బైబిలు చెబుతోంది. యెహోవాపై మనకున్న నమ్మకాన్ని బలపరచుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆయన ఆమోదం పొందడానికి ఏయే చర్యలు తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 24-32 పేజీలు
‘యేసు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు.’ (హెబ్రీ. 1:9) మనం ఆయనను ఎలా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. నీతిని ప్రేమించడాన్ని నేర్చుకోవడం, దుర్నీతి పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 మర్యాదగా నడుచుకోవడం మీ పిల్లలకు నేర్పించండి
18 మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నారా?
21 ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’