కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • brwp101001 పేజీ 10
  • 6 ప్రార్థన మనకు సహాయం చేస్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 6 ప్రార్థన మనకు సహాయం చేస్తుందా?
  • కావలికోట: ప్రార్థన గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట: ప్రార్థన గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు
brwp101001 పేజీ 10

6 ప్రార్థన మనకు సహాయం చేస్తుందా?

ప్రార్థన మనకు సహాయం చేస్తుందా? అవును, దేవుని నమ్మకమైన సేవకులు చేసే ప్రార్థనలు వాళ్లకు నిజంగా సహాయం చేస్తాయని బైబిలు చెప్తుంది. (లూకా 22:40; యాకోబు 5:13) నిజానికి, ప్రార్థన మనం దేవునికి దగ్గరవ్వడానికి సహాయం చేస్తుంది, అలాగే భావోద్వేగపరంగా, భౌతికంగా కూడా సహాయం చేస్తుంది. ఎలా?

ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడికి ఒక బహుమతి ఇచ్చారు అనుకుందాం. దానికి ఆ పిల్లవాడు కేవలం కృతజ్ఞత కలిగివుంటే సరిపోతుందా? లేదా అతను ఆ కృతజ్ఞతను బయటికి చెప్పాలని మీరు కోరుకుంటారా? మన భావాల్ని బయటికి చెప్పినప్పుడు మనం వాటిమీద దృష్టిపెడతాం, అవి మరింత బలపడతాయి. దేవునితో మాట్లాడే విషయంలో కూడా అది నిజమేనా? ఖచ్చితంగా! కొన్ని ఉదాహరణలు గమనించండి.

కృతజ్ఞతలు చెప్పే ప్రార్థనలు. మనం పొందుతున్న మంచి విషయాల గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు, మనం మనకున్న ఆశీర్వాదాల మీద దృష్టి పెడతాం. దానివల్ల మనం మరింత కృతజ్ఞతతో, సంతోషంగా ఉంటాం, సానుకూలంగా ఆలోచిస్తాం.​—ఫిలిప్పీయులు 4:6.

ఉదాహరణ: తన తండ్రి తన ప్రార్థనలు విన్నందుకు, వాటికి జవాబిచ్చినందుకు యేసు కృతజ్ఞతలు చెప్పాడు.​—యోహాను 11:41.

క్షమాపణ అడిగే ప్రార్థనలు. మనం దేవున్ని క్షమాపణలు అడిగినప్పుడు మన మనస్సాక్షి బలంగా తయారౌతుంది, లోతైన పశ్చాత్తాపం చూపిస్తాం, మనం చేసిన తప్పు ఎంత పెద్దతో అర్థం చేసుకున్నామని చూపిస్తాం. మన మనసు తేలికవుతుంది.

ఉదాహరణ: దావీదు పశ్చాత్తాపాన్ని, దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థించాడు.​—51వ కీర్తన.

నిర్దేశం, తెలివి కోసం చేసే ప్రార్థనలు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిర్దేశం కోసం లేదా తెలివి కోసం యెహోవాకు ప్రార్థించడం మనం వినయంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అలా చేయడం మన పరిమితుల్ని మనకు గుర్తు చేస్తుంది, మన పరలోక తండ్రిపై నమ్మకం పెంచుకోవడానికి కూడా సహాయం చేస్తుంది.​—సామెతలు 3:​5, 6.

ఉదాహరణ: ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి కావాల్సిన నిర్దేశం కోసం, తెలివి కోసం సొలొమోను వినయంగా ప్రార్థించాడు.​—1 రాజులు 3:​5-​12.

బాధల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు. బాధల్లో ఉన్నప్పుడు మనం యెహోవా ముందు మన హృదయాన్ని కుమ్మరిస్తే, మన మనసుకు ఊరటగా ఉంటుంది, అలాగే మనమీద కాకుండా యెహోవా మీద ఆధారపడడం నేర్చుకుంటాం.​—కీర్తన 62:8.

ఉదాహరణ: పెద్ద సైన్యం తన మీదికి దండెత్తి వచ్చినప్పుడు రాజైన ఆసా ప్రార్థించాడు.​—2 దినవృత్తాంతాలు 14:11.

అవసరంలో ఉన్నవాళ్ల కోసం చేసే ప్రార్థనలు. అలాంటి ప్రార్థనల వల్ల మనం కేవలం మన గురించే ఆలోచించుకోకుండా ఉంటాం, అలాగే ఇతరుల మీద ఎక్కువ కనికరం, సానుభూతి చూపించడం నేర్చుకుంటాం.

ఉదాహరణ: యేసు తన అనుచరుల కోసం ప్రార్థించాడు.​—యోహాను 17:9-17.

స్తుతిస్తూ చేసే ప్రార్థనలు. యెహోవా అద్భుతమైన పనుల్ని, లక్షణాల్ని బట్టి ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయనమీద మనకున్న గౌరవం, కృతజ్ఞత ఇంకా ఎక్కువౌతాయి. అలాంటి ప్రార్థనలు మన దేవుడూ తండ్రీ అయిన ఆయనకు మరింత దగ్గరవ్వడానికి సహాయం చేయవచ్చు.

ఉదాహరణ: దేవుని సృష్టిని చూసి దావీదు ఆయనను సంతోషంగా స్తుతించాడు.​—8వ కీర్తన.

ప్రార్థన ద్వారా మనం పొందే మరో ఆశీర్వాదం “మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి” మనకు ఉంటుంది. (ఫిలిప్పీయులు 4:7) కష్టాలతో నిండిన ఈ లోకంలో మనశ్శాంతితో ఉండడం నిజంగా ఒక అరుదైన ఆశీర్వాదం. దానివల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. (సామెతలు 14:30) అయితే అది పూర్తిగా కేవలం మన ప్రయత్నాల మీదే ఆధారపడి ఉంటుందా? లేదా ఇంకా ముఖ్యమైనది ఏదో కావాలా?

ప్రార్థన మనకు భౌతికంగా, భావోద్వేగపరంగా మంచి చేస్తుంది, మరిముఖ్యంగా దేవునికి దగ్గరవ్వడానికి సహాయం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి