విషయసూచిక
ఏప్రిల్ 15, 2010
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మే 31, 2010–జూన్ 6, 2010
యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి
3వ పేజీ
జూన్ 7-13, 2010
యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగిస్తున్నాడు?
7వ పేజీ
జూన్ 14-20, 2010
20వ పేజీ
జూన్ 21-27, 2010
మీరు క్రీస్తును పూర్తిగా అనుసరిస్తున్నారా?
24వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1వ అధ్యయన ఆర్టికల్ 3-7 పేజీలు
యౌవనస్థులు తన నిర్దేశాలను వినాలనీ, నేర్చుకోవాలనీ, వాటిని అనుసరించాలనీ యెహోవా ఆహ్వానిస్తున్నాడు. యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించేలా బైబిలు పఠనం, ప్రార్థన, మంచి ప్రవర్తన యౌవనస్థులకు ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
2వ అధ్యయన ఆర్టికల్ 7-11 పేజీలు
యెహోవా సంకల్పం తప్పక నెరవేరుతుంది. అది నెరవేరకుండా ఏ శక్తీ ఆపలేదు. ఆ సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో పరిశుద్ధాత్మ గతంలో ఎలా సహాయం చేసిందో, ఇప్పుడు ఎలా సహాయం చేస్తుందో, భవిష్యత్తులో ఎలా సహాయం చేయనుందో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
3వ అధ్యయన ఆర్టికల్ 20-24 పేజీలు
సాతాను లోకాంతం సమీపిస్తుండగా, యెహోవాతో మన సంబంధాన్ని పాడుచేయగల చిత్రాలు, దృశ్యాలు అనుక్షణం ప్రసారం చేయబడుతున్నాయి. వీటిలో కొన్ని ఏమిటి, వాటిని సాతాను ఎందుకు ఉపయోగిస్తున్నాడు, వాటి నుండి మనల్నిమనం ఎలా కాపాడుకోవచ్చు వంటి విషయాలను ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
4వ అధ్యయన ఆర్టికల్ 24-28 పేజీలు
దేవుని సేవలో ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలి? క్రీస్తును అనుసరిస్తూ ఉండాలంటే మనం ఏ మానవ బలహీనతతో పోరాడాలి? వంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు ఈ ఆర్టికల్ జవాబిస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను మీరు అనుమతిస్తారా? 13
శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది 16
మీరు “సురక్షితముగా” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు 29