కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 8/1 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సౌలు దావీదును అంతకుముందే తన సముఖంలో పనిచేయడానికి నియమించినా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత రాజైన సౌలు దావీదును “చిన్నవాడా, నీవెవని కుమారుడవు” అని ఎందుకు అడిగాడు?—1 సమూయేలు 16:22; 17:58.
  • దావీదు, సౌలు
    నా బైబిలు పుస్తకం
  • దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది
    నా బైబిలు కథల పుస్తకము
  • 1 సమూయేలు విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 8/1 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

సౌలు దావీదును అంతకుముందే తన సముఖంలో పనిచేయడానికి నియమించినా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత రాజైన సౌలు దావీదును “చిన్నవాడా, నీవెవని కుమారుడవు” అని ఎందుకు అడిగాడు?—1 సమూయేలు 16:22; 17:58.

సౌలు దావీదును మొదటిసారి కలిసినప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపలేదు కాబట్టి ఆయన దావీదును మర్చిపోయే అవకాశం ఉంది. అయితే, అది నిజం కాకపోవచ్చు ఎందుకంటే, సౌలు రాజు దావీదును ప్రత్యేకంగా పిలిపించాడనీ, అతణ్ణి బహుగా ఇష్టపడి, తన ఆయుధాలను మోసేవానిగా నియమించాడనీ 1 సమూయేలు 16:18-23లోని వృత్తాంతం చెబుతోంది. దావీదు ఎవరో సౌలుకు బాగా తెలిసేవుంటుంది.

1 సమూయేలు 17:12-31, 17:55—18:5 భాగాలను లేఖనాల్లో ఆ తర్వాత చేర్చారని కొందరు బైబిలు విద్వాంసులు భావిస్తున్నారు, ఎందుకంటే ఆ వచనాలు కొన్ని గ్రీకు సెప్టాజింట్‌ ప్రతులలో కనిపించవు, ఇది సా.శ.పూ. రెండవ శతాబ్దంలో పూర్తిచేయబడిన హెబ్రీ లేఖనాల అనువాదం. అయితే, కేవలం సెప్టాజింట్‌ యొక్క ఈ ప్రతుల ఆధారంగా ఆ ముగింపుకు రావడం సమంజసం కాదు ఎందుకంటే ఆ వాక్యాలు హీబ్రూ లేఖనాల ఇతర అధికారిక రాతప్రతుల్లో కనిపిస్తాయి.

సౌలు కేవలం దావీదు తండ్రెవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అబ్నేరును, తర్వాత దావీదును అలా ప్రశ్నించాడని అనిపించడంలేదు. గొల్యాతును ఓడించడంలో అంతటి ధైర్యసాహసాలను, గొప్ప విశ్వాసాన్ని కనబర్చిన దావీదులో అతని వ్యక్తిత్వపు క్రొత్త కోణాన్ని చూసిన సౌలు, అతణ్ణి ఎలాంటి తండ్రి పెంచాడో తెలుసుకోవాలనుకున్నాడు. దావీదు కుటుంబీకులకు కూడా అతనిలో ఉన్న ధైర్యసాహసాలే ఉండవచ్చు కాబట్టి అతని తండ్రియైన యెష్షయిని, ఇతర సభ్యుల్ని తన సైన్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశం కూడా సౌలుకు ఉండివుండవచ్చు.

1 సమూయేలు 17:58 లో దావీదు తాను “బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని” చెప్పిన సంక్షిప్త జవాబు మాత్రమే ఉన్నా, వారి సంభాషణ ఇంకా కొనసాగేవుంటుందని ఆ తర్వాతి మాటలు సూచిస్తున్నాయి. ఆ మాటలపై వ్యాఖ్యానిస్తూ సి. ఎఫ్‌. కైల్‌, ఎఫ్‌. డెలిట్జ్స్‌ ఇలా అన్నారు: “[1 సమూయేలు 18:1]లోని ‘దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు’ అనే పదబంధం మూలంగా, సౌలు దావీదుతో అతని కుటుంబ వ్యవహారాల గురించి చాలాసేపు మాట్లాడి ఉంటాడని స్పష్టమవుతోంది, ఎందుకంటే ఆ పదబంధం సుదీర్ఘమైన సంభాషణ జరిగి ఉంటుందని సూచిస్తోంది.”

కాబట్టి, దీనంతటి నుండి, దావీదు ఎవరో సౌలుకు అంతకుముందే తెలిసినా, “చిన్నవాడా, నీవెవని కుమారుడవు” అని ప్రశ్నించినప్పుడు, ఆయన దావీదు నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాడనే ముగింపుకు మనం రావచ్చు.

[31వ పేజీలోని చిత్రం]

సౌలు దావీదును, “నీవెవని కుమారుడవు” అని ఎందుకు అడిగాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి