కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 7/1 పేజీ 8
  • సర్వశ్రేష్ఠమైన ప్రేమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సర్వశ్రేష్ఠమైన ప్రేమ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సర్వోత్తమమైన” ప్రేమను మీరు చూపిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ప్రేమ (అగాపె)—ఏమి కాదు, ఏమైయుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’
    అప్రమత్తంగా ఉండండి!
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 7/1 పేజీ 8

సర్వశ్రేష్ఠమైన ప్రేమ

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో లేదా క్రొత్త నిబంధనలో అత్యధిక సందర్భాల్లో కనిపించే “ప్రేమ” అనే పదం, అగాపే అనే గ్రీకు పదం యొక్క అనువాదమే.

లేఖనాలపై అంతర్దృష్టిa (ఆంగ్లం) అనే రెఫరెన్సు గ్రంథం ఆ పద భావాన్ని వివరిస్తూ ఇలా చెబుతోంది: “సాధారణంగా ప్రజలు అనుకునేలా [అగాపే] కేవలం వ్యక్తిగత అనుబంధాన్నిబట్టి భావావేశంతో చూపే ప్రేమ కాదు. అయితే అది, ఏది యోగ్యమైనదో దాని ప్రకారం చిత్తశుద్ధితో ఇతరుల మేలు కోరుతూ చూపించబడుతుంది, అది సూత్రాన్ని, విధ్యుక్త ధర్మాన్ని, సరైన మర్యాదను పరిగణలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించుకున్నదాని అనుసారంగా చూపించే ప్రేమ. అగాపే (ప్రేమ) వ్యక్తిగత శత్రుత్వాలను అధిగమిస్తుంది, ఈ శత్రుత్వాలు సరైన సూత్రాలను విసర్జించి తిరిగి పగతీర్చుకునేలా చేసేందుకు అది ఎన్నడూ అనుమతించదు.”

అగాపేలో లోతైన భావాలు కూడా ఇమిడివుండగలవు. “ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమ [అగాపే] గలవారై యుండుడి” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 4:⁠8) కాబట్టి అగాపేలో హృదయం, మనస్సు రెండు చేరివుంటాయని చెప్పవచ్చు. సర్వశ్రేష్ఠమైన ఈ ప్రేమ యొక్క శక్తిని, పరిధిని చూపించే కొన్ని లేఖనాలను ఎందుకు పరిశీలించకూడదు? ఈ లేఖనాలు సహాయకరంగా ఉండవచ్చు: మత్తయి 5:43-47; యోహాను 15:12, 13; రోమీయులు 13:8-10; ఎఫెసీయులు 5:2, 25, 28; 1 యోహాను 3:15-18; 4:16-21.

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి