కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/15 పేజీ 32
  • అలంకార వస్తువులకన్నా మిన్నయైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అలంకార వస్తువులకన్నా మిన్నయైనది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/15 పేజీ 32

అలంకార వస్తువులకన్నా మిన్నయైనది

అపొస్తలుడైన పేతురు, సౌందర్య వర్ధక వస్తువులుగా స్త్రీలు ఉపయోగించే “బాహ్య సహాయకాలను” పేర్కొన్న తర్వాత, “మీది నిజమైన అంతరంగపు సౌందర్యం అయ్యుండాలి. అంటే మృదుత్వము, శాంతమనస్సు అనే వయస్సుతో సంబంధంలేని సౌందర్యం అయ్యుండాలి. దానికి దేవుడి దృష్టిలో గొప్ప విలువ ఉంది” అని సలహా ఇచ్చాడు.—1 పేతురు 3:3, 4, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

ఆసక్తికరంగా, ఈ అపొస్తలుడు, అలాంటి బాహ్య అలంకరణను గురించి వ్రాసినప్పుడు, కోస్మోస్‌ అనే గ్రీక్‌ పదరూపాన్ని ఉపయోగించాడు. అది “కాస్మెటిక్‌” అనే ఇంగ్లీష్‌ పదానికి మూలపదం కూడా. దాని అర్థం “అందంగా చేయడం, ముఖ్యంగా శరీరఛాయను.” క్రైస్తవ స్త్రీలు మేకప్‌ను గానీ, అలాంటి ఇతర సహాయకాలను గానీ ఉపయోగించడంపై పేతురు నిషేధాన్నుంచుతున్నాడా? ఆయనలా నిషేధిస్తున్నాడనే దానికి దేవుడి వాక్యంలో ఏ సూచనా లేదు. బదులుగా, ఈ విషయాన్ని అది వ్యక్తిగత నిర్ణయానికే వదిలేస్తుంది, కనుక, అభిరుచుల్లో కొంత మేరకు వైవిధ్యాలను ఎదురు చూడవచ్చు.

అయినప్పటికీ, మేకప్‌ను అతిగా లేక, ఇతరులనేకులను కలతపరచేంతగా ఉపయోగిస్తే, అది ఏ సందేశాన్ని తెలియజేస్తుంది? కాఠిన్యం, అణకువ లేనితనం, మంచి అభిరుచి లేనితనం, ప్రదర్శించుకోవడం, సొంత విషయాల్లో మాత్రం శ్రద్ధ చూపించడం వంటి వాటిలో ఒక దాన్నే కదా తెలియజేసేది? నిజానికి, అది ఒక స్త్రీ బాహ్య రూపానికి వన్నె తగ్గించవచ్చు, నైతికత లేనిదన్న తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు.—పోల్చండి యెహెజ్కేలు 23:36-42.

ఈ విషయాన్ని గుర్తించి, “దైవభక్తిగలవారమని చెప్పుకొను” స్త్రీ, తను సౌందర్య వర్ధక సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లయితే, తన ముఖం స్వస్థబుద్ధిని, మృదుత్వాన్నీ, దయనూ, నమ్రతనూ వెల్లడిచేసేలా ఉండేందుకు శ్రమించాలి. అలాంటి గుణాలు ఆమె అందాన్నీ, ఆకర్షణను ద్విగుణీకృతం చేస్తాయి. వాస్తవానికి, ఆమె మేకప్‌ ఉపయోగించాలనుకున్నా, వద్దనుకున్నా, ఆమె హుందాతనాన్నీ, ఆంతరంగిక సౌందర్యాన్నీ కనబరుస్తుంది. పైన ఉటంకించబడిన పేతురు మాటలు సూచిస్తున్నట్లు, అలంకార వస్తువులకన్నా మిన్నయైనది ఉన్నదని ఆమెకు తెలుసన్న విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.—1 తిమోతి 2:9, 10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి