కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/1 పేజీ 25
  • మీ పిల్లలతో చదవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పిల్లలతో చదవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/1 పేజీ 25

మీ పిల్లలతో చదవండి

వేజా అనే బ్రెజిలియన్‌ పత్రిక ప్రకారం, చదివే అలవాటులేని ఇండ్లలోని పిల్లలకన్నా శ్రద్ధగా చదివే అలవాటున్న ఇండ్లలోని పిల్లలే పుస్తకాలంటే మక్కువను ఎక్కువగా పెంచుకుంటారు. “కలిసి చదవడం తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత అధికం చేస్తుంది, పుస్తకాలలో ఉన్న విషయాలను పిల్లవాడు మరింత బాగా ఆకళింపు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది” అని పిల్లల పురోభివృద్ధి రంగంలో స్పెషలిస్ట్‌ అయిన మార్తా హోప్‌ పేర్కొంటున్నారు.

మీ పిల్లలకు బిగ్గరగా చదివి వినిపించడం పిల్లలు అడిగే ప్రశ్నలకు మీరు జవాబులనిచ్చే అవకాశాన్నికూడా ఇస్తుంది. మీరు చదువుతున్న భాగంలో చిత్రం ఏదైనా ఉంటే, మీరు ఆ చిత్రం గురించి కూడా చర్చించవచ్చు. “పిల్లవాడు పుస్తకంలో ఉన్న విషయాలను ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే, వాడు తనకు కలిగే జిజ్ఞాసను తీర్చుకోవాలనుకున్నప్పుడు వాడు పుస్తకాల కోసం ఎదురు చూసేందుకు పురికొల్పబడతాడు” అని హోప్‌ అంటున్నారు.

యెహోవాసాక్షుల్లోని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతోపాటు చదవడాన్ని ఆస్వాదిస్తారు. నా బైబిలు కథల పుస్తకము, గొప్ప బోధకుడు చెప్పేది వినడం (ఆంగ్లం), జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి వంటి పుస్తకాలను వాళ్ళు చదవవచ్చు.a ఇలాంటి పుస్తకాలు పిల్లలు మంచి చదువరులుగా మారడానికి సహాయపడడమే కాక, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న గ్రంథమైన పరిశుద్ధ బైబిలులో తమ ఆసక్తిని విస్తృతపర్చుకునేందుకు కూడా సహాయపడుతుంది. కనుక, మీరు తల్లి/తండ్రి అయితే, దేవుడి వాక్యాన్ని ఉత్సాహంగా చదివే వ్యక్తిగా ఉంటూ, మీ పిల్లలకు మాదిరినుంచండి. (యెహోషువ 1:7, 8) వారితోపాటు చదివేందుకు ఎలాగైనా సమయం తీసుకోండి!

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ ఆండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి