కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/15 పేజీలు 10-15
  • మీ బోధను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివుండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ బోధను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివుండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంఘంలో బోధించే బోధకులు
  • నమ్మడానికి ఒప్పించబడ్డారు
  • మీ బోధను గూర్చి శ్రద్ధ కలిగివుండడం
  • దేవుని వాక్య విద్యార్థులు
  • మీరు ఎవరికైతే బోధిస్తున్నారో వారిపట్ల ప్రేమా గౌరవాలు
  • వారి అవసరతలకు ప్రతిస్పందించడం
  • ఉత్సాహంగా ఉండండి!
  • మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ‘మిమ్మల్నీ, మీ బోధ వినేవారినీ రక్షించుకోండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యేసులా ప్రేమతో బోధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/15 పేజీలు 10-15

మీ బోధను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివుండండి

“నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త [“ఎల్లప్పుడూ శ్రద్ధ,” NW] కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమోతి 4:16.

1, 2. నేడు ఆసక్తిగల బోధకులు ఎందుకు ఆవశ్యకంగా అవసరమైయున్నారు?

“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) యేసుక్రీస్తు ఇచ్చిన ఈ ఆజ్ఞానుసారంగా క్రైస్తవులందరూ బోధకులై వుండడానికి కృషి చేయాలి. ఆసక్తిగల బోధకులు, సమయం మించిపోక ముందే దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందేలా యథార్థహృదయులకు సహాయం చేయడం అవసరం. (రోమీయులు 13:11) అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధించాడు: “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము.” (2 తిమోతి 4:2) ఆ పనికి, సంఘంలోనూ, సంఘం వెలుపలా బోధించడం అవసరం. వాస్తవానికి, ప్రకటించమని ఇవ్వబడిన ఆజ్ఞలో కేవలం దేవుని సందేశాన్ని తెలియజేయడం కంటే ఎక్కువే ఇమిడివుంది. ఆసక్తిగల వ్యక్తులు శిష్యులవ్వాలంటే ప్రభావవంతమైన బోధన అవసరం.

2 మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1) లౌకిక వేదాంతాలు, అబద్ధ బోధలు ప్రజల మనస్సులను అదే పనిగా కలుషితం చేస్తున్నాయి. చాలామంది ‘మానసికంగా అంధకారంలో ఉండి, నైతిక జ్ఞానాన్ని కోల్పోయారు.’ (ఎఫెసీయులు 4:18, 19, NW) కొంతమంది బాధాకరమైన భావోద్వేగ గాయాలతో బాధపడుతున్నారు. అవును, ప్రజలు నిజంగా “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి” ఉన్నారు. (మత్తయి 9:36) అయినప్పటికీ, బోధనా కళను ఉపయోగించడం ద్వారా, అవసరమైన మార్పులు చేసుకోవడానికి మనం యథార్థ హృదయులకు సహాయం చేయవచ్చు.

సంఘంలో బోధించే బోధకులు

3. (ఎ) బోధించమని యేసు ఇచ్చిన ఆజ్ఞలో ఏమి ఇమిడివుంది? (బి) సంఘంలో బోధించవలసిన ప్రాథమిక బాధ్యత ఎవరికుంది?

3 గృహ బైబిలు పఠన ఏర్పాటు ద్వారా లక్షలాదిమంది వ్యక్తిగత ఉ ప దే శాన్ని పొ రదు తు న్నా రు. అయితే, క్రొత్తవారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ‘వేరుపారి స్థిరపడడానికి’ వారికి అదనపు సహాయం అవసరం. (ఎఫెసీయులు 3:17) కాబట్టి మత్తయి 28:19, 20లలో ఉన్న యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తూ మనం క్రొత్త వ్యక్తులను యెహోవా సంస్థకు నడిపిస్తుండగా, వాళ్లు సంఘంలో చేయబడే బోధ నుండి ప్రయోజనం పొందుతారు. ఎఫెసీయులు 4:11-13 ప్రకారం, “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును,” పురుషులు ‘కాపరులుగా బోధకులుగా’ సేవచేయడానికి నియమించబడుతున్నారు. కొన్నిసార్లు, వారి బోధనాపనిలో, ‘సంపూర్ణ దీర్ఘశాంతముతో ఖండించడం, గద్దించడం, బుద్ధిచెప్పడం’ చేరివుంటాయి. (2 తిమోతి 4:2) బోధకుల పని చాలా ప్రాముఖ్యమైనది గనుక పౌలు కొరింథీయులకు వ్రాసేటప్పుడు బోధకులకు అపొస్తలులు మరియు ప్రవక్తల తరువాతి స్థానాన్ని ఇచ్చాడు.—1 కొరింథీయులు 12:28.

4. బోధించే సామర్థ్యం హెబ్రీయులు 10:24, 25లో వ్రాయబడివున్న పౌలు ఉద్బోధకు విధేయత చూపించేందుకు మనకెలా సహాయం చేస్తుంది?

4 నిజమే, క్రైస్తవులందరు పెద్దలుగా లేక పైవిచారణకర్తలుగా సేవ చేయరు. ఏదేమైనప్పటికీ, “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” ఒకరినొకరు పురికొల్పుకోవాలని అందరూ ప్రోత్సహించబడుతున్నారు. (హెబ్రీయులు 10:24, 25) కూటాల్లో అలా చేయడంలో, చక్కగా సిద్ధపడి హృదయపూర్వకంగా వ్యాఖ్యానించడం చేరివుంటుంది, అలా చేసే వ్యాఖ్యానాలు ఇతరులకు ఉపదేశించి, వారిని ప్రోత్సహించగలవు. అనుభవంగల రాజ్య ప్రచారకులు తాము ప్రాంతీయ పరిచర్యలో క్రొత్త వారితో కలిసి పనిచేసేటప్పుడు వారితో తమ జ్ఞానాన్నీ, అనుభవాన్నీ పంచుకొంటూ ‘సత్కార్యములు చేయడానికి పురికొల్పవచ్చు’ కూడా. అలాంటి సమయాల్లోనూ, అనియత సందర్భాల్లోనూ విలువైన ఉపదేశాన్ని అందజేయవచ్చు. ఉదాహరణకు, పరిణతి చెందిన స్త్రీలు “మంచి ఉపదేశము [“బోధ,” NW] చేయు” వారై ఉండాలని ఉద్బోధించబడుతున్నారు.—తీతు 2:3.

నమ్మడానికి ఒప్పించబడ్డారు

5, 6. (ఎ) నిజ క్రైస్తవత్వం అబద్ధ ఆరాధనకు ఎలా భిన్నంగా ఉంది? (బి) జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దలు క్రొత్తవారికి ఎలా సహాయం చేస్తారు?

5 కాబట్టి నిజ క్రైస్తవత్వం, తమ సభ్యుల ఆలోచనా సరళిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే అబద్ధమతాలకు పూర్తి భిన్నంగా ఉంది. యేసు భూమి మీద ఉన్నప్పుడు, అణిచివేసేటువంటి మానవ నిర్మితమైన అనేక పారంపర్యాచారాల ద్వారా మతనాయకులు ప్రజల జీవితాల్లోని దాదాపు ప్రతి అంశాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. (లూకా 11:46) క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులు తరచూ అలాగే చేశారు.

6. అయితే, సత్యారాధన అనేది మనం మన “వివేచనా శక్తి”తో సమర్పించే “పరిశుద్ధ సేవ.” (రోమీయులు 12:1, NW) యెహోవా సేవకులు “నమ్మడానికి ఒప్పించబడ్డారు.” (ఇటాలిక్కులు మావి.) (2 తిమోతి 3:14) కొన్నిసార్లు, నాయకత్వం వహిస్తున్నవారు సంఘం సాఫీగా సాగడానికి కొన్ని నిర్దేశాలను, కార్యవిధానాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే, పెద్దలు తోటి క్రైస్తవుల కోసం నిర్ణయాలు తీసుకునే బదులు, వారు “మేలు కీడులను వివేచిం[చేలా]” వారికి బోధిస్తారు. (హెబ్రీయులు 5:14) ప్రాథమికంగా, “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత” సంఘాన్ని పెంపారజేయడం ద్వారా పెద్దలు అలా చేస్తారు.—1 తిమోతి 4:6.

మీ బోధను గూర్చి శ్రద్ధ కలిగివుండడం

7, 8. (ఎ) సామర్థ్యాలు అంతంత మాత్రమేగల ప్రజలు బోధకులుగా ఎలా సేవ చేయగల్గుతున్నారు? (బి) ప్రభావవంతుడైన బోధకునిగా తయారు కావడానికి వ్యక్తిగతంగా ప్రయత్నం చేయడం అవసరమని ఏది సూచిస్తుంది?

7 అయితే, బోధించమని మనకందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ దగ్గరికి వద్దాం. ఈ పనిలో భాగం వహించడానికి, ఏవైనా ప్రత్యేక నైపుణ్యాలు, విద్య లేక సామర్థ్యాలు అవసరమా? తప్పనిసరి అనేమీ కాదు. చాలామేరకు, ఈ ప్రపంచవ్యాప్త బోధనా పని, సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్న సాధారణ వ్యక్తుల ద్వారానే నిర్వహించబడుతోంది. (1 కొరింథీయులు 1:26-29) పౌలు ఇలా వివరిస్తున్నాడు: “అయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో [అపరిపూర్ణ శరీరాలలో] ఈ ఐశ్వర్యము [పరిచర్య] మాకు కలదు.” (2 కొరింథీయులు 4:7) భూగోళవ్యాప్త రాజ్య ప్రకటన పనికి లభించిన అపరిమితమైన సాఫల్యం యెహోవా ఆత్మ శక్తికి ఒక నిదర్శనం!

8 ఏదేమైనప్పటికీ, “సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని [“బోధించువాని,” NW] గాను” తయారవ్వడానికి హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా ప్రయత్నం చేయడం అవసరం. (2 తిమోతి 2:15) పౌలు తిమోతికిలా ఉద్బోధించాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త [“ఎల్లప్పుడూ శ్రద్ధ,” NW] కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) సంఘంలోనైనా లేక సంఘం వెలుపలైనా సరే ఒకరు తాను చేసే బోధ విషయంలో ఎలా శ్రద్ధ చూపవచ్చు? అలా శ్రద్ధచూపడంలో కొన్ని నైపుణ్యాలను లేక బోధనా నిపుణతలను తప్పక సాధకం చేయడం ఇమిడి ఉంటుందా?

9. సహజసిద్ధమైన సామర్థ్యాలకంటే మరింత ప్రాముఖ్యమైనదేమిటి?

9 యేసు తాను కొండమీద ఇచ్చిన ప్రసిద్ధి గాంచిన ప్రసంగంలో, తాను బోధనా పద్ధతులను బాగా ఆకలింపు చేసుకున్నానని స్పష్టంగా చూపించాడు. ఆయన మాట్లాడడం ముగించినప్పుడు, “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) నిజమే, యేసు బోధించినంత చక్కగా మనమెవరమూ బోధించలేము. అయితే, ప్రభావవంతమైన బోధకులుగా ఉండడానికి మనం శక్తివంతమైన ప్రసంగీకులమై ఉండనవసరం లేదు. అంతెందుకు, యోబు 12:7 ప్రకారం చివరికి ‘మృగములు’ మరియు ‘ఆకాశపక్షులు’ కూడా నిశ్శబ్దంగా బోధించగలవు! మనకున్న సహజసిద్ధమైన సామర్థ్యాలు లేక నైపుణ్యాల కన్నా ఎంతో ప్రాముఖ్యమైనది, మనం “ఎలాంటి వ్యక్తులమై” ఉన్నాము అన్నదే, అంటే మనకు ఎలాంటి లక్షణాలున్నాయి, విద్యార్థులు అనుకరించదగిన ఏ ఆధ్యాత్మిక అలవాట్లను మనం అలవర్చుకున్నాము అన్నవే.—2 పేతురు 3:11, NW; లూకా 6:40.

దేవుని వాక్య విద్యార్థులు

10. దేవుని వాక్య విద్యార్థిగా యేసు ఎలా చక్కని మాదిరినుంచాడు?

10 లేఖన సత్యాల ప్రభావవంతమైన బోధకుడు దేవుని వాక్య విద్యార్థియై ఉండాలి. (రోమీయులు 2:21) ఈ విషయంలో యేసుక్రీస్తు అసాధారణమైన మాదిరిని ఉంచాడు. యేసు తన పరిచర్య కాలంలో, హెబ్రీ లేఖనాల్లోని దాదాపు సగం పుస్తకాలను ఉదాహరించాడు లేక వాటిలో ఉన్న వాక్యాలకు సమాంతరమైన తలంపులను వ్యక్తపర్చాడు.a దేవుని వాక్యంతో ఆయనకున్న పరిచయం, 12 ఏళ్ల వయస్సులో ఆయన “దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు” కనిపించినప్పుడే విధితమైంది. (లూకా 2:46) పెద్దవాడయ్యాక, దేవుని వాక్యం చదువబడుతూ ఉండే సమాజమందిరానికి యేసు వాడుకగా వెళ్లేవాడు.—లూకా 4:16.

11. ఒక బోధకుడు ఏ మంచి పఠన అలవాట్లను అలవర్చుకోవాలి?

11 మీరు దేవుని వాక్యాన్ని అత్యంతాసక్తితో చదువుతారా? దాన్ని త్రవ్వడం ద్వారా, ‘యెహోవాయందు భయభక్తులు కలిగివుండడమంటే ఏమిటో మీరు గ్రహిస్తారు, దేవుని గురించిన విజ్ఞానము మీకు లభిస్తుంది.’ (సామెతలు 2:4, 5) కాబట్టి మంచి పఠన అలవాట్లను వృద్ధిచేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యంలోనుండి కొంతభాగాన్ని చదవడానికి ప్రయత్నించండి. (కీర్తన 1:2) కావలికోట, తేజరిల్లు! ప్రతికల ప్రతి సంచికా వచ్చిన వెంటనే చదవడాన్ని అలవాటు చేసుకోండి. సంఘ కూటాల్లో బాగా శ్రద్ధ నిలపండి. జాగ్రత్తగా పరిశోధన చేయడం నేర్చుకోండి. ‘అన్నిటిని తరచి చూచి పరిష్కారముగా తెలుసుకోవడాన్ని’ నేర్చుకోవడం ద్వారా, మీరు బోధించేటప్పుడు అతిశయోక్తిగా చెప్పడాన్ని లేక పొరపాట్లు చెప్పడాన్ని నివారించవచ్చు.—లూకా 1:3.

మీరు ఎవరికైతే బోధిస్తున్నారో వారిపట్ల ప్రేమా గౌరవాలు

12. యేసుకు తన శిష్యుల పట్ల ఎలాంటి దృక్పథం ఉండేది?

12 మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, మీరు ఎవరికైతే బోధిస్తున్నారో వారిపట్ల సరైన దృక్పథం కల్గివుండడం. యేసు చెప్పేది వింటున్న వారిని పరిసయ్యులు తృణీకరించారు. “ధర్మశాస్త్ర మెరుగని యూ జనసమూహము శాపగ్రస్తమైనదని” వాళ్లన్నారు. (యోహాను 7:49) కాని యేసుకు తన శిష్యుల పట్ల ప్రగాఢమైన ప్రేమా, గౌరవం ఉండేవి. ఆయనిలా అన్నాడు: “దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహాను 15:15) యేసు శిష్యులు తమ బోధనా పనిని ఎలా కొనసాగించాలనేదానిని ఇది సూచించింది.

13. పౌలు తాను ఎవరికైతే బోధించాడో వారిని గురించి ఎలా భావించాడు?

13 ఉదాహరణకు, పౌలు తన విద్యార్థులతో ఉదాసీనమైన సంబంధాన్ని, వ్యాపార సంబంధాల్లాంటి సంబంధాన్ని కలిగివుండలేదు. ఆయన కొరింథీయులకిలా చెప్పాడు: “క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమందియున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని.” (1 కొరింథీయులు 4:15) కొన్నిసార్లు, పౌలు తాను ఎవరికైతే బోధించాడో వారిని మందలించేటప్పుడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 20:31) ఆయన విశేషమైన సహనాన్ని, కనికరాన్ని కూడా చూపించాడు. అందుకే ఆయన థెస్సలొనీకయులకు ఇలా చెప్పగలిగాడు: “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.”—1 థెస్సలొనీకయులు 2:7.

14. మనం మన బైబిలు విద్యార్థుల పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించడం ఎందుకంత ప్రాముఖ్యం? ఉదాహరించండి.

14 మీరు యేసునూ, పౌలునూ అనుకరిస్తున్నారా? మన విద్యార్థుల పట్ల మనకుగల యథార్థమైన ప్రేమ, బహుశ సహజసిద్ధమైన సామర్థ్యాల విషయంలో మనకున్న లోపాలను పూరించవచ్చు. మనకు మన బైబిలు విద్యార్థులపట్ల వ్యక్తిగతంగా యథార్థమైన ఆసక్తి ఉందని వాళ్లు గ్రహించగల్గుతున్నారా? వారి గురించి తెలుసుకోవడానికి మనం సమయాన్ని వెచ్చిస్తామా? తన విద్యార్థిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి సహాయం చేయడం కష్టంగా ఉన్నట్లు ఒక క్రైస్తవ స్త్రీకి అనిపించినప్పుడు, “ఏదైనా మిమ్మల్ని బాధపెడుతోందా?” అని ఆ విద్యార్థినిని దయాపూర్వకంగా అడిగింది. దానితో ఆ విద్యార్థిని తనకున్న అనేకానేక వ్యాకులతల గురించీ, చింతల గురించీ చెబుతూ తన అంతర్గత భావాలను వ్యక్తపర్చింది. ఆ ప్రేమపూర్వకమైన సంభాషణ ఆమెకు ఒక మలుపురాయిలా పని చేసింది. అలాంటి సందర్భాల్లో లేఖనాల నుండి కొన్ని తలంపులను తెలియజేసి, ఓదార్పునిచ్చి, ప్రోత్సహించడం సముచితంగా ఉంటుంది. (రోమీయులు 15:4) ఒక హెచ్చరిక ఏమిటంటే: ఒక బైబిలు విద్యార్థి శీఘ్రగతిన అభివృద్ధి సాధిస్తుండవచ్చు, అయినప్పటికీ ఆయన అధిగమించవలసిన క్రైస్తవ వ్యతిరేక విధానాలు కొన్ని ఉండివుండవచ్చు. కాబట్టి ఆ వ్యక్తితో మరీ సన్నిహితంగా కలిసిమెలిసి ఉండడం జ్ఞానయుక్తం కాకపోవచ్చు. సరైన క్రైస్తవ హద్దులను పాటించడం మంచిది.—1 కొరింథీయులు 15:33.

15. మనం మన బైబిలు విద్యార్థుల పట్ల గౌరవాన్ని ఎలా చూపించవచ్చు?

15 మన విద్యార్థుల పట్ల గౌరవం కల్గివుండడంలో వారి వ్యక్తిగత జీవితాలను అదుపు చేయడానికి ప్రయత్నించకపోవడం కూడా ఇమిడివుంది. (1 థెస్సలొనీకయులు 4:11) ఉదాహరణకు, వివాహం చేసుకోకుండా ఒక పురుషునితో కలిసి జీవిస్తున్న స్త్రీతో మనం పఠిస్తుండవచ్చు. బహుశ వారిద్దరికి పిల్లలు పుట్టివుండవచ్చు. దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందినందున, ఆ స్త్రీ తన పరిస్థితులను యెహోవాకు అనుగుణ్యమైన విధంగా మార్చుకోవాలని కోరుకోవచ్చు. (హెబ్రీయులు 13:4) ఆమె ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలా లేక అతని నుండి విడిపోవాలా? ఆధ్యాత్మిక ఆసక్తి అంతగాలేని లేక అసలులేని ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆమె భవిష్యద్‌ అభివృద్ధిని ఆటంకపర్చగలదని మనం బహుశ బలంగా అనుకోవచ్చు. మరో వైపున, మనం ఆమె పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచించి ఆమె ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడమే మంచిదనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ, విద్యార్థి జీవితంలో జోక్యం చేసుకుంటూ, అలాంటి విషయాల్లో మన స్వంత అభిప్రాయాలను వారిపై రుద్దడానికి ప్రయత్నించడం అమర్యాదకరమైనది, ప్రేమరహితమైనది. ఎంతైనా, తీసుకున్న నిర్ణయం వలన వచ్చే పర్యవసానాలతో జీవించవలసింది ఆమే కదా. కాబట్టి అలాంటి విద్యార్థి తన స్వంత “జ్ఞానేంద్రియములు” ఉపయోగించి, తాను ఏమి చేస్తాననేది తనకు తానుగా నిర్ణయించుకోవడానికి ఆమెకు తర్ఫీదివ్వడం శ్రేష్ఠమైనపని కాదంటారా?—హెబ్రీయులు 5:14.

16. పెద్దలు దేవుని మంద పట్ల ప్రేమా గౌరవాలను ఎలా చూపించవచ్చు?

16 మందపట్ల ప్రేమా గౌరవాలతో వ్యవహరించడం సంఘ పెద్దలకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యం. ఫిలమోనుకు వ్రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, . . . ప్రేమనుబట్టి . . . వేడుకొనుచున్నాను.” (ఫిలేమోను 8) కొన్నిసార్లు, సంఘంలో చికాకు కలిగించే పరిస్థితులు తలెత్తవచ్చు. కఠినంగా ఉండడం కూడా అవసరమవ్వవచ్చు. “విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము [తప్పిదస్థులను] కఠినముగా గద్దింపుము” అని పౌలు తీతుకు ఉద్బోధించాడు. (తీతు 1:13) అయినప్పటికీ, పెద్దలు సంఘంతో ఎన్నడూ దయలేని విధంగా మాట్లాడకుండా ఉండడానికి కృషి చేయాలి. “ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను” అని పౌలు వ్రాశాడు.—2 తిమోతి 2:26; కీర్తన 141:3.

17. మోషే ఏ పొరపాటు చేశాడు, దాని నుండి పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు?

17 పైవిచారణ కర్తలు తాము “దేవుని మంద”తో వ్యవహరిస్తున్నామని తమకు తాము ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండాలి. (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 5:2) మోషే ఎంతో సాత్వికుడే అయినప్పటికీ, కొంతమేరకు ఆ దృక్కోణాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలీయులు “అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.” (కీర్తన 106:33) వాళ్లు, అంటే తన మందలోని వాళ్లు నిరపరాధులు కాకపోయినప్పటికీ, మోషే వాళ్లతో సరిగా వ్యవహరించనందుకు దేవుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. (సంఖ్యాకాండము 20:2-12) నేడు అలాంటి సవాళ్లనే ఎదుర్కున్నప్పుడు, పెద్దలు అంతర్దృష్టితోనూ, కనికరంతోనూ బోధించడానికి, ఉపదేశించడానికి కృషి చేయాలి. మన సహోదరులు సరిదిద్దడానికి వీలుకానంత తప్పిదస్థులు అన్నట్లు దృష్టించే బదులు, సహాయం అవసరమున్న వ్యక్తులన్నట్లు వారితో వ్యవహరించినప్పుడు వారు మెరుగైన విధంగా ప్రతిస్పందిస్తారు. “మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము” అని చెప్పినప్పుడు పౌలుకుండిన అనుకూలమైన దృక్పథాన్నే పెద్దలు కలిగివుండాలి.—2 థెస్సలొనీకయులు 3:4.

వారి అవసరతలకు ప్రతిస్పందించడం

18, 19. (ఎ) పరిమితమైన సామర్థ్యాలు గల బైబిలు విద్యార్థుల అవసరాలకు మనమెలా ప్రతిస్పందించాలి? (బి) నిర్దిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడం కష్టంగావున్న విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు?

18 ప్రభావవంతమైన బోధకుడు తన విద్యార్థుల సామర్థ్యాలకు, పరిమితులకు అనుగుణంగా తన బోధనా పద్ధతిని మార్చుకునేందుకు సుముఖంగా ఉంటాడు. (పోల్చండి యోహాను 16:12.) తలాంతులను గూర్చిన యేసు ఉపమానంలోని యజమాని “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” ఆధిక్యతలను ఇచ్చాడు. (మత్తయి 25:15) బైబిలు పఠనాలు నిర్వహించేటప్పుడు మనం అదే మాదిరిని అనుసరించవచ్చు. సహజంగానే, బైబిలు ఆధారిత ప్రచురణను సహేతుకంగా తక్కువ సమయంలో ముగించడం కోరదగిన విషయమే. అయితే, చదివే సామర్థ్యం అందరికీ అంతగా లేకపోవచ్చుననీ లేక క్రొత్త తలంపులను అందరూ అంత త్వరగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ అంగీకరించవలసిందే. కాబట్టి ప్రతిస్పందించే వ్యక్తులు త్వరితగతిన పఠనం చేయడం కష్టంగా ఉన్నప్పుడు, పఠనంలో ఒక విషయాంశం నుండి మరో విషయాంశాన్ని చర్చించడానికి ఎప్పుడు వెళ్లాలనే విషయంలో వివేచన అవసరం. ఒక నిర్ణీత గతిన పఠన సమాచారాన్ని ముగించడం కంటే, విద్యార్థులు తాము నేర్చుకుంటున్నది గ్రహించేందుకు వారికి సహాయం చేయడమే మరింత ప్రాముఖ్యమైనది.—మత్తయి 13:51.

19 త్రిత్వం లేక మతసంబంధమైన పండుగలు వంటి నిర్దిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్న బైబిలు విద్యార్థుల విషయంలో కూడా ఇది వాస్తవం. బైబిలు ఆధారితంగా చేసిన పరిశోధనా సమాచారాన్ని మన పఠనాల్లో ఇమడ్చడం సాధారణంగా అనవసరమే అయినప్పటికీ, అలా చేయడం స్పష్టంగా ప్రయోజనకరమౌతుందనుకొన్నప్పుడు మనం అప్పుడప్పుడు అలా చేయవచ్చు. విద్యార్థి పురోభివృద్ధిని అనవసరంగా తగ్గించివేయకుండా ఉండేందుకు మంచి వివేచనను ఉపయోగించాలి.

ఉత్సాహంగా ఉండండి!

20. తన బోధలో ఉత్సాహాన్ని, నిశ్చయతను చూపించే విషయంలో పౌలు ఎలా మాదిరినుంచాడు?

20 “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి అని పౌలు చెబుతున్నాడు. (రోమీయులు 12:11) అవును, మనమొక గృహ బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్నా లేక సంఘ కూటంలోని ఒక కార్యక్రమంలో భాగం వహిస్తున్నా మనం ఆసక్తితోనూ, ఉత్సాహంగానూ చేయాలి. పౌలు థెస్సలొనీకయులకు ఇలా చెప్పాడు: “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.” (1 థెస్సలొనీకయులు 1:4) కాబట్టి పౌలు, ఆయన సహచరులు “దేవుని సువార్తను మాత్రము గాక [తమ] ప్రాణములనుకూడ” ఇచ్చారు.—1 థెస్సలొనీకయులు 2:8.

21. మనం మన బోధనా నియామకాల పట్ల ఉత్సాహవంతమైన దృక్పథాన్ని ఎలా కలిగివుండవచ్చు?

21 మనం చెప్పేదాన్ని మన బైబిలు విద్యార్థులు వినాలన్న మన దృఢ నిశ్చయతలో నుండే నిజమైన ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏ బోధనా నియామకాన్నైనా మనం కేవలం సాధారణ విషయమన్నట్లు పరిగణించకుండా ఉందాం. శాస్త్రియైన ఎజ్రా తన బోధకు సంబంధించి ఈ విషయంలో కచ్చితంగా శ్రద్ధనిచ్చాడు. ఆయన “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును [“బోధించుటకును,” NW] దృఢనిశ్చయము చేసికొనెను.” (ఎజ్రా 7:10) చక్కగా సిద్ధపడడం ద్వారానూ, సమాచారం యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించడం ద్వారానూ మనం కూడా అలాగే చేయాలి. మనల్ని విశ్వాసంతోనూ, నిశ్చయతతోనూ నింపమని యెహోవాకు ప్రార్థిద్దాం. (లూకా 17:5) మన ఉత్సాహం, బైబిలు విద్యార్థులు సత్యం పట్ల నిజమైన ప్రేమను పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేయగలదు. అయితే, మన బోధకు శ్రద్ధనివ్వడంలో, నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాలను ఉపయోగించడం కూడా ఇమిడివుండవచ్చు. వీటిలో కొన్నింటి గురించి తదుపరి శీర్షిక చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, పేజీ 1071 చూడండి.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ నైపుణ్యంగల క్రైస్తవ బోధకులు నేడెందుకు అవసరం?

◻ మనం ఏ మంచి పఠన అలవాట్లను వృద్ధి చేసుకోవచ్చు?

◻ మనం ఎవరికైతే బోధిస్తామో వారిపట్ల ప్రేమా గౌరవాలను కల్గివుండడం ఎందుకు ప్రాముఖ్యం?

◻ మనం మన బైబిలు విద్యార్థుల అవసరాలకు ఎలా ప్రతిస్పందించవచ్చు?

◻ ఇతరులకు బోధించేటప్పుడు ఉత్సాహం, నిశ్చయత కల్గివుండడం ఎందుకు ప్రాముఖ్యం?

[10వ పేజీలోని చిత్రం]

మంచి బోధకులు తాము స్వయంగా దేవుని వాక్య విద్యార్థులై ఉంటారు

[13వ పేజీలోని చిత్రం]

బైబిలు విద్యార్థుల గురించి వ్యక్తిగతంగా ఆసక్తి కలిగివుండండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి