పండితుడు బైబిలు చేవ్రాత ప్రతికి క్రొత్త తేదీనివ్వడం
జర్మనీ లోని పురాతన పత్ర లేఖనాల (పాపరాలజీ) నిపుణుడైన కార్స్టన్ పీటర్ టిడె చెప్పిన ప్రకారంగా, (మాగ్డలన్ పపైరస్ వ్రాతప్రతిగా సుపరిచితమైన) మత్తయి సువార్త పపైరస్ వ్రాతప్రతిలోని మూడు చిన్న అవశేషాలు మొదటి శతాబ్దంలోనే వ్రాయబడ్డాయనడానికి దృఢమైన సాక్ష్యం ఉంది.
(మత్తయి 26వ అధ్యాయంలోని కొన్ని భాగాలు చేరివున్న) వ్రాతప్రతి అవశేషాల్ని ఈజిప్టులో దొరికిన పురాతన వ్యాపార పత్రంతో పోల్చి చూసిన తర్వాత, ఆ ఐగుప్తీయల పత్రాన్ని “సాధారణంగా కన్పించే తీరులోనూ, ఆకారంలోనూ, ఉత్తరాల రూపకల్పనలోనూ దాదాపుగా ఒక్కలానే ఉన్న మాగ్డలన్ పపైరస్ వ్రాతప్రతి”ని పోలివున్నట్టు టిడె గమనించాడు. టిడె, సహ గ్రంథకర్తయైన మాథ్యూ డాన్ఖోన, యేసుకు ప్రత్యక్షసాక్షులు—సువార్తల ఆవిర్భావాన్ని గూర్చిన క్రొత్త వ్రాతప్రతి ఇచ్చిన ఆశ్చర్యపర్చే రుజువు (ఆంగ్లం) అనే తమ పుస్తకంలో ఆ రెండు పత్రాల మధ్యనున్న పోలికలు అవి రెండూ ఒకే కాలంలో వ్రాయబడ్డాయని సూచిస్తున్నాయనే నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడు వ్రాయబడ్డాయి? ఆ వ్యాపార పత్రం, నీరో చక్రవర్తి పాలనలో 12వ ఏట, ఇపీఫ్ నెల 30వ తారీఖు [నాటిదని] అంటే మన క్యాలెండరు ప్రకారంగా [సా.శ.] 66 జూలై 24” నాటిదని తేదీ లెక్కించడం జరిగింది.
“ఈ తారీఖే గనక ఖచ్చితమైన తారీఖైతే, ఇదెంతో ప్రాముఖ్యమైన తారీఖు. ఎందుకంటే, మత్తయి సువార్త చేతివ్రాత ప్రతి ఒకటి అది వ్రాయబడిన శతాబ్దంలోనే వ్రాయబడిందని అది రుజువు చేస్తోంది” అని టిన్డేల్ బులెటిన్లో ప్రచురించబడిన ఒక శీర్షికలో ప్రొఫెసర్ ఫిలిప్ డబ్ల్యు. కంపర్ట్ వ్యాఖ్యానిస్తున్నాడు. అది మాగ్డలన్ పపైరస్ వ్రాతప్రతిని ఉనికిలో ఉన్న అతి పురాతన సువార్త వ్రాతప్రతి అవశేషాలుగా కూడా చేస్తుంది.
[29వ పేజీలోని చిత్రం]
మాగ్డలన్ పపైరస్, అసలు సైజు చూపించబడింది
[క్రెడిట్ లైను]
By permission of the President and Fellows of Magdalen College, Oxford