కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/15 పేజీ 32
  • మీకు ఎలాంటి పేరు ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు ఎలాంటి పేరు ఉంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/15 పేజీ 32

మీకు ఎలాంటి పేరు ఉంది?

బైబిలులో “పేరు” అనే పదం కొన్నిసార్లు ఒక వ్యక్తికి గల కీర్తిని సూచిస్తుంది. ఉదాహరణకు, జ్ఞానవంతుడైన రాజు సొలొమోను ఇలా వ్రాశాడు: “సుగంధతైలము కంటె మంచి పేరు మేలు; ఒకని జన్మదినము కంటె మరణదినమే మేలు.” (ప్రసంగి 7:1; సామెతలు 22:1 పోల్చండి.) సొలొమోను మాటల ప్రకారం ఒక మనిషి మంచి పేరుతో జన్మించడు. అందుకు బదులుగా, అసలైన కీర్తిని ఆయన సంపాదించేది తన జీవిత కాలంలోనే. ఒక వ్యక్తి ఉదారతగలవాడా లేక స్వార్థపరుడా, దయగలవాడా లేక నిర్దయుడా, వినయంగలవాడా లేక అహంకారం గలవాడా చివరికి నీతి గలవాడా లేక దుష్టుడా అనేది ఆ వ్యక్తియొక్క పేరు గుర్తిస్తుంది.

దావీదును పరిశీలించండి. తన రాజ్య పరిపాలనలో ఆయన తనను తాను బలవంతునిగా అచంచల విశ్వాసం గలవానిగా నిరూపించుకున్నాడు. అదే సమయంలో దావీదు తన తప్పులను, ఘోరమైన పాపాలను వినయంతో ఒప్పుకుని పశ్చాత్తాపం చూపించాడు. అందుకే యెహోవా ప్రవక్త సరియైన రీతిలోనే దావీదు “[దేవుని] చిత్తానుసారమైన మనస్సుగల”వాడని యెహోవా ప్రవక్త వర్ణించాడు. (1 సమూయేలు 13:14) యౌవనుడైన దావీదు అప్పటికే దేవునితో మంచి పేరును సంపాదించాడు.

దీనికి వ్యత్యాసంగా, యూదా రాజైన యెహోరాము చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఆయన తన ప్రజలను యెహోవా ఆరాధన నుండి మళ్ళించాడు, తన ఆరుగురు సహోదరులను మరియు యూదా అధిపతులను హతము చేశాడు. చివరికి, మరణానికి నడిపే బాధాకరమైన వ్యాధితో యెహోవా ఆయనను మొత్తాడు. బైబిలు యెహోరామును గూర్చి “యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను” అని తెలియజేస్తుంది. దాన్నే టుడేస్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌ “అతను మరణించినప్పుడు ఎవరూ దుఃఖించలేదని” అనువదించింది.—2 దినవృత్తాంతములు 21:20.

దావీదు, యెహోరాముల జీవిత విధానాలు బైబిలు సామెత యొక్క నిజత్వాన్ని రుజువు చేస్తున్నాయి: “నీతిమంతుని జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును.” (సామెతలు 10:7) కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను గంభీరంగా పరిశీలించవలసిన అవసరమున్నది, ‘దేవునితోను, తోటివారితోను నేను ఎలాంటి పేరు సంపాదిస్తున్నాను?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి