కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/15 పేజీలు 3-4
  • మీకు సంరక్షక దూత ఉన్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు సంరక్షక దూత ఉన్నాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతలంటే పరవశులైపోవడం
  • దేవదూతలు అంటే ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవుని దూతలు సహాయం చేస్తారు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/15 పేజీలు 3-4

మీకు సంరక్షక దూత ఉన్నాడా?

మీకు ఒక సంరక్షక దూత ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? చాలా మంది తమకు ఉన్నారని నమ్ముతారు. ఆ మాటకొస్తే, పశ్చిమ కెనడాలోని ఒక స్త్రీ దూతలను ఏర్పాటు చేసే ప్రత్యేక వరాన్ని కలిగివున్నట్లు చెప్పుకుంటున్నారు. 200 డాలర్లనూ మీ పేరునూ ఆమెకు ఇస్తే, మీకు ఒక సంరక్షక దూతతో సంబంధాన్ని కుదిర్చిపెడ్తానని ఆమె చెబుతుంది. ఆమె మొదట, క్రొవ్వొత్తి వెలిగించి దాని జ్వాలపై ఏకాగ్రత నిలిపి ధ్యానిస్తుంది. ఆ తర్వాత, ఆమెకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో మీ దూత ఆమెకు కనిపించి మీకు తెలియజేయవలసిన సందేశాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇంకా అదనంగా, ఆమె మీ దూత ఎలా ఉంటాడో గీసి చూపిస్తుంది.

ఇది కొంతమందికి ఫ్రెంచ్‌ కింగ్‌ లూయీస్‌ IX కథకు సమానమైనదిగా అనిపిస్తుంది. ప్రధాన దూతయైన మిఖాయేలు రెక్కల నుండి పడిపోయినవని చెప్పబడుతున్న ఈకలను ఆయన చాలా ఖరీదుకు కొన్నట్లు ఊహించబడుతుంది. అనేకులు ఆ కథను సందేహిస్తున్నా ఈ కెనడా స్త్రీ చెబుతున్నదానిని మాత్రం వెంటనే నమ్మేస్తున్నారు.

దేవదూతలంటే పరవశులైపోవడం

ఇటీవలి సంవత్సరాల్లో, దేవదూతలపై చాలా గొప్ప ఆసక్తి చూపించబడుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని ఓదార్చుతున్న, తమకు ప్రియమైనవాళ్ళు చనిపోవడం వల్ల దుఃఖితులైనవారిని సాంత్వనపర్చుతున్న, బుద్ధిని అభ్యసింపజేస్తున్న, వ్యక్తులను మరణం నుండి తప్పిస్తున్న దూతల గురించి టెలివిజన్‌లోనూ, సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ, పత్రికల్లోనూ, వార్తాలేఖల్లోనూ మనకు తెలియజేయబడుతుంది. అమెరికాలో దాదాపు రెండు కోట్లమంది టీవీ వీక్షకులు ప్రజల జీవితాల్లో దేవదూతలు జోక్యం చేసుకోవడాన్ని చిత్రీకరించే వారపు టెలివిజన్‌ పరంపరలను చూస్తారు. ఒక బుక్‌స్టోర్‌ ముఖ్యంగా దేవదూతల గురించి చర్చించే 400 పుస్తకాల లిస్టును ఇస్తుంది.

సంరక్షక దేవదూతలు పోరాటంలో సైనికుల ప్రాణాలను కాపాడిన అనుభవాలను ఇటీవలి పుస్తకం చెబుతుంది. సంరక్షక దూతలు డ్రైవర్లను కాపాడుతున్నట్లు ఆటోమొబైల్‌ బంపర్‌ స్టిక్కర్‌లు చెబుతున్నాయి. సంస్థలు, సమావేశాలు, సెమినార్లు దూతలను గూర్చిన పఠనాన్ని ప్రబలం చేస్తున్నాయి, అవి ప్రజలు దూతలతో విషయాలను చర్చించుకునేలా సహాయపడేందుకేనని చెప్పబడుతున్నాయి.

ఐలీన్‌ ఫ్రీమ్యాన్‌ అనే స్త్రీ దేవదూతల గురించిన మూడు పుస్తకాల రచయిత్రి, అలాగే ప్రత్యేకంగా దేవదూతల కోసమే అంకితం చేసిన ఒక పత్రిక ప్రకాశకురాలు. “పరలోకంలో ఎంత మంది దూతలు ఉన్నారో భూమి మీద కూడా అంత మంది దూతలు ఉన్నారు. పరలోక మండలంలో దేవుడ్ని స్తుతించడం మాత్రమే కాదు కానీ, మానవులనూ, భూమి మీది ఇతర ప్రాణులను సరిగ్గా చూసుకోవడం కూడా వాళ్ళ కర్తవ్యమే. మనలో ప్రతి ఒక్కరికి, మనం గర్భాశయంలో రూపొందినప్పుడు ఒక్కొక్క సంరక్షక దూత నియమించబడతాడు. ఆ దూత అప్పుడు మొదలుకొని మనం గర్భాశయంలో పెరిగే వరకూ, జన్మించే వరకూ, ఈ లోకంలో మన జీవితాంతం వరకూ మనపై శ్రద్ధ చూపిస్తాడు. ఈ లోకపు బంధనాలనుండి మనలను పరలోక మహిమలోకి తీసుకొనిపోయే వరకు కూడా ఆయన మనపై శ్రద్ధ చూపిస్తాడు” అని ఆమె వాదిస్తుంది. ఇది సంరక్షక దూతలను గురించిన ప్రబలిత అభిప్రాయాన్ని చక్కగా వర్ణిస్తుంది.

ఒత్తిళ్ళతో కూడిన ఈ కాలంలో, ఇబ్బందికరమైన ఈ కాలంలో, మనకు మన సొంత సంరక్షక దూత ఉన్నాడనీ, మనల్ని కాపాడడం ఆయన కర్తవ్యమని నమ్మడం మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. దేవుడి వాక్యమైన బైబిలు దీని గురించి ఏమి చెబుతుంది? మనం దేవదూతలను సంప్రదించడానికి ప్రయత్నించాలా? మన నైతిక ప్రమాణాలు మరియు మత సంబంధ నమ్మకాల విషయంలో దూతలు మనకు కాపుదల ఇస్తారా? వాళ్ళ నుండి మనం ఎలాంటి సహాయాన్ని ఎదురుచూడవచ్చు? దీని జవాబులు తర్వాతి శీర్షికలో ఇవ్వబడతాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి