కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 9/15 పేజీ 32
  • 19వ శతాబ్దాన్ని అంతం చేసిన యుద్ధం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 19వ శతాబ్దాన్ని అంతం చేసిన యుద్ధం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 9/15 పేజీ 32

19వ శతాబ్దాన్ని అంతం చేసిన యుద్ధం

1914

నూతన సహస్రాబ్దిని గురించి తలస్తూ, ది ఓర్లాండో సెంటినెల్‌ అనే వార్తాపత్రిక కోసం శీర్షికలు వ్రాసే చార్లీ రీస్‌ ఇలా వ్రాశాడు: “19వ శతాబ్దాన్ని అంతం చేసిన 1914-18 యుద్ధం ఇంకా ముగియలేదు.” ఆయన ఉద్దేశం? ఆయనిలా వివరిస్తున్నాడు: “చరిత్రకు తారీఖులతో ఏమాత్రం పనిలేదు. 19వ శతాబ్దం—నమ్మకాలు, ఊహలు, దృక్పథాలు, విలువల సముదాయంగా నిర్వచించబడిన శతాబ్దం—1901, జన. 1న అంతం కాలేదు. ఆ శతాబ్దం 1914లో అంతమైంది. అదే పదాల్లో నిర్వచించబడిన 20వ శతాబ్దం ప్రారంభమైంది కూడా అప్పుడే. . . .

“మన జీవితాలన్నింట్లో మనం ఎదుర్కొనే దాదాపు అన్ని సంఘర్షణలు ఆ యుద్ధం నుండే ఉద్భవించాయి. ఈ సమకాలీన జీవితంలో మనం చూసిన దాదాపు అన్ని మేధాపరమైన, సాంస్కృతికమైన పోకడలు ఆ యుద్ధంలో నుండే పుట్టాయి. . . .

“అది అంతటి నాశనాన్ని తెచ్చిపెట్టిందని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, మానవులు తమ విధిని తాము నియంత్రించుకోగలరన్న నమ్మకాన్ని అది పటాపంచలు చేసింది. . . . ఆ యుద్ధం అటువంటి నమ్మకాన్ని విడనాడేలా చేసింది. అది తెచ్చిన పరిణామాలను ఇరువైపుల వారిలో ఎవరూ ఊహించలేదు. అది బ్రిటీషు, ఫ్రాన్సు సామ్రాజ్యాలను కూల్చివేసింది. అది బ్రిటీషు, ఫ్రెంచి, జర్మన్‌ పౌరుల్లోని శ్రేష్ఠమైన ఒక పూర్తి తరాన్ని మృత్యువాతకు గురిచేసింది. . . . స్వల్పకాలంలో అది ఒక కోటీ పది లక్షలమందిని హతం చేసింది.”

యెహోవాసాక్షులు 120 సంవత్సరాలకుపైగా, “అన్యజనముల కాలములు” అని యేసు వర్ణించిన కాలములు అంతమైన సంవత్సరంగా 1914ను ఎత్తిచూపిస్తూ వచ్చారు. (లూకా 21:24) ఆ సంవత్సరంలో, పునరుత్థానుడైన, మహిమపర్చబడిన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడుగా చేయబడ్డాడు. ఆ రాజ్యం ద్వారా యెహోవా దేవుడు ఈ శతాబ్దానికే ఒక గుర్తింపు చిహ్నంగా తయారైన బాధలను శాశ్వతంగా నిర్మూలిస్తాడు.—కీర్తన 37:10, 11; ప్రసంగి 8:9; ప్రకటన 21:3, 4.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి