కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 8/1 పేజీ 31
  • మరియ సహజ కారణాల వల్ల మరణించిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరియ సహజ కారణాల వల్ల మరణించిందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 8/1 పేజీ 31

మరియ సహజ కారణాల వల్ల మరణించిందా?

వాటికన్‌ వార్తాపత్రికయైన లాసర్‌వేటర్‌ రొమానో ప్రకారం, క్యాథలిక్‌ల స్వర్గారోహణ సిద్ధాంతం ఈ విధంగా చెబుతుంది: “పాపరహిత కన్య ఆదిమ పాపం యొక్క సమస్త కళంకముల నుండి స్వతంత్రురాలుగా ఉంచబడింది, ఆమె భూజీవితం ముగిసినప్పుడు ఆమె శరీరాత్మలు పరలోక మహిమకు కొనిపోబడ్డాయి.” ఈ బోధ, మరియ “చనిపోలేదు, భూజీవితం నుండి పరలోక మహిమకు వెంటనే ఆరోహణం చేయబడింది” అని కొందరు క్యాథలిక్‌ వేదాంతులు చెప్పడానికి కారణమైందని ఆ పత్రిక చెబుతుంది.a

ఇటీవలే, పోప్‌ జాన్‌ పాల్‌ II ఈ విషయంపై వ్యత్యస్త వెలుగును ప్రసరించాడు. వాటికన్‌లో జూన్‌ 25, 1997న జనరల్‌ ఆడియన్స్‌లో ఆయన ఈ విధంగా చెప్పాడు: “మరియ మరణించిన పరిస్థితులను గురించిన ఏ సమాచారాన్నీ క్రొత్త నిబంధన ఇవ్వడంలేదు. ఈ విషయంలో బైబిలు మౌనం వహించడం వల్ల, ప్రత్యేకంగా పేర్కొనవలసిన ఏ విశద వివరణనూ ఇవ్వనందువల్లా సహజ మరణమే సంభవించి ఉంటుందని ఊహించవచ్చు. . . . ఆమెకు సహజ మరణం ప్రాప్తించిందన్న తలంపును తొలగించాలన్న కోరికతో కూడిన అభిప్రాయాలకు ఆధారం లేనట్లు అనిపిస్తుంది.”

పాపరహిత జననమనే సిద్ధాంతంలోని గంభీరమైన పొరపాటును పోప్‌ జాన్‌ పాల్‌ మాటలు వెల్లడి చేస్తున్నాయి. యేసు తల్లి “ఆదిమ పాపం యొక్క సమస్త కళంకముల నుండి స్వతంత్రురాలుగా ఉంచబడినట్లైతే,” పాపియైన ఆదాము నుండి సంక్రమించిన పాపఫలితమైన “సహజ కారణాల” వల్ల మరియ ఎలా మరణించగలదు? (రోమీయులు 5:12) యేసు తల్లిని గూర్చి క్యాథలిక్‌ క్రైస్తవ చర్చికిగల తప్పుడు దృక్కోణం వల్లే ఈ వేదాంతపర సందిగ్ధత కలిగింది. ఈ విషయమై క్యాథలిక్‌ చర్చిలో విభేదాలూ, అయోమయ పరిస్థితీ కలగడంలో ఆశ్చర్యంలేదు.

బైబిలు మరియను వినమ్రమైన, నమ్మకమైన, మతనిష్ఠగల వ్యక్తిగా అభివర్ణిస్తున్నప్పటికీ, ఆమె “పాపరహితంగా జన్మించినందువల్లే” ఆమెకు ఈ సుగుణాలు అలవడ్డాయని బైబిలు చెప్పడం లేదు. (లూకా 1:38; అపొస్తలుల కార్యములు 1:13, 14) బైబిలు సరళంగా ఇలా చెబుతుంది: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) మిగతా మనుష్యులందరిలాగే, మరియ కూడా పాపమును, అపరిపూర్ణతను వారసత్వంగా పొందింది. ఆమె సహజ కారణాల వల్ల మరణించలేదని చెప్పేందుకు ఏ రుజువూ లేదు.—పోల్చండి 1 యోహాను 1:8-10.

[అధస్సూచీలు]

a ఫిబ్రవరి 15, 1994 కావలికోట, 26-9 పేజీల్లోని “కొనిపోబడడం—దేవుడు బయల్పర్చిన సిద్ధాంతమా?” అనే శీర్షికను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి