మునుపటి పొరపాట్లనుండి గుణపాఠం నేర్చుకోవడం
మన సృష్టికర్త నైతిక నియమాలు శాశ్వతమైనవి, అవి మార్చలేనివి. ఈ కారణంగానే గలతీయులు 6:7 నందు కనుగొనబడే సూత్రం నేడు కూడా అన్వయిస్తుంది: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” నిజమే, ఒక వ్యక్తి తాను దేవునికి లెక్క ఒప్పజెప్పాలనే వాస్తవాన్ని తృణీకరించవచ్చు, అయితే దైవిక నియమం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. తుదకు, ఏ మానవుడూ తన చర్యల పర్యవసానాలనుండి తప్పించుకోలేడు.
ఒక వ్యక్తి తప్పుడు జీవిత విధానాన్ని గడిపి, తర్వాత తన ప్రవర్తన మార్చుకుని దేవుని సేవకుడైతే అప్పుడేమిటి? తన మునుపటి జీవిత విధానపు పర్యవసానాలను అతడు ఇంకా అనుభవించవలసి రావచ్చు. అయితే దేవుడు ఆయనను క్షమించలేదని దాని భావం కాదు. రాజైన దావీదు బత్షెబతో వ్యభిచరించడం ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను తీసుకువచ్చింది. ఆయన వాటినుండి తప్పించుకోలేక పోయాడు. అయితే ఆయన పశ్చాత్తాపపడ్డాడు, ఆయన దేవుని క్షమాపణను పొందాడు.—2 సమూయేలు 12:13-19; 13:1-31.
మీరు చేసిన పొరపాట్ల పర్యవసానాలను మీరు అనుభవించినప్పుడు మీరెప్పుడైనా క్రుంగుదలకు గురయ్యారా? సరైన రీతిలో దృష్టిస్తే, పొరపాట్ల విషయమై సంతాపపడడం, మళ్లీ “తప్పు చేయకుండా జాగ్రత్తపడు”టకు మనకు ఒక జ్ఞాపికగా పని చేయగలదు. (యోబు 36:21, పరిశుద్ధ బైబల్) అవును, తప్పిదం విషయమై సంతాపపడడం మనం దాన్ని మళ్లీ చేయకుండా ఉండేందుకు మనకు సహాయం చేయగలదు. అయితే ఇంకా శ్రేష్ఠంగా, తాను చేసిన పాపం నుండి లభించిన అనుభవాన్ని తనకు మాత్రమే కాక ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా దావీదు ఉపయోగించాడు. ఆయనిలా చెప్పాడు: “అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.”—కీర్తన 51:13.
[7వ పేజీలోని చిత్రాలు]
బత్షెబతో తాను చేసిన పాపం నుండి దావీదు పాఠం నేర్చుకున్నాడు