కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/15 పేజీలు 24-25
  • వారు గొప్ప పేరు సంపాదించుకోలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారు గొప్ప పేరు సంపాదించుకోలేదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పూర్తి వైఫల్యం
  • నిమ్రోదు—అహంభావియైన తిరుగుబాటు దారుడు
  • ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • దేవుని రాజ్యం మనకు ఎందుకు అవసరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఆదికాండములోని ముఖ్యాంశాలు—I
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/15 పేజీలు 24-25

వారు గొప్ప పేరు సంపాదించుకోలేదు

అప్రఖ్యాత బాబెలు గోపుర నిర్మాణకుల పేర్లను బైబిలు తెలియజేయడం లేదు. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “వారు—మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొ[నిరి].” (ఇటాలిక్కులు మావి.)—ఆదికాండము 11:4.

“వారు” ఎవరు? ఈ సంఘటన జలప్రళయం సంభవించి దాదాపు 200 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది. అప్పటికి దాదాపు 800 ఏండ్ల వాడైన నోవహు, వేల సంఖ్యలోనున్న తన సంతతి మధ్య నివసించాడు. వాళ్లందరూ ఒకే భాష మాట్లాడారు, జలప్రళయం తర్వాత ఆయనా ఆయన కుమారులూ స్థిరపడిన సామూహిక క్షేత్రంలో వాళ్లందరూ కలిసి జీవించారు. (ఆదికాండము 11:1) కాలగమనంలో ఒకప్పుడు, విస్తరించిన ఈ జనంలోనుండి ఒక భాగం తూర్పు దిశగా ప్రయాణించి, “షీనారు దేశమందొక మైదానము”ను కనుగొన్నది.—ఆదికాండము 11:2.

పూర్తి వైఫల్యం

దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయాలని ఆ గుంపు తీర్మానించుకున్నది ఈ లోయలోనే. అదెలా? వారు “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం”చాలని యెహోవా దేవుడు మొదటి మానవజతకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన తన సంకల్పాన్ని వ్యక్తం చేశాడు. (ఆదికాండము 1:28) జలప్రళయం తర్వాత నోవహుకూ ఆయన కుమారులకూ ఈ విషయం మళ్లీ చెప్పబడింది. దేవుడు వారికిలా ఉపదేశించాడు: “మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించు[డి].” (ఆదికాండము 9:7) యెహోవా నడిపింపుకు వ్యతిరేకంగా, “భూమియందంతట చెదిరిపోకుండ” ఉండేందుకు ప్రజలు ఒక పట్టణాన్ని నిర్మించుకున్నారు.

ఈ ప్రజలు “పేరు సంపాదించు”కోవాలనే సంకల్పంతో ఒక గోపురాన్ని కూడా నిర్మించనారంభించారు. అయితే వారి అపేక్షలకు అతీతంగా, వారు ఆ గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే వారు ఒకరి మాటలొకరు అర్థం చేసుకోకుండేలా యెహోవా వారి భాషను తారుమారు చేశాడని బైబిలు వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. “ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి” అని ప్రేరేపిత వృత్తాంతం చెబుతుంది.—ఆదికాండము 11:7, 8.

ఈ ప్రయత్నం సంపూర్ణంగా విఫలమైందనే విషయం, ఆ నిర్మాణకులు ‘పేరు సంపాదించుకోలేదు’ లేక వారి పేర్లు ప్రఖ్యాతి గాంచలేదనే వాస్తవాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, వారి పేర్లు ఎవరికీ తెలియదు, అవి మానవ చరిత్రలోనుండి పూర్తిగా తుడిచివేయబడ్డాయి. అయితే నోవహు మునిమనుమడైన నిమ్రోదు సంగతేమిటి? దేవునికి విరుద్ధంగా జరిగిన ఈ తిరుగుబాటుకు అతడు నాయకుడు కాడా? మరి అతడి పేరు ప్రఖ్యాతి గాంచలేదా?

నిమ్రోదు—అహంభావియైన తిరుగుబాటు దారుడు

నిమ్రోదు ఆ ముఠా నాయకుడనటంలో సందేహమే లేదు. ఆదికాండము 10వ అధ్యాయం అతణ్ణి ‘యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు’ అని పరిచయం చేస్తుంది. (ఆదికాండము 10:9) “అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను” అని కూడా లేఖనాలు చెబుతున్నాయి. (ఆదికాండము 10:8) నిమ్రోదు ఒక యోధుడు, అతడు హింసాసక్తుడు. జలప్రళయం తర్వాత, తనను తాను రాజుగా నియుక్తి చేసుకుంటూ అతడు మొదటి మానవ పరిపాలకుడయ్యాడు. నిమ్రోదు ఒక నిర్మాణకుడు కూడా. అతడు బాబెలుతోపాటు ఇతర ఎనిమిది నగరాలను నిర్మించాడని బైబిలు చెబుతుంది.—ఆదికాండము 10:10-12.

కాబట్టి, దేవుడ్ని వ్యతిరేకించిన వాడూ, బాబెలు రాజూ, నగరాల నిర్మాణకుడూ అయిన నిమ్రోదు, బాబెలు గోపురాన్ని నిర్మించడంలో భాగం వహించాడనటంలో సందేహమే లేదు. అతడు గొప్ప పేరు సంపాదించుకోలేదా? నిమ్రోదు అనే పేరును గురించి, ఈ. ఎఫ్‌. సీ. రోజన్‌మ్యూలర్‌ అనే ఓరియెంటలిస్ట్‌ ఇలా వ్రాశాడు: “నిమ్రోదుకు ఆ పేరు, [మారాడ్‌] అనే పదం నుండి ఇవ్వబడింది, అంటే హెబ్రీ అర్థం ప్రకారం ‘అతడు తిరుగుబాటు చేశాడు,’ ‘అతడు ఫిరాయించాడు.’” తర్వాత రోజన్‌మ్యూలర్‌ ఇలా వివరిస్తున్నాడు, “తూర్పు దేశస్థులు, తరచూ తమ ప్రముఖ వ్యక్తులను వారి మరణానంతరం ఇవ్వబడిన పేర్లతోనే వారిని సంభోదించే వారు, దాని మూలంగానే కొన్నిసార్లు వారి పేర్లకూ వారు చేసిన పనులకూ మధ్య ఆశ్చర్యకరమైన పొందిక ఉండేది.”

నిమ్రోదు అనే పేరు అతడు పుట్టినప్పుడు పెట్టినపేరు కాదనే అభిప్రాయాన్ని అనేకమంది పండితులు కలిగివున్నారు. బదులుగా, అతడి తిరుగుబాటుపూరిత స్వభావం అవగతమైనప్పుడు దానికి సరిపోయే విధంగా పెట్టిన పేరు అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, సీ. ఎఫ్‌. కైల్‌ ఇలా పేర్కొంటున్నాడు: “‘మేము ఎదురు తిరుగుతాము’ అనే అర్థం గల [మారాడ్‌] అనే పదం నుండి వచ్చిన నిమ్రోదు అనే పేరు దానంతటదే, దేవుని ఎదుట హింసాపూరిత తిరుగుబాటును సూచిస్తుంది. అదెంత స్వాభావికంగా ఉందంటే, దాన్ని అతడి సమకాలీనులే ఇచ్చి ఉండాలి, అలా అది అతడి సొంత నామంగా మారిపోయి ఉంటుంది.” ఒక అధఃస్సూచిలో, చరిత్రకారుడైన జేకబ్‌ పెరిజోనియస్‌ ఇలా వ్రాసినట్లు కైల్‌ ఉల్లేఖిస్తున్నాడు: “క్రూరమైన వేటగాడైన, తన సహచరుల గుంపు చేత చుట్టుముట్టబడి ఉన్న [నిమ్రోదు] అనే ఈ మనిషి, ఇతరులను తిరుగుబాటుకు రెచ్చగొట్టేందుకై, ఎప్పుడూ తన నోట్లో ‘నిమ్రోదు, నిమ్రోదు’ అంటే ‘తిరుగుబాటు చేద్దాం! తిరుగుబాటు చేద్దాం!’ అనే పదాలను కలిగి ఉండి వాటికి ఊపిరిపోస్తుండే వాడని నేననుకుంటున్నాను. అందుకని, తర్వాతి కాలాల్లో, అతణ్ణి ఇతరులు, చివరకు మోషే కూడా ఆ పేరుతోనే పిలిచాడు.”

నిమ్రోదు గొప్ప పేరు సంపాదించుకోలేదనే విషయం స్పష్టమౌతుంది. పుట్టుక సమయంలో అతడికి పెట్టిన పేరు ఎవరికీ తెలియకుండానే ఉండిపోయింది. అతడి నాయకత్వాన్ని అనుసరించిన వాళ్ల పేర్లలాగే అతడి పేరు కూడా చరిత్ర నుండి తుడిచిపెట్టుకుపోయింది. అతడి వంశాన్ని కొనసాగించేందు గానూ అతడి తర్వాత అతడి సంతానం కూడా మిగలలేదు. ఘనతను, పేరు ప్రఖ్యాతులను పొందడానికి బదులు, అతడు అపఖ్యాతి పాలయ్యాడు. నిమ్రోదు అనే పేరు, యెహోవా దేవుడ్ని అవివేకంగా సవాలు చేసిన అహంభావియైన తిరుగుబాటు దారునిగా అతణ్ణి శాశ్వతంగా ముద్రించింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి