కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/15 పేజీ 11
  • “ఒక వ్రేలు బైబిలు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఒక వ్రేలు బైబిలు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/15 పేజీ 11

“ఒక వ్రేలు బైబిలు”

మంచాన పడి, అటు తర్వాత పక్షవాతం వచ్చిన జోసఫ్‌ షేర్షీవస్కీ ఒక వ్రేలు మాత్రమే ఉపయోగిస్తూ, టైపు చేయడం ద్వారానే వ్రాయగలిగేవాడు. అయినప్పటికీ, ఒక విదేశీయుడు నేర్చుకునేందుకు అత్యంత క్లిష్టమైన భాషల్లో ఒకటైన చైనీస్‌ భాషలోకి బైబిలును అనువదించాలనే తన గమ్యాన్ని ఆయన చేరుకున్నాడు.

జన్మతః యూదుడైన షేర్షీవస్కీ యుక్త వయస్సు వచ్చిన తర్వాత క్రైస్తవత్వాన్ని పరిశీలించి దాన్ని అంగీకరించాడు. ఆయన తుదకు చైనాలో ఒక మిషనరీ అయ్యాడు. అక్కడ, 1866 మొదలుకొని 20వ శతాబ్దంలోని తొలి సంవత్సరాల వరకూ ఆయన అనేక అనువాద ప్రాజెక్టుల్లో భాగం వహించాడు. షేర్షీవస్కీకున్న యూదా పూర్వ చరిత్ర మూలంగా, ఆయనకు తన తోటి పండితులకన్నా హెబ్రీ భాషతో మరింత ఎక్కువ పరిచయం ఉంది. అలా, పూర్తి హెబ్రీ లేఖనాలను అనువదించే పని ఆయనకు అప్పగించబడింది. ఆయన సుదీర్ఘ కెరీర్‌ ముగియబోతుండగా, రిఫరెన్సులున్న పూర్తి చైనీస్‌ బైబిలు అనువాదాన్ని కూడా తయారు చేశాడు.

బైబిలు అనువాదకునిగా, జోసఫ్‌ షేర్షీవస్కీ సామాన్య ప్రజల భాషలో బైబిలు ఉండాలనే అభిప్రాయానికి పూర్తి మద్దతు ఇచ్చేవాడు. అయితే ఆయన పని అంత సులభమైనదేమీ కాదు. చైనీస్‌ బైబిల్‌కు ఆయన అందించిన సహాయం ఎంతో అసాధారణమైనది, “ఎందుకంటే అది ఎంతో సమగ్రంగా ఉంది, అది అనేక ప్రతిబంధకాలను అధిగమించి సాధించబడింది” అని ది బుక్‌ ఆఫ్‌ ఎ థవుజండ్‌ టంగ్స్‌ అంటోంది.

షేర్షీవస్కీ చేతులకు పక్షవాతం వచ్చిన తర్వాత కూడా, ఆయన తన పనిలో ముందుకు సాగాడు. ఆయన తన చేతులను మామూలుగా ఉపయోగించలేడు గనుక టైపు చేయాలంటే చాలా శ్రమపడవలసి వచ్చేది. అందుకే ఆయన ఈ అనువాదాన్ని ఒక వ్రేలు బైబిలు అని పిలిచాడు. ఆ బైబిలును ఉత్పత్తి చేసేందుకు తనకు ఎన్ని ప్రతిబంధకాలు కలిగినప్పటికీ, షేర్షీవస్కీ 25 సంవత్సరాలపాటు పట్టు వదలకుండా పని చేశాడు. పట్టు విడువకుండా ఆ పనిలో కొనసాగడం ద్వారా, మరే ఇతర భాషకన్నా ఎక్కువమంది మాట్లాడే భాషయైన చైనీస్‌ భాషలో దేవుని వాక్యం అర్థమయ్యేలా చేయడంలో ఆయన భాగంవహించాడు.

[11వ పేజీలోని చిత్రసౌజన్యం]

రెండు చిత్రాలూ: Courtesy of American Bible Society Archives

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి