కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/1 పేజీ 32
  • సవాలుదాయక సమాధానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సవాలుదాయక సమాధానం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/1 పేజీ 32

సవాలుదాయక సమాధానం

ఒక బ్రిటీష్‌ రోమన్‌ కాథోలిక్‌ వార్తాపత్రికైన కాథోలిక్‌ హెరాల్డ్‌ వేల్స్‌నందలి ఒక పాఠకుని నుండి వచ్చిన ఈ క్రింది ఉత్తరాన్ని ఇటీవలనే ప్రచురించింది: “ఒక రాత్రి, ఇద్దరు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. వారు ఉపయోగించిన క్రొత్త నిబంధన ప్రతి యొక్క ప్రామాణికతకు హామీ ఇచ్చేది కాథోలిక్‌ చర్చియేనని నేను చెప్పగలిగాను. వారిలో ఒకరు దాన్ని అంగీకరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘అవును, మీరు దానికి హామీ ఇస్తారు కానీ మీరు దాన్ని అనుసరించరు. “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెన”ని యేసు చెప్పాడు, అయితే మీరు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇటీవలి యుద్ధంలో, కాథోలిక్‌లు కాథోలిక్‌లను చంపారు అయితే ఒక్క యెహోవాసాక్షి కూడా [తోటి] సాక్షిని చంపలేదు’ అని అతను అన్నాడు. నేను ఆ మాటలను అంగీకరించక ఇంకేం చేయగలను? మనలో మనమే విభాగించబడి ఉండగా మన ‘విడిపోయిన సహోదరులతో’ ఐక్యత కలిగి ఉండాలని మనమెలా ప్రార్థించగలం? మనం మొదట ఈ కళంకాన్ని పోగొట్టుకోవలసిన అవసరం లేదా?”—యోహాను 15:12.

ఈ 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు కూడా క్రైస్తవమత సామ్రాజ్యంలో ప్రారంభమయ్యాయి, మరి దాదాపు ఐదు నుండి ఆరు కోట్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి. అయితే, ఈ యుద్ధాల్లో యెహోవాసాక్షులు భాగం వహించలేదని మరియు ప్రస్తుతం జరుగుతున్న గొడవల్లో కూడా వారు ఇమిడి లేరని సత్యవంతంగా చెప్పవచ్చు. ఇది ఎలా సాధ్యం? ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకంటే ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రేమ ఐక్యతల శక్తివంతమైన బంధాలను గురించి మరింత తెలుసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.—యెషయా 2:4 పోల్చండి.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి