మీరు ఎవరి వాగ్దానాలపై నమ్మకముంచగలరు?
1893లో 74 మంది సమాజ పరిశీలకులు చికాగోలో వరల్డ్ ఫెయిర్వద్ద భవిష్యత్తును గూర్చి చర్చించడానికి సమావేశమయ్యారు. (పైన ఆ స్థలం చిత్రం చూపించబడింది.) 100 సంవత్సరాలు ముందుగా 1993లోకి తొంగి చూస్తూ వారు చేసిన భవిష్యద్ సూచనల్లో కొన్ని ఈ క్రింద ఉన్నాయి: “అనేకులు 150 సంవత్సరాలపాటు జీవిస్తారు.” “కారాగారాల సంఖ్య తగ్గిపోతుంది, విడాకులు అనవసరమైనవిగా పరిగణించబడతాయి.” “ప్రభుత్వం చేయడం మరింత సరళంగా ఉంటుంది, ఎందుకంటే ఒక దేశపు నిజమైన గొప్పదనం ఎల్లప్పుడూ సరళతవైపే మొగ్గుతుంది.”
అదేవిధంగా, 1967లో 2000వ సంవత్సరం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా జోస్యం చెప్పింది: “2000వ సంవత్సరానికల్లా కంప్యూటర్లు ‘మానవుని-పోలిన’ మేథాపర సామర్థ్యాలూ, బహుశ మానవుని సౌందర్య, సృజనాత్మక సామర్థ్యాలూ వంటివాటితో సరితూగే, పోలివుండే, లేక మించిపోయే సామర్థ్యాలు కలిగివుండే అవకాశం ఉంది.” “తగుమాత్రపు ఖరీదుగల రోబోట్లు ఇంటి పనులన్నీ చేయడం . . . 2000వ సంవత్సరానికల్లా సాధ్యమౌతుందనడం చాలా సహేతుకం.”
భవిష్యద్ సంఘటనలను ముందే చెప్పడం విషయంలో మానవజాతి అసమర్థతకూ, దేవుని సమర్థతకూ భేదం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఉదాహరణకు, పైన మనం చర్చించిన భవిష్యద్ సూచనలను, బైబిలు మన రోజుల గురించి దాదాపు 20 శతాబ్దాల క్రిందటే చెప్పినదానితో పోల్చిచూడండి: “మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”—2 తిమోతి 3:1-5.
“అంత్యదినముల” గురించిన ఈ బైబిలు ప్రవచనం మన దినాల్లో నెరవేరిన అనేక ప్రవచనాల్లో కేవలం ఒకటి మాత్రమే. యేసు ప్రత్యక్షతా “సూచన”లో ప్రపంచ యుద్ధమూ, ఆహార కొరతలూ, తెగుళ్లూ, భూకంపాలూ, దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడడమూ ఇమిడివున్నాయని దేవుని వాక్యం ముందే చెప్పింది.—మత్తయి 24:3-14; లూకా 21:11.
విఫలమయ్యే అవకాశం ఏమాత్రం లేని దేవుని వాగ్దానాల కచ్చితత్వం, ఒక బైబిలు రచయిత శతాబ్దాల క్రిందటే ఇలా ప్రకటించడానికి ఆయనను కదిలించింది: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.
అవును, దేవుని వాగ్దానాలు అన్నీ త్వరలోనే నెరవేరతాయని మనం నిశ్చయతను కల్గివుండగలము. దేవుని రాజ్యం వ్యాధినీ, నేరాన్నీ, మాదక ద్రవ్యాల వ్యసనాన్నీ, ఆకలినీ, యుద్ధాన్నీ అన్నింటినీ అంతం చేస్తుంది—భూమి అంతా కూడా ఒక పరదైసు అవుతుంది. (కీర్తన 37:10, 11, 29; ప్రకటన 21:3, 4) ఈ ప్రవచన నెరవేర్పు కొరకు మీరు స్థిర నిశ్చయంతో ఎదురుచూడవచ్చు! అది “అబద్ధమాడనేరని” మన సృష్టికర్త నుండి వచ్చినది.—తీతుకు 1:2; హెబ్రీయులు 6:13-19 పోల్చండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cleveland State University Archive