కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 8/1 పేజీ 30
  • ఎన్నెన్ని పుస్తకాలో!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎన్నెన్ని పుస్తకాలో!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 8/1 పేజీ 30

ఎన్నెన్ని పుస్తకాలో!

“పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు” అని ప్రాచీన కాలానికి చెందిన జ్ఞానియైన సొలొమోను రాజు వ్రాశాడు. (ప్రసంగి 12:12) 1995 సంవత్సరమంతటిలో బ్రిటన్‌లో, అక్కడి జనాభాలోని ప్రతి 580 మందికి ఒక పుస్తకం చొప్పున పుస్తకాలు ప్రచురించబడ్డాయి, అలా క్రొత్త పుస్తకాలను ప్రచురించడంలో ఆ దేశం ప్రపంచ అధినేత అయ్యింది. బ్రిటన్‌ అచ్చు వేసిన 95,015 పుస్తకాలతో పోల్చగా, అత్యంత ఎక్కువ జనాభాగల దేశమైన చైనా 92,972 పుస్తకాలను అచ్చువేసి రెండవ స్థానాన్ని పొందింది. తర్వాతి స్థానం జర్మనీకి (67,206 ప్రచురణలు) దక్కింది, ఆ తర్వాతి స్థానాలు ఆమెరికాకు (49,276), దాని తర్వాత ఫ్రాన్సుకు (41,234) దక్కాయి. “ప్రపంచంలో బ్రిటన్‌ ఆధిపత్యం చాలా మట్టుకు ఆంగ్ల భాషాపరంగా మాత్రమే దానికి దక్కింది” అని ది డైలీ టెలిగ్రాఫ్‌ అనే లండన్‌ వార్తాపత్రిక పేర్కొన్నది.

అనేక సంవత్సరాలుగా పుస్తక విక్రయ విపణి తగ్గుముఖం పట్టిందని నివేదికలు చూపుతున్నాయి, ఇప్పుడు ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో దాదాపు 80 శాతం మంది వయోజనులు మాత్రమే సంవత్సరానికి ఒక పుస్తకం కొంటారు. అయితే ప్రజలు తాము కొనే పుస్తకాలను అన్నింటినీ చదువుతారా?

చాలా విస్తృతంగా పంపిణీ చేయబడి ఎక్కువగా చదువబడుతున్న పుస్తకం ఇప్పటికీ బైబిలే, అది ఇప్పుడు పూర్తిగా లేక కొంతభాగాల్లో 2,120 భాషలకుపైగా లభ్యమౌతుంది. మీ వద్ద ఇప్పటికీ దాని ప్రతి లేనట్లయితే, మీకు సమీపంలోవున్న వాచ్‌ టవర్‌ సొసైటీ కార్యాలయానికి వ్రాసి వారిని సంప్రదించండి. మీరు ఇప్పటికే బైబిలును కలిగి ఉంటే, దాన్ని బయటికి తీసి ఈ పత్రికలోని శీర్షికల్లో ఉన్న లేఖన రెఫరెన్సులను పరిశీలించండి. అలా చేయడం ద్వారా, జీవాన్ని అనుగ్రహించే బైబిలు జ్ఞానాన్ని మీరు కనుగొంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి