కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 7/15 పేజీలు 20-23
  • మీ పిల్లవాని జీవితాన్ని కాపాడండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పిల్లవాని జీవితాన్ని కాపాడండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సన్నిహిత స్నేహితులుగా ఉండండి
  • దేవుని ఎడల ప్రేమ
  • దేవుని ఎడల భయం
  • ఆనందకరమైన ప్రతిఫలాలు
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 7/15 పేజీలు 20-23

మీ పిల్లవాని జీవితాన్ని కాపాడండి!

మైకల్‌ ఆల్ఫీనాలు దక్షిణాఫ్రికాలోని క్వాజులూ-నాటల్‌లోని పచ్చని పర్వతాల నడుమనున్న ఒక గ్రామీణ లోయలో నివసిస్తున్నారు. ఏడుగురు పిల్లలను పెంచి పెద్ద చేయడంలో వాళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తన భార్య అందించిన సంపూర్ణ మద్దతుతో, “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను [మీ పిల్లలను] పెంచుడి” అని తండ్రులకు బైబిలిచ్చిన ఆజ్ఞకు విధేయుడయ్యేందుకు మైకల్‌ తన శాయశక్తులా కృషి చేశాడు. (ఎఫెసీయులు 6:4) అయితే కొన్నిసార్లు సమస్యలు ఉత్పన్నమౌతాయి.

ఉదాహరణకు, ఎక్కువసేపు కలిసి ఆడుకోగలిగేలా తమ కుటుంబానికి చెందిన మందలన్నిటినీ కలిపి మేపడం ఆఫ్రికాలోని మందకాపరి బాలురకు బాగా అలవాటు. కొన్నిసార్లు వాళ్లు అల్లరి చేయడం మొదలుపెట్టి తాము చర్చించగూడని విషయాలను గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. మైకల్‌ కుమారులు తమ కుటుంబ మందను మేపేందుకు తీసుకెళ్లినప్పుడు, ఫలానా పిలల్లతో సహవసించ వద్దని ఆయన వారికి కచ్చితమైన సూచనలిచ్చాడు. (యాకోబు 4:4) అయినప్పటికీ, పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, వాళ్లు అలా చేయడాన్ని ఆయన కనుగొన్నాడు. దాని ఫలితంగా, ఆయన వాళ్లను శిక్షించాల్సి వచ్చింది.—సామెతలు 23:13, 14.

మైకల్‌ తన పిల్లల విషయంలో మరీ కఠినంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? కొందరు అలాగే భావించవచ్చు, అయితే “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందున”ని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 11:19) మైకల్‌ ఆల్ఫీనాలు తమ పిల్లలతో సమయాన్ని గడుపుతూ వాళ్లకు బైబిలు వృత్తాంతాలనూ సత్యాలనూ బోధిస్తూ తమ ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణాన్ని సృష్టించారు.

మైకల్‌ ఆల్ఫీనాలకు నలుగురు కుమార్తెలున్నారు, వాళ్లు టింబకీలీ, సఫీవ, టాలకెలీ మరియు టింబకానీలు. వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించే పూర్తికాల ప్రచారకులు. వారి కుమారుల్లో ఇద్దరు యెహోవాసాక్షుల సంఘాల్లో పర్వవేక్షణా పైవిచారణ కర్తలుగా సేవ చేస్తున్నారు. వారి మూడవ కుమారుడు పరిచర్య సేవకునిగా సేవ చేస్తున్నాడు, ఆయన భార్య కూడా పూర్తికాల సువార్తీకురాలే.

పెద్ద కుటుంబాలుగల అనేక క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయడంలో సఫలతను ఆశీర్వాదంగా పొందారు. అయితే, తలిదండ్రుల చక్కని పెంపకాన్ని పొందిన కొంతమంది పిల్లలు కూడా సత్యాన్ని విడనాడతారు. వారి తలిదండ్రులు తప్పిపోయిన కుమారుని గూర్చిన యేసు ఉపమానాన్ని మనస్సులో ఉంచుకుని తమ కుమారుడు లేక కుమార్తె పశ్చాత్తాపం చెంది తుదకు రక్షణ పొందుతారనే నిరీక్షణతో జీవిస్తారనడంలో సందేహం లేదు.—లూకా 15:21-24.

అయితే, దుఃఖకరమైన విషయమేమంటే కొంతమంది క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలనందరినీ ఈ లోకానికి పోగొట్టుకుంటున్నారు. పిల్లలు తమ కౌమార దశకు చేరుకొనేంత వరకూ బాగానే ఉంటున్నారని అనిపిస్తున్న ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో ఇది ప్రాముఖ్యంగా ఆందోళనను కలిగిస్తున్న విషయం. ఆ తర్వాత, యౌవనంలో వాళ్లు సాతాను లోకంలోని అనైతిక మార్గాల ద్వారా మోసగించబడుతున్నారు. (1 యోహాను 5:19) దాని ఫలితంగా, అనేకమంది తండ్రులు సంఘ పెద్దలుగా సేవ చేసేందుకు అర్హులు కారు. (1 తిమోతి 3:1, 4, 5) ఒక క్రైస్తవ తండ్రి తన స్వంత కుటుంబం యొక్క రక్షణను అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా దృష్టించాలన్నది స్పష్టమౌతోంది. కాబట్టి, తమ పిల్లల జీవితాలను కాపాడేందుకు తలిదండ్రులు ఏమి చేయగలరు?

సన్నిహిత స్నేహితులుగా ఉండండి

యేసు పరిపూర్ణుడు మాత్రమే కాదుగానీ, జ్ఞానం విషయంలోనూ అనుభవం విషయంలోనూ ఏ ఇతర మానవులకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ, ఆయన తన అపరిపూర్ణ శిష్యులతో తన సన్నిహిత స్నేహితులతో వలె వ్యవహరించాడు. (యోహాను 15:15) అందుకే వాళ్లు ఆయనతో ఉండాలని కోరుకున్నారు మరి ఆయన సాన్నిధ్యంలో వర్ధిల్లారు. (యోహాను 1:14, 16, 39-42; 21:7, 15-17) తలిదండ్రులు దీనినుండి నేర్చుకోగలరు. వెచ్చని సూర్యరశ్మి వైపుకు తమ ఆకులను చాపి ఉన్న చిన్న మొక్కల్లా, ఇంట్లో ప్రేమపూర్వక, స్నేహమయ వాతావరణం ఉన్నప్పుడు పిల్లలు వర్ధిల్లుతారు.

తలిదండ్రులారా, మీ పిల్లలు తమ చింతలన్నిటి విషయంలో నిస్సంకోచంగా మీ వద్దకు వస్తారా? వాళ్లు చెప్పేది మీరు వింటారా? మీరు ఒక ముగింపుకు వచ్చేముందు, విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునేందుకు వారి తలంపులనూ భావాలనూ రాబట్టడానికి మీరు ప్రయత్నిస్తారా? బైబిలు ప్రచురణల్లో వారితోపాటూ పరిశోధన చేయడం ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడంలో మీరు వారికి సహనంతో సహాయం చేస్తారా?

దక్షిణాఫ్రికాకు చెందిన ఒక తల్లి ఇలా వివరిస్తుంది: “మా కుమార్తె పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన మొదటి రోజు నుండి, ఆ రోజు జరిగిన సంఘటనలను మాకు చెప్పమని మేము ఆమెను ప్రోత్సహించాము. ఉదాహరణకు, నేనిలా అడిగే దాన్ని: ‘నువ్వు లంచ్‌ బ్రేక్‌లో ఎవరితో సమయం గడిపావు? నీ కొత్త టీచరు గురించి నాకు చెప్పమ్మా. ఆమె ఎలా ఉంటుంది? ఈ వారంలో ఇంకా ఏమి చేయాలని చెప్పారు?’ ఒకసారి, మా అమ్మాయి ఇంటికి వచ్చి, వాళ్ల ఇంగ్లీష్‌ టీచరు వాళ్ల తరగతిని ఒక సినిమా చూసేందుకు తీసుకెళ్లబోతోందనీ మరి దాని గురించి వాళ్లు తర్వాత ఒక వ్యాసం వ్రాయవలసి ఉందనీ మాకు చెప్పింది. ఆ సినిమా పేరు ప్రశ్నించదగినదిగా ఉంది. అదనపు సమాచారాన్ని సేకరించిన తర్వాత, అది క్రైస్తవులకు తగిన చిత్రం కాదని మేము గుర్తించాము. ఆ విషయాన్ని కుటుంబమంతా కలిసి చర్చించాము. ఆ మర్నాడు మా అమ్మాయి టీచరును కలిసి, ఆ చిత్రంలో చూపబడిన నైతిక విషయాలు తన క్రైస్తవ విశ్వాసాలకు తగిన విధంగా లేవు గనుక తాను దాన్ని చూడాలనుకోవడంలేదని ఆమె వివరించింది. టీచరు ఆ విషయాన్ని గురించి పునరాలోచించి, తాను విచారించబోయే విషయాన్ని చూసేందుకు తను తరగతి పిల్లలను తీసుకెళ్లాలనుకోవడంలేదని చెబుతూ ఆమె మా అమ్మాయికి ఆ తర్వాత కృతజ్ఞతలు తెలిపింది.” తమ కుమార్తె రక్షణ విషయంలో ఈ తలిదండ్రులు చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధ చక్కని ఫలితాలను తీసుకువచ్చింది. ఆమె ఆనందమైన అనుకూల దృక్పథాన్ని కలిగివుంది, మరి ఇప్పుడు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ దక్షిణాఫ్రికా బ్రాంచిలో స్వచ్ఛంద సేవకురాలిగా సేవ చేస్తోంది.

ఇతరుల పిల్లలతో వ్యవహరించే విషయంలో యేసు ఎంతో చక్కని మాదిరినుంచాడు. ఆయన వారి మధ్య ఉన్నప్పుడు ఆనందాన్ని కనుగొన్నాడు. (మార్కు 10:13-16) తలిదండ్రులు తమ స్వంత పిల్లలతో కలిసి పని చేసేందుకు ఎంత ఆనందించాలో కదా! ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో, తండ్రి తన కుమారులతో బంతి ఆట లేక ఇతర ఆటలు ఆడుతూ కనిపించేందుకు సిగ్గుపడతాడు. అయితే తాను తన పిల్లలతో కలిసి పని చేస్తూ కనిపించలేనంత ప్రాముఖ్యమైన వాడినని ఒక క్రైస్తవ తండ్రి ఎన్నడూ భావించకూడదు. తమతో కలిసి సమయం గడపడాన్ని ఇష్టపడే తలిదండ్రులు యౌవనస్థులకు కావాలి. పిల్లలు తమ ఆందోళనల్ని వ్యక్తం చేయడాన్ని ఇది వారికి సులభతరం చేస్తుంది. అలాంటి భావోద్రేకపరమైన అవసరాలు అలక్ష్యం చేయబడినప్పుడు, పిల్లలకు విసుగు అనిపిస్తుంది లేక వారు కుంచించుకుపోతారు, ప్రాముఖ్యంగా వారిని ఎడతెగక సరి దిద్దుతుంటే వారలా భావిస్తారు.

కుటుంబ సంబంధాలను గురించి కొలొస్సయులకు వ్రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) కొన్నిసార్లు మరీ ఎక్కువ శిక్షించడమూ మరీ తక్కువ స్నేహభావమూ కలిగివుండి అలా అసమతౌల్యత ఉంటుందని ఇది సూచించవచ్చు. యౌవనస్థులతో సహా పిల్లలను ప్రేమించి వారి ఎడల మెప్పుదలను చూపితే వారు అవసరమైన శిక్షణకు ఎంతో చక్కగా ప్రతిస్పందించగల సాధ్యత ఉంటుంది.

దేవుని ఎడల ప్రేమ

తలిదండ్రులు తమ పిల్లలకు అందించగల అత్యంత విలువైన వారసత్వం, ప్రేమ చూపడంలో తమ స్వంత మాదిరియే. తలిదండ్రులు దేవుని యెడల యథార్థమైన ప్రేమను వ్యక్తం చేయడాన్నీ, చూపడాన్నీ పిల్లలు చూడవలసిన మరియు విన వలసిన అవసరముంది. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ దక్షిణాఫ్రికా బ్రాంచిలో సేవ చేసే ఒక యౌవనస్థుడు ఇలా వివరిస్తున్నాడు: “నా చిన్న తనంలో, నేను ఇంటి పనుల్లో మా నాన్నకు సహాయపడే వాన్ని. నేను చేసే ఆ కొంచెం పనినే నాన్న చాలా మెచ్చుకునే వాడు, అందుకని ఆయనతో కలిసి పని చేయడాన్ని నేనెంతో ఇష్టపడేవాన్ని. యెహోవాను గురించి అనేక సంగతులు చెప్పేందుకు ఆయన ఆ సమయాన్ని ఉపయోగించే వాడు. ఉదాహరణకు, ఒక శనివారం మేము కష్టపడి మా లాన్‌ మోవ్‌ చేస్తున్నాము. అప్పుడు చాలా వేడిగా ఉంది. నాన్నకు చెమట్లు పడుతున్నాయి, అందుకని నేను లోనకు పరుగెత్తుకెళ్లి, రెండు గ్లాసుల నిండా నీళ్లు తెచ్చి వాటిలో ఐస్‌ వేశాను. నాన్న ఇలా అన్నాడు: “ఏరా బాబూ, యెహోవా ఎంత జ్ఞానవంతుడో చూశావా? ఐస్‌ నీళ్లపై తేలుతుంది. ఒకవేళ అది మునిగిపోయేదైతే, నదుల్లోనూ సరస్సుల్లోనూ క్రింది భాగానుండే జీవాలన్నీ చనిపోయి ఉండేవి. బదులుగా, ఐస్‌ ఉష్టోగ్రతను కాపాడేందుకు సహాయం చేస్తుంది! యెహోవాను గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు అది మనకు సహాయం చేయదా?’a తర్వాత, నేను తటస్థంగా ఉన్నందుకు చెరసాలలో వేయబడినప్పుడు, ఆలోచించేందుకు నాకు సమయం లభించింది. నా చెరసాల గదిలో ఒక రాత్రి నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు, నాన్న పలికిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాను. అవెంతటి అర్థవంతమైన మాటలు! నాకు వీలైతే నేను యెహోవాను నిత్యమూ ఆరాధిస్తాను.”

అవును, తమ తలిదండ్రులు చేసే ప్రతి దానిలోనూ దేవుని ఎడల గల ప్రేమ ప్రతిబింబించబడటాన్ని పిల్లలు చూడవలసిన అవసరముంది. దేవుని ఎడల ప్రేమ మరియు ఆయన ఎడల ఇష్టపూర్వకమైన విధేయత, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం, క్షేత్ర సేవలో పాల్గొనడం మరియు కుటుంబంగా బైబిలును చదవడమూ పఠించడమూ వెనుకగల అసలైన ప్రేరణా శక్తి అనే విషయాన్ని వాళ్లు చూడాలి. (1 కొరింథీయులు 13:3) అన్నిటికంటే ప్రాముఖ్యంగా, దేవుని ఎడలగల ప్రేమ హృదయపూర్వకమైన కుటుంబ ప్రార్థనల్లో ప్రతిబింబించబడాలి. మీ పిల్లలకు అలాంటి సంపదను ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇంతకన్నా ఎక్కువగా నొక్కిచెప్పలేము. అందుకే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”—ద్వితీయోపదేశకాండము 6:5-7; మత్తయి 22:37-40 పోల్చండి.

దేవున్ని ప్రేమించి ఆయనకు విధేయుత చూపించడానికి గల అతి పెద్ద అడ్డంకు మనం వారసత్వంగా పొందిన పాపభరిత ప్రవృత్తి. (రోమీయులు 5:12) అందుకే, “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి” అని కూడా బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (కీర్తన 97:10) చెడు తలంపులు తరచూ చెడు ప్రవర్తనకు దారితీస్తాయి. వీటిని నివారించేందుకు, ఒక పిల్లవాడు మరో ప్రాముఖ్యమైన లక్షణాన్ని కూడా వృద్ధి చేసుకోవాలి.

దేవుని ఎడల భయం

ప్రేమతో పాటూ యెహోవాను అప్రీతిపర్చకూడదనే భక్తితో కూడిన భయం ఉండటం ఎంతో మంచి లక్షణం. యేసుక్రీస్తు తానే మనకు ఈ విషయంలో పరిపూర్ణమైన మాదిరినుంచాడు, ఆయన “యెహోవా భయము” నందు ఆనందాన్ని కనుగొన్నాడు. (యెషయా 11:1-3) ఒక పిల్లవాడు యౌవన దశలోకి వచ్చి, శక్తివంతమైన లైంగిక ప్రేరణలను అనుభవించడం ప్రారంభిస్తుండగా అలాంటి భయం ఎంతో ప్రాముఖ్యం. అనైతిక ప్రవర్తనకు నడిపే లోకసంబంధ ఒత్తిడులను నిరోధించేందుకు ఒక యౌవనునికి దేవుని భయం సహాయం చేయగలదు. (సామెతలు 8:13) కొన్ని సమాజాల్లో, లైంగిక శోధనలతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని తమ పిల్లలకు బోధించే విషయంలో కొందరు తలిదండ్రులు సిగ్గుపడతారు. వాస్తవానికి, ఈ విషయాలను చర్చించడం తప్పు అని అనేకులు భావిస్తారు. అయితే తలిదండ్రులు అలా నిర్లక్ష్యం చేయడం వలన ఏ ఫలితం వచ్చింది?

బూగ, ఆమాకో, సాయీయాన అనే ముగ్గురు వైద్య నిపుణులు దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌కే అనే గ్రామీణ ప్రాంతంలోని 1,702 మంది అమ్మాయిలనూ 903 మంది అబ్బాయిలనూ ఇంటర్‌వ్యూ చేశారు. “ఈ సర్వేలో 76% మంది అమ్మాయిలూ 90.1% మంది అబ్బాయిలూ అప్పటికే లైంగిక సంపర్కాన్ని అనుభవించి ఉన్నారని” సౌత్‌ ఆఫ్రికా మెడికల్‌ జర్నల్‌ నివేదించింది. అమ్మాయిల సగటు వయస్సు 15, అనేకులు బలవంతం మూలంగా లైంగిక సంపర్కంలో భాగం వహించారు. 250 కంటే ఎక్కువమంది ఒకసారి లేక అనేకసార్లు గర్భం ధరించారు. మరొక పర్యవసానం లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా సోకడం.

వివాహ పూర్వ లైంగిక సంబంధాన్ని ఎలా నివారించాలో తమ పిల్లలకు బోధించవలసిన అవసరత ఉందని అనేకమంది తలిదండ్రులు గమనించరన్నది స్పష్టమౌతుంది. బదులుగా, ముందు ప్రస్తావించబడిన పత్రిక ఇలా వివరిస్తుంది: “పిల్లలను కనడమూ తల్లి కావడమూ గ్రామీణ ట్రాన్స్‌కే సమాజంలో నారిత్వం యొక్క ఉన్నతమైన లక్షణాలుగా పరిగణించబడతాయి, అప్పుడే యౌవనంలోకి ప్రవేశించిన అమ్మాయిలు ఈ విషయాన్ని వెంటనే గ్రహిస్తారు.” ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అదే విధమైన సమస్య ఉందని నివేదికలు చూపుతున్నాయి.

తమలోని లైంగిక భావాలను అర్థం చేసుకునేందుకు తమకు సహాయపడలేదని ఆఫ్రికాలోని అనేకమంది యౌవనులు తమ తలిదండ్రులను విమర్శిస్తున్నారు. కొంతమంది క్రైస్తవ తలిదండ్రులు మీ యౌవ్వనం—దాన్ని శ్రేష్ఠంగా అనుభవించడం (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగించేందుకు ఎంతో సిగ్గుపడుతున్నారు.b 20-3 పేజీల్లో అది లైంగిక అవయవాల మర్యాదపూర్వకమైన ఉపయోగాన్ని గురించీ యౌవనంలో వచ్చే మార్పుల గురించీ వివరిస్తుంది.

లైంగికత ఎడల దేవుని దృక్పథాన్ని గురించి తమ పిల్లలతో చర్చించడమనే సవాలును ఎదుర్కునే క్రైస్తవ తలిదండ్రులను మెచ్చుకోవాలి. విషయాలను అర్థం చేసుకోవడానికి పిల్లవానికి వున్న సామర్థ్యాన్ని బట్టి, దీన్ని క్రమ క్రమంగా చేయడం ఎంతో శ్రేయస్కరం. తలిదండ్రులు పిల్లవాని వయస్సు వంటి అంశం ఆధారంగా, శరీర అవయవాలనూ అవి చేసే పనులనూ నిర్దిష్టంగా సూచిస్తూ చెప్పవలసి రావచ్చు. లేకపోతే, అనుభవంలేని యౌవనుడు చెప్పబడుతున్న విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేక పోవచ్చు.—1 కొరింథీయులు 14:8, 9.

ఇద్దరు కుమార్తెలూ ఒక కుమారుడూ ఉన్న, దక్షిణాఫ్రికాకు చెందిన ఒక తండ్రి ఇలా వివరిస్తున్నాడు: “లైంగిక విషయాలను గూర్చిన సున్నితమైన అంశాలను గురించి మా అమ్మాయిలతో కూడా నేను అనేక సందర్భాల్లో చర్చించగల అవకాశం నాకు లభించింది. అయితే మీ యౌవ్వనం—దాన్ని శ్రేష్ఠంగా అనుభవించడం (ఆంగ్లం) పుస్తకాన్ని ఉపయోగిస్తూ నా భార్య మా కుమార్తెల ఎడల ప్రత్యేక అవధానాన్ని చూపింది. [26-31 పేజీలను చూడండి.] నా కుమారునికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను వాన్ని వాహ్యాళికి పర్వతాల వైపుకు తీసుకెళ్లాలని తీర్మానించుకున్నాను. ఆ సందర్భంలో, ఒక పిల్లవాని శరీరంలో వచ్చే మార్పును గురించీ తర్వాత వివాహంలో ఇది కలిగుండే ప్రత్యేక సంకల్పాన్ని గురించీ మేము వివరంగా చర్చించాము. హస్త ప్రయోగమనే నీచమైన అలవాటును నివారించ వలసిన అవసరతను గురించీ వాడు తన తల్లినీ సహోదరీలనూ ఎలా గౌరవ మర్యాదలతో దృష్టిస్తాడో ఇతర అమ్మాయిలను కూడా అలానే దృష్టించ వలసిన అవసరతను గురించీ నేను వాడితో చర్చించాను.”

ఆనందకరమైన ప్రతిఫలాలు

ఇక్కడ ప్రస్తావించబడిన తలిదండ్రులు కష్టించి పని చేశారు, మరి తమ ముగ్గురు పిల్లలను పెంచడంలో మంచి ఫలితాలను పొందగలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నారు. వారు ముగ్గురూ ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు, నమ్మకస్థులైన క్రైస్తవులతో వారికి వివాహాలయ్యాయి. వారి కుమారుడూ, ఇద్దరు అల్లుళ్లూ కూడా క్రైస్తవ సంఘంలో పెద్దలుగా సేవ చేస్తున్నారు, వీరిలో రెండు జంటలు అనేక సంవత్సరాల పాటూ పూర్తికాల సువార్త పనిలో భాగం కలిగి ఉన్నారు.

అవును, తమ కుటుంబాల రక్షణ కొరకు పాటుపడే తలిదండ్రులు, అలాంటి బైబిలు బోధకు ప్రతిస్పందించాలని నిర్ణయించుకునే పిల్లలనుండి ఆనందమయ ప్రతిఫలాన్ని అపేక్షించగలరు, ఎందుకంటే ‘జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులు సంతోషింతురు’ అని సామెతలు 23:24, 25 చెబుతుంది. ఈ శీర్షిక ఉపోద్ఘాతంలో ప్రస్తావించబడిన పెద్ద కుటుంబాన్ని పరిశీలించండి. “మా పిల్లలు సాధించిన ఆత్మీయ పురోభివృద్ధిని గురించి నేను ఆలోచించినప్పుడు, నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది” అని ఆల్ఫీనా చెబుతుంది. క్రైస్తవ తలిదండ్రులందరూ ఈ ఆనందమయ ప్రతిఫలాన్ని పొందేందుకు పాటుపడుదురు గాక.

[అధస్సూచీలు]

a నీరు ఘనీభవ స్థాయికి చేరుతుండగా, దాని సాంద్రత తగ్గి అది ఉపరితలానికి చేరుకుంటుంది. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకం యొక్క 137-8 పేజీలను చూడండి.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యౌవనస్థులు అడుగు ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని కూడా చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

జీవిత వాస్తవాలను వివరించేందుకు ఒక తండ్రి సరైన పరిస్థితిని ఏర్పాటు చేసుకోవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి