కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 7/15 పేజీ 3
  • మీరు పాపాన్ని ఎలా దృష్టిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు పాపాన్ని ఎలా దృష్టిస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాపము ఇక లేనప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పాపమును నీవెట్లు దృష్టిస్తావు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పాపరహిత లోకము—ఎలా సాధ్యము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మనుషులు ఎందుకు చనిపోతున్నారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 7/15 పేజీ 3

మీరు పాపాన్ని ఎలా దృష్టిస్తారు?

“మీలో ఏ పాపమూ లేదు, మీలో ఏ యాతనా లేదు; మీరు సర్వాంతర శక్తికి భాండాగారమై ఉన్నారు.” ప్రఖ్యాతిగాంచిన హిందూ తత్త్వవేత్తయైన వివేకానంద హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత నుండి ఓ ప్రకరణాన్ని వివరిస్తున్నప్పుడు, ఆయన ఈ వ్యాఖ్యానాన్ని చేశాడు. వేదాంతాన్ని ఉల్లేఖిస్తూ, ఆయనిలా చెప్పాడు: “నీవు లోపభూయిష్టమైన వాడవనీ, నీవొక పాపివనీ చెప్పడమే అతిగొప్ప తప్పిదం.”a

అయితే, మానవునిలో ఏ పాపమూ లేకపోవడం నిజమేనా? జన్మతః ఒకనికి వారసత్వంగా—అసలంటూ సంక్రమిస్తే—ఏమి సంక్రమిస్తుంది? “భౌతిక లక్షణాలు” మాత్రమే “వంశానుగతంచే నిర్ణయించబడతాయి” అని హిందూ స్వామియైన నిఖిలానంద చెబుతున్నాడు. ఇతర లక్షణాలు ఒకవ్యక్తి “గతజన్మల్లో చేసిన క్రియల” ఆధారంగా నిర్ధారించబడతాయి. వివేకానంద ఉద్దేశం ప్రకారంగా, “మీ విధికి మీరే సృష్టికర్తలు.” హిందూమతం వారసత్వంగా సంక్రమించే పాపాన్ని గురించేమీ బోధించడంలేదు.

వారసత్వంగా సంక్రమించే పాపము అనే సిద్ధాంతం జొరాష్ట్రియన్‌లలోనూ, షింటోవారిలోనూ, కన్‌ప్యూషియస్‌ మతస్థుల్లోనూ మరి బౌద్ధమతస్థుల్లోనూ లేదు. వారసత్వంగా సంక్రమించే పాపము అనే సిద్ధాంతాన్ని గూర్చి పారంపర్యంగా బోధించిన యూదా-క్రైస్తవ మతాల్లో సహితం, పాపము విషయంలో ప్రజల వైఖరి మారిపోతున్నది. ప్రజల్లో అనేకమంది, నేడు తమను తాము పాపులుగా తలంచడంలేదు.

“ఆధునిక చైతన్యం నైతిక మందలింపును ప్రోత్సహించదు; మరి విశేషంగా అది స్వయం-మందలింపును ప్రోత్సహించదు” అని మతగురువైన కొర్నేలియస్‌ ప్లాన్‌టిన్‌గ జూనియర్‌ చెబుతున్నాడు. పాపము యొక్క గంభీరతను తగ్గించివేసినందుకు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు పాక్షికంగా నిందించబడాలి. “మీరు పాపాన్ని గురించి వినాలనుకుంటే చర్చికి పోవొద్దు” అని డ్యూక్‌ యూనివర్శిటీకి చెందిన ఓ క్రైస్తవ మతగురువు చెబుతున్నాడు. ప్లాన్‌టిన్‌గ చెప్పిన ప్రకారంగా, కొన్ని చర్చీలు సామాన్యంగా సామాజిక వివాదాంశాలకు సంబంధించిన వాటి విషయంలో మాత్రమే పాపాన్ని గూర్చి మాట్లాడతాయి.

సామాజిక సమస్యలు నేడు కోకొల్లలుగా ఉన్నాయని అంగీకరించాల్సిందే. హింసా, నేరమూ, యుద్ధాలూ, జాతి పోరాటాలూ, మాదకద్రవ్యాల దుర్వినియోగమూ, నిజాయితీలేనితనమూ, అణచివేతా అలాగే పిల్లలపై బలాత్కారమూ పెరిగిపోతున్నాయి. నిజానికి, మానవజాతి మునుపెన్నడూ ఎరుగని రక్తసిక్తమైన శతాబ్దాల్లో ఒకటియని ఈ 20వ శతాబ్దం పిలువబడింది. రోగం, వృద్ధాప్యం, మరణం మూలంగా వచ్చే బాధా వేదనలు దీనికి తోడయ్యాయి. నేడు లోకంలోవున్న విపరీతమైన సమస్యలనుండి విడుదల పొందాలని ఎవరు మాత్రం ఎదురు చూడరు?

మరైతే, పాపాన్ని మీరెలా దృష్టిస్తారు? పాపము వారసత్వంగా సంక్రమించేదేనా? బాధా వేదనలనుండి మనం ఎప్పటికైనా విడుదలను పొందుతామా? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నల్ని చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

a వేదాంత తత్వం, హిందూ పవిత్రగ్రంథాలైన వేదాల చివర్లో కన్పించే ఉపనిషత్తులపై ఆధారపడివుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి