‘వారు తమ మతపర తర్ఫీదుకు కట్టుబడి ఉంటారు’
అమెరికానందలి ఫ్లారిడాలోని మియామీ నగర వాసియైన ఒక స్త్రీ ప్రాంతీయ వార్తాపత్రికకు ఈ క్రింది లేఖను పంపింది: “డిశంబరు 10వ తేదీన నా కుమారుడు పాత వస్తువుల బజారులో ఉన్నప్పుడు అతడి పర్సును ఎవరో కొట్టేశారు. అందులో అతడి డ్రైవింగ్ లైసెన్సూ, సొసైటీ సెక్యూరిటీ కార్డూ వగైరాలతోపాటూ 260 డాలర్లు ఉన్నాయి.
“పోగొట్టుకున్న వాటిని గురించి మేనేజరుకు రిపోర్టు చేసిన తర్వాత అతడు ఇంటికి వచ్చేశాడు. ఆ సాయంత్రం అతడికి స్పానిష్ మాట్లాడే స్త్రీ వద్దనుండి ఫోన్‌కాల్ వచ్చింది, ఆమె [టెలిఫోన్] ఆపరేటర్‌ను అనువాదకురాలిగా ఉపయోగించుకుని, తనకు అతడి పర్సు దొరికిందని చెప్పింది.
“ఆమె అతనికి తన చిరునామా ఇచ్చింది. . . . ఆమె ఆ పర్సును 260 డాలర్లతో సహా భద్రంగా అతడికి ముట్టజెప్పింది.
“దొంగ అతడి పర్సును తీయడాన్ని ఆమె చూసి గట్టిగా అరిచింది. ఆ దొంగ పర్సును పడేసి పరిగెత్తాడు. అప్పటికల్లా నా కుమారుడు కనుమరుగైపోయాడు, కాబట్టి ఆమె ఆ పర్సును ఇంటికి తీసికెళ్లి మాకు ఫోన్ చేసింది.
“ఆమే, ఆమె కుటుంబసభ్యులు యెహోవాసాక్షులు. వారు తమ మతపర తర్ఫీదుకు కట్టుబడి ఉన్నారనే విషయం స్పష్టమౌతుంది.”
యెహోవాసాక్షులు మనుష్యులనుండి పొగడ్తలను పొందేందుకు తమ నిజాయితీని కనుపర్చుకోరు. (ఎఫెసీయులు 6:7) బదులుగా, వారు తమ పరలోక తండ్రియైన యెహోవాకు ఘనతను తీసుకురావాలని ఎంతో కోరుకుంటారు. (1 కొరింథీయులు 10:31) దేవుని ఎడల మరియు పొరుగువారి ఎడల వారికిగల ప్రేమ, వారు దేవుని రాజ్యాన్ని గూర్చిన “సువార్త”ను ప్రకటించేందుకు వారిని పురికొల్పుతుంది. (మత్తయి 24:14) ఆ రాజ్యం ద్వారా, భూమిని పరదైసుగా మార్చుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు భూమి భౌతిక సౌందర్యం ఉండే స్థలమే గాక నైతిక సౌందర్యం ఉండే స్థలంగా కూడా ఉంటుంది. అక్కడ నిజాయితీ నిరంతరమూ వెల్లివిరుస్తుంది.—హెబ్రీయులు 13:18; 2 పేతురు 3:13.