ఇలాంటి దృశ్యాలు ఉండని సమయం ఎప్పటికైనా వస్తుందా?
మనం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఉద్రిక్తత, గొడవలు మరియు యుద్ధం యొక్క దృశ్యాలనే చూస్తున్నాము. అయితే ఈ పత్రిక యొక్క సంకల్పం ఇప్పటికే మీకు తెలిసిన దుర్వార్తలకు మరిన్నిటిని జత చేయాలన్నది కాదు. బదులుగా, ఈ ప్రత్యేక సంచిక మీకు కనీసం రెండు ఆదరణకరమైన సత్యాలను పరిచయం చేస్తుంది. మొదటిది, బైబిలులోని ప్రాచీన ప్రవచనాలు వాస్తవానికి మన యుగంలోని అనేక చెడు వార్తలను గురించి ప్రవచించాయి అన్న విషయం; రెండవది, ప్రవచనాలను గురించిన అదే పుస్తకం ఇక్కడ చూపబడిన చిత్రాల వంటివి గతానికి చెందినవై ఉండే ఒక దినాన్ని గురించి ప్రవచిస్తుందన్న విషయం. ఇక యుద్ధాలు ఉండవు. బాంబులు వేయడం, తుపాకీలు పేల్చడం, మందు పాతరలు లేక టెర్రరిజం వంటివి ఇక ఉండవు. దుఃఖితులైన అనాథలు లేక నిరాశ్రయులు ఇక ఉండరు. వాస్తవంగా హృదయానికి ఆనందాన్ని కలిగించే శాంతియుత ప్రపంచం. అలాంటి సమయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నారా? బైబిలు చెప్పే విషయాన్ని పరిశీలించాలని మేము మిమ్మల్ని పురికొల్పుతున్నాము. సాధ్యమైతుందని మీరు ఎన్నడూ ఊహించనంత ఆదరణను మీరు అందులో కనుగొంటారు.