ఎంత బాధ
“మనుషులు ఒంటరిగా మరియు సమూహాలుగా ఎందుకు ఇంత భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు . . . ? దేవుడు సర్వసంకల్పానికీ మూర్తిమంతంగా అనిపిస్తున్నాడు, అయినప్పటికీ ఈ ప్రపంచంలో వ్యర్థమైనవి ఎన్నో సంగతులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో అర్థరహితమైన బాధలు మరియు బుద్ధిహీనమైన పాపాలు ఉన్నాయి. అయితే దేవున్ని నిందిస్తూ నీఛఛీ అనిన విధంగా, ఈ దేవుడు బహుశ ఒక నియంత, వంచకుడు, మోసగాడు మరియు తీర్పరి అయి ఉన్నాడా?”—హాన్స్ కూంగ్ రచించిన ఆన్ బీయింగ్ ఎ క్రిస్టియన్.
సర్వ శక్తిమంతుడైన, ప్రేమగల దేవుడు ఇన్ని బాధలను ఎందుకు అనుమతిస్తాడు? అని అనేకులు విస్మయమొందే ఒక సమస్యను, కాథోలిక్ వేదాంతియైన హాన్స్ కూంగ్ కేవలం మన ఎదుట ఉంచాడనే విషయాన్ని మీరు చూడగలరు. ప్రజలు అలాంటి ప్రశ్నను అడగటాన్ని మీరు వినలేదా? “రక్తం చెమట కన్నీరుల, బాధ దుఃఖం భయాల, ఒంటరితనం మరణాల అంతులేని ధార” అని కూంగ్ వర్ణించిన విషయాన్నిబట్టి కరుణగల వారెవరైనా దుఃఖిస్తారు. నిజానికి, అది చరిత్రయంతటిలో కోటానుకోట్ల మంది ప్రజల జీవితాలను ముట్టడించిన భయం మరియు బాధ యొక్క ప్రవాహంవలె, వరదవలె ఉంది.—యోబు 14:1.
‘ఆయాసము మరియు దుఃఖముతో’ నింపబడి ఉన్నాయి
యుద్ధం మూలంగా కలిగే బాధను గురించి, బాధితులు అనుభవించే కలతను గురించి మాత్రమే కాక దుఃఖించేందుకు మిగిలి ఉన్న వారిని గురించి అంటే ఘోరంగా చంపబడిన పిల్లలు మరియు ఇతరుల తలిదండ్రులు మరియు బంధువుల వంటి వారిని గురించి కూడా ఆలోచించండి. “గత 10 సంవత్సరాల్లో, 1.5 మిలియన్ల పిల్లలు సాయుధ పోరాటాల్లో చంపబడ్డారు” అని రెడ్‌క్రాస్ సంస్థ ఇటీవలనే చెప్పడం జరిగింది. 1994లో రువాండానందు, “వందల వేల మంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు క్రూరంగా, ఓ పద్ధతి ప్రకారంగా వధించబడ్డారని” రెడ్‌క్రాస్ సంస్థ నివేదిస్తుంది.
శిశుకాముకతగల వారు కలిగించిన బాధను కూడా మనం అలక్ష్యం చేయకూడదు. శిశు సంరక్షణా కేంద్రంలో పని చేసే వ్యక్తి ద్వారా అత్యాచారానికి గురైన తర్వాత తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ దుఃఖిస్తున్న ఒక తల్లి ఇలా పేర్కొంటుంది: “నా కుమారునిపై అత్యాచారం చేసిన వ్యక్తి . . . అతన్నీ అతనితోపాటూ అనేకమంది ఇతర అబ్బాయిలను ఎంతో పకడ్బందీగా, ఊహించలేనంత నీచమైన పద్ధతిలో నాశనం చేశాడు.” బ్రిటన్‌లో “25 సంవత్సరాల వరకూ శిక్షింపబడకుండా అపహరించి, మానభంగం చేసి, చిత్రవధ చేసి మరియు హత్యలు చేసి” చివరకు పట్టుబడిన వారివంటి కర్కోఠకులైన హంతకులు లేక సీరియల్ కిల్లర్‌ల చేతుల్లో బాధింపబడిన వారు అనుభవించిన కలత సంగతేమిటి? చరిత్రయంతటిలో స్త్రీ పురుషులు ఒకరినొకరు బాధా వేదనలకు గురిచేసుకున్న తీరుకి అంతం లేదనిపిస్తోంది.—ప్రసంగి 4:1-3.
మానసిక మరియు శారీరక అనారోగ్యం ద్వారా కలిగిన బాధ అలాగే తమ ప్రియమైన వారు అకాల మరణానికి గురైనప్పుడు కుటుంబాలకు కలిగే కలతతో కూడిన భయంకరమైన వేదన దీనికి తోడైవున్నది. క్షామం మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలని పిలువబడే వాటి బాధితులు అనుభవించే కలత కూడా ఎదురౌతుంది. మన 70 లేక 80 సంవత్సరాలు ‘ఆయాసము మరియు దుఃఖముతో’ నిండి ఉన్నాయని మోషే పేర్కొన్న దాని గురించి ఎవరూ వాదించరు.—కీర్తన 90:10.
దేవుని సంకల్పంలోని భాగమా?
కొందరనే విధంగా, ఈ ఎడతెగని బాధంతా కూడా దేవుని అగోచరమైన సంకల్పంలోని ఒక భాగమా? ‘తర్వాతి లోకంలో’ జీవితాన్ని గుణగ్రహించేందుకు మనం ఇప్పుడు బాధను అనుభవించాలా? “చంపే మరియు కుళ్లిపోచేసే బాధ, జీవి సజీవంగా ఉండి ఆత్మగా అయ్యేందుకు దానికి అవసరం” అని తేల్‌హార్డ్ డె ఛార్డిన్ అనే ఫ్రెంచి తత్త్వవేత్త విశ్వసించిన విధంగా అది వాస్తవమా? (తేల్‌హార్డ్ డె ఛార్డిన్ యొక్క మతం; ఇటాలిక్కులు మావి.) ఎంతమాత్రం కాదు!
ఒక దయగల నిర్మాణకర్త మరణకరమైన వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించి, ఆ తర్వాత ప్రజలను దాని ప్రభావాల నుండి కాపాడుతూ అలా తను ఒక కరుణామయున్నని చెప్పుకోగలడా? అసాధ్యం! ప్రేమగల దేవుడు అలాంటి పని ఎందుకు చేస్తాడు? కాబట్టి దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తాడు? బాధ ఎప్పటికైనా అంతమౌతుందా? ఈ ప్రశ్నలను తదుపరి శీర్షిక చర్చిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy