కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/15 పేజీ 30
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సమమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసు రాకడ లేక యేసు ప్రత్యక్షత—ఏది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఆదరణ కొరకు యెహోవావైపు చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/15 పేజీ 30

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అలాగైతే, మీరు ఈ క్రింద ఇవ్వబడిన వాటిని జ్ఞాపకం చేసుకొనడం ఆసక్తికరంగా ఉంటుందని భావించవచ్చు:

◻ మత్తయి 24:3, 27, 37, 39 నందు ఉపయోగింపబడిన పరౌసియా అనే గ్రీకు పదభావమేమిటి?

వైన్‌ రచించిన క్రొత్తనిబంధన పదముల యొక్క వివరమైన నిఘంటువు (ఆంగ్లం) ఇలా చెబుతోంది: “పరౌసియా . . . చేరుకోవడాన్ని అలాగే దానితోపాటు ప్రత్యక్షతను కలిగివుండటాన్ని సూచిస్తుంది.” కాబట్టి, అది కేవలం చేరుకునే సమయం మాత్రమే కాదుగాని చేరుకున్నప్పటినుండి ఉండే ప్రత్యక్షత.—8/15, పేజీ 11.

◻ మొదటి శతాబ్దంలో “శరీరులు” తప్పించుకునేలా ఎలా ‘ఆ దినములు తక్కువ చేయబడ్డాయి’ అది విస్తృత పరిధిలో ఎలా జరుగుతుంది? (మత్తయి 24:22)

సా.శ. 66లో రోమీయులు యెరూషలేముపై ఆక్రమణను, శ్రమను తక్కువ చేశారు అలా క్రైస్తవ “శరీరులు” తప్పించుకునేందుకు అనుమతించారు. అలాగే, మహాబబులోనుపై కూడా ఏదో విధంగా దాడి తక్కువ చేయబడుతుంది. అభిషిక్త క్రైస్తవులు మరియు వారి సహచరులు కూడా రాబోయే నాశనంనుండి రక్షించబడతారు.—8/15, పేజీలు 18-20.

◻ ఒక వ్యక్తి జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించడం ప్రారంభించినా లేక అలా చేయటం మానుకున్నా దానియెడల మన ప్రతిస్పందన ఏమైవుండాలి?

మనలో ఎవరికీ దానిని గురించి ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. “నేను గొఱ్ఱెల మంచి కాపరిని, . . . నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును” అని యేసు అన్నాడు. అలాగే తాను ఆత్మీయ కుమారులుగా ఏర్పర్చుకున్న వారిని నిశ్చయంగా యెహోవా ఎరుగును. (యోహాను 10:14; రోమీయులు 8:16, 17)—8/15, పేజీ 31.

◻ మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రధాన సంకల్పం ఏమిటి?

ప్రాథమికంగా, అది ఇశ్రాయేలీయులకు తమ పాపభరిత స్థితి నుండి తమను విడిపించేవాడైన మెస్సీయ యొక్క అవసరత తమకుందని నేర్పింది. (గలతీయులు 3:24) ధర్మశాస్త్రం దైవ భయాన్ని మరియు విధేయతను కూడా నేర్పింది మరియు తమ చుట్టూ ఉన్న జనాంగాల కలుషితపరిచే ఆచారాలనుండి వేరుగా ఉండేందుకు అది ఇశ్రాయేలీయులకు సహాయపడింది. (లేవీయకాండము 18:24, 25)—9/1, పేజీ 9.

◻ క్రొత్త నిబంధన యొక్క సంకల్పం ఏమిటి? (యిర్మీయా 31:31-34)

మానవజాతినంతటినీ దీవించేందుకు రాజుల మరియు యాజకుల జనాంగాన్ని అది ఉత్పన్నం చేయాల్సివుంది. (నిర్గమకాండము 19:6; 1 పేతురు 2:9; ప్రకటన 5:10)—9/1, పేజీలు 14, 15.

◻ మనం క్షమాపణ కోరడమనే కళను ఎందుకు అభ్యసించాలి?

అపరిపూర్ణత వలన కలిగిన బాధను తగ్గించేందుకు క్షమాపణ సహాయం చేస్తుంది, అది చెడిపోయిన సంబంధాలను బాగుచేయగలదు. మనం చెప్పే ప్రతి క్షమాపణ వినయం విషయంలో ఒక పాఠం మరియు ఇతరుల భావాల ఎడల మరింత సున్నితంగా వ్యవహరించేందుకు మనకు తర్ఫీదునిస్తుంది.—9/15, పేజీ 24.

◻ నోవహు కాలంలో వచ్చిన భూవ్యాప్త జలప్రవాహాం ఒక చారిత్రాత్మక వాస్తవమేనా?

అవును. భూవ్యాప్త జలప్రళయాన్ని గూర్చి చెప్పే ప్రాచీన వృత్తాంతాలను ప్రపంచమంతటా అనగా అమెరికానుండి ఆస్ట్రేలియా వరకు కనుగొనవచ్చు. ఈ అంశం విస్తృతంగా వ్యాప్తి చెందడం బైబిలునందు నివేదించబడినట్లుగా ప్రపంచవ్యాప్త జలప్రళయం సంభవించిందనే వాస్తవాన్ని సమర్థిస్తుంది. (ఆదికాండము 7:11-20)—9/15, పేజీ 25.

◻ ఆతిథ్యమిచ్చేవారై ఉండటంనందు ఏమి ఇమిడివుంది? (రోమీయులు 12:13)

ఆతిథ్యము అనే పదం ‘ప్రేమ,’ ‘అపరిచయస్థుడు’ అనే అర్థాలుగల రెండు మూల పదాలతో రూపొందించబడిన గ్రీకు పదం నుండి అనువదించబడింది. కాబట్టి, ఆతిథ్యమంటే ప్రాథమికంగా “అపరిచితుల్ని ప్రేమించడం” అని అర్థం. అయితే, ఆతిథ్యం సిద్ధాంతపరమైన ప్రేమకన్నా గొప్పది అంటే కర్తవ్యాన్నిబట్టి చేసిన దానికన్నా గొప్పది. ఇది యథార్థమైన మక్కువ, అనురాగం, స్నేహబంధాలపై ఆధారపడి ఉంది.—10/1, పేజీ 9.

◻ వివాహాన్నిగూర్చి మరియు అవివాహిత స్థితిని గూర్చి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోని పౌలు వాదన యొక్క ముఖ్యాంశమేమిటి?

వివాహం న్యాయబద్ధమైనది, కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి సిఫారసు చేయదగినది. అయినప్పటికీ ఎక్కువ పరధ్యానం లేకుండా యెహోవా సేవచేయాలని కోరుకునే క్రైస్తవ పురుషునికి లేక స్త్రీకి అవివాహిత స్థితి నిర్వివాదంగా ప్రయోజనకరమైనది.—10/15, పేజీ 13.

◻ ఒక పెద్ద ఎలా ‘తన స్వంత ఇంటివారిని సంరక్షిస్తాడు’? (1 తిమోతి 5:8)

ఒక పెద్ద తన ‘స్వకీయులను’—తన భార్యను అలాగే పిల్లలను—వస్తుపరంగా, ఆత్మీయంగా మరియు మానసికంగా ‘సంరక్షించాలి.’—10/15, పేజీ 22.

◻ యెహోవా తన సేవకులకు ఆదరణను ఎలా అనుగ్రహిస్తాడు?

దేవుని పరిశుద్ధాత్మ “ఆదరణ కర్త”గా పనిచేస్తుంది. (యోహాను 14:16, NW, అధఃస్సూచి) దేవుడు ఆదరణను అనుగ్రహిస్తున్న మరో మార్గమేంటంటే బైబిలు ద్వారానే. (రోమీయులు 15:4) దేవునికి మన వ్యక్తిగత అవసరతలు తెలుసు మరియు కొరింథీయులలోని వారిని గూర్చిన తీతు నివేదిక ద్వారా పౌలు ఆదరణను పొందినట్లుగానే ఒకరికొకరము ఆదరణకరంగా ఉండేలా మనల్ని ఉపయోగించుకొనగలడు. (2 కొరింథీయులు 7:11-13)—11/1, పేజీలు 10, 12.

◻ 2 కొరింథీయులు 1:3, 4 వచనాల్లో పౌలు యొక్క వివరణలోని “కనికరము [“మృదువైన కనికరాల్ని,” NW] చూపు తండ్రి,” అని యెహోవాను గూర్చిన పౌలు వివరణలో ఏమి అన్వయింపబడుతుంది?

“మృదువైన కనికరం” అనే గ్రీకు నామవాచకం, మరొకరు బాధను అనుభవిస్తుంటే విచారాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగించిన ఒక పదం నుండి వచ్చింది. ఆ విధంగా శ్రమల్ని అనుభవిస్తున్న తన నమ్మకమైన సేవకుల ఎడల వ్యక్తపర్చే దేవుని మృదువైన కనికరాల్ని గురించి పౌలు వర్ణిస్తున్నాడు.—11/1, పేజీ 13.

◻ ఇశ్రాయేలీయులు సాంవత్సరిక ప్రాయశ్చిత్తార్థ దినమున ఉపవాసం ఉండడం దేన్ని నెరవేర్చింది? (లేవీయకాండము 16:29-31; 23:27)

ఉపవాసాన్ని ఆచరించడం, ఇశ్రాయేలీయులు తమ పాపస్థితిని బాగా తెలుసుకునేందుకు మరియు విడుదల పొందవలసిన తమ అవసరతను జ్ఞాపకం చేసుకునేందుకు వారిని పురికొల్పింది. తమ పాపాల విషయమై దుఃఖాన్ని వ్యక్తం చేసేందుకు మరియు దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేందుకు కూడా వారు ఆ దినాన ఉపవాసం చేసేవారు.—11/15, పేజీ 5.

◻ “ఇప్పుడే . . . మీ గొప్ప సృష్టికర్తను . . . జ్ఞాపకము చేసుకోండి” అనేది యౌవనస్థులకు ఏ ఆజ్ఞను బోధిస్తుంది? (ప్రసంగి 12:1, 2, NW)

“జ్ఞాపకము” చేసుకోవడం అని అనువదించబడిన హెబ్రీ పదం తరచూ “మనస్సుకు ఇష్టమైనది మరియు జ్ఞాపకం ఉంచుకున్నదానిననుసరించి జరిగే చర్య” అని సూచిస్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞకు విధేయులవ్వడమంటే యెహోవా గురించి ఆలోచించడంకంటే ఎక్కువే. దానిలో చర్యగైకొనడం ఇమిడి ఉంది, ఆయనకు ప్రీతికరమైనది చేయడం.—12/1, పేజీ 16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి