కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/15 పేజీ 32
  • ప్రశాంతమైన హృదయం యొక్క ప్రయోజనాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశాంతమైన హృదయం యొక్క ప్రయోజనాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/15 పేజీ 32

ప్రశాంతమైన హృదయం యొక్క ప్రయోజనాలు

అదుపులో పెట్టని కోపం మానవ శరీరంపై హానికరమైన ప్రభావం కలిగివుందని ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రానికి ఎంతో కాలం నుండి తెలుసు. వంద సంవత్సరాల క్రితం, ది జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (జామా) ఇలా అంది: “కోపోద్రేకం వలన ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తే బహుశ అతనికి తన మానసిక స్థితి కలుగజేసే ఒత్తిడిని తట్టుకోలేని బలహీనమైన హృదయం ఉందని చెప్పబడుతుంది. తన హృదయాన్ని బలహీనంగా తయారుచేసినది అటువంటి ఉన్మత్తంతో కూడిన ఆవేశమేనని, మరి ఆ ఆవేశంలో కొనసాగుతూ చివరికి చరమాంకానికి చేరుకున్నందువల్ల ఇది సంభవించిందని ఎవరూ అనుకుంటున్నట్లు లేదు.”

దేవుని వాక్యమైన బైబిలు యొక్క విద్యార్థులకు పైనున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవు. ఉగ్రత యొక్క ప్రమాదాలను గురించి జామా చెప్పడానికి దాదాపు 29 శతాబ్దాల క్రితం, రాజైన సొలొమోను ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.” (సామెతలు 14:30) ఈ మాటలు ఇప్పటికీ వాస్తవమైనవే.

ప్రశాంతమైన మనస్థితిని కలిగివుండడం ద్వారా హెచ్చైన రక్తపోటు, తలనొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి తరచూ ఒత్తిడి సంబంధమైన అనేకమైన అస్వస్థతలను మనం తప్పించుకోవచ్చు. అయితే, ‘కోపము మానడానికి, ఆగ్రహము విడిచిపెట్టడానికి’ ఒకవేళ మనం కృషి చేసినట్లయితే ఆరోగ్యం మెరుగవ్వడంతో పాటు ఇతరులతో మన సంబంధాలు మెరుగౌతాయి. (కీర్తన 37:8) ప్రజలు యేసు వద్దకు సహజంగానే ఆకర్షించబడ్డారు, ఎందుకంటే ఆయన దీన మనస్సుగలవాడు మరియు వారి ఎడల హృదయపూర్వక శ్రద్ధగలవాడు. (మార్కు 6:31-34) అదేవిధంగా, ఒక ప్రశాంతమైన హృదయం కలిగివుండడం ద్వారా మనం ఇతరులకు సేదదీర్పును కలుగజేసేవారముగా ఉంటాము.—మత్తయి 11:28-30.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి