‘ఇతరులకు సహాయం చేయడంలో వాళ్లు ఆసక్తిని కలిగి ఉన్నారు’
యెహోవాసాక్షుల గురించి న్యూయార్క్ పట్టణంలోని ఒక పోలీసు పలికిన మాటలవి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందలి యెహోవాసాక్షుల ప్రపంచ ముఖ్య కార్యాలయంలో పూర్తికాల స్వచ్ఛంద సేవకురాలైన కాథలీన్తో అతను మాట్లాడుతున్నాడు.
తన మధ్యాహ్న విరామ సమయంలో, సూర్యరశ్మిగల, ఒక వెచ్చని శరత్కాల దినాన, కాథలీన్ దగ్గర్లో ఉన్న విహారస్థలంలోని బెంచీపై కూర్చుంది. ఆమె హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక ఆడియో కేసెట్ వింటోంది. ఈస్ట్ నదికి అవతల ఉన్న హెలీపోర్ట్లో, ఆ పట్టణాన్ని దర్శిస్తున్న పోప్ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. అన్ని వైపులా చాలా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోబడ్డాయి, అనేకమంది పోలీసులు విహారస్థలంలో గస్తీ తిరుగుతున్నారు. వారిలో ఒకతను కాథలీన్ను సమీపించి ఆమె అక్కడ ఏమి చేస్తుందని అడిగాడు. కాథలీన్ ఇలా సమాధానమిచ్చింది: “నేను రష్యా భాష టేప్‌ను వింటున్నాను. మీకు తెలుసా, నేను ఒక యెహోవాసాక్షిని, ఈ పట్టణంలో నివసించేందుకు వచ్చిన రష్యా మాట్లాడే ప్రజలతో దేవుని రాజ్యసువార్తను పంచుకునేందుకు నేను రష్యా భాష నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.”
గస్తీ అధికారిగా తను గత 15 సంవత్సరాలు న్యూయార్క్‌లో ఉన్న కాలంలో తాను యెహోవాసాక్షులను అభినందించేందుకు పురికొల్పబడ్డానని అతను చెప్పాడు. అతనిలా అన్నాడు: “సమాజంలోని ఇతరులకు సహాయం చేసేందుకు యథార్థమైన ఆసక్తిగల సభ్యుల సంస్థీకరింపబడిన మతంగా నేను యెహోవాసాక్షులను పరిగణిస్తున్నాను.”
యెహోవాసాక్షులు వారు చేసే ఇంటింటి ప్రకటనాపని విషయమై ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. (అపొస్తలుల కార్యములు 20:20) మానవజాతిని నేడు పీడించే సమస్యలకు కేవలం దేవుని రాజ్యమే పరిష్కారమని వారు సూచిస్తున్నప్పటికీ, తమ అనుదిన జీవితాల్లో బైబిలు సూత్రాలను అన్వయించుకోమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలు తమ జీవిత విధానాన్ని మెరుగుపర్చుకునేందుకు కూడా వారు ప్రజలకు సహాయం చేస్తారు. ఉదాహరణకు, నేర్చుకునేందుకు సహాయకరమైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించమని సాక్షులు తలిదండ్రులను పురికొల్పుతారు. ఒక యజమాని ఎంతో విలువైనవని భావించే నైపుణ్యాలను మరియు లక్షణాలను సంపాదించేందుకు వ్యక్తులను ప్రోత్సహిస్తూ నిజాయితీగా మరియు చట్టానికి లోబడే వారిగా ఉండాలని వారిని ప్రేరేపిస్తారు.
అవును, యెహోవాసాక్షులు సమాజంలోని ప్రజలు తమ జీవితాలను మెరుగుపర్చుకునేందుకు వారికి సహాయం చేయడానికి ఎంతో ఆసక్తిని కలిగివున్నారు. ఈ క్రింది ప్రతిపాదనకు స్పందించవలసిందిగా మీరు స్నేహపూర్వకంగా ఆహ్వానింపబడుతున్నారు.