“యెహోవా నుండి ఓ అద్భుతమైన కానుక”
మే 1, 1996 సంచిక కావలికోటలో క్రైస్తవ నిష్పక్షతను గూర్చి, యెహోవా ఎడల మరియు “కైసరు” ఎడల మన బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవచ్చు అనే దానిని గూర్చిన లోతైన చర్చ ఉంది. (మత్తయి 22:21) ఇవ్వబడిన క్రొత్త సమాచారం ఎడల గల మెప్పుదలను గూర్చిన అనేక వ్యక్తీరణలు వినవచ్చాయి. గ్రీసులోని ఒక సాక్షి యెహోవాసాక్షుల పరిపాలక సభకు వ్రాసిన ఈ క్రింది లేఖ వాటిలో ఒకటి:
“ప్రియ సహోదరులారా మాపై ఆత్మీయంగా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు నేను నా ప్రగాఢమైన కృతజ్ఞతను మీకు వ్యక్తం చేయాలనుకుంటున్నాను. నా క్రైస్తవ విశ్వాసం మూలంగా తొమ్మిది సంవత్సరాలు జైలులో గడిపిన నేను మే 1, 1996 సంచిక కావలికోటలోని అద్భుతమైన తలంపులను నిజంగా ప్రశంసిస్తున్నాను. (యెషయా 2:4) ఇది యెహోవా నుండి వచ్చిన అద్భుతమైన కానుక.—యాకోబు 1:17.
నేను ఈ శీర్షికలను చదివి ఆనందిస్తుండగా, అంతకు ముందటి కావలికోట (ఆగస్టు 1, 1994, 14వ పేజీ)లోని, ‘స్పష్టంగా, యెహోవాను ఎంతగానో ప్రేమించేలా మనల్ని పురికొల్పేదైన సహేతుకత ఒక ప్రశస్తమైన లక్షణము’ అనే వ్యాఖ్యానాన్ని నేను గుర్తు చేసుకున్నాను. అవును, సహోదరులారా, నేను ఆయన జ్ఞానాన్ని స్పష్టంగా ప్రతిబింబించే దయాపూర్వకమైన మరియు ప్రేమపూర్వకమైన ఆయన సంస్థలో భాగమైనందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.—యాకోబు 3:17.
“మే 1 కావలికోటలోని ప్రకాశమానమైన వెలుగు గ్రీసులో ముఖ్యంగా విశ్వాసం మూలంగా జైలులో సంవత్సరాలు గడిపినవారి చేత లేదా ఇప్పటికీ జైలులో ఉన్నవారి చేత చక్కగా స్వీకరించబడింది. మీకు మరోసారి కృతజ్ఞతలు. ఈ కష్ట కాలాల్లో మాకు విలువైన ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వడంలో కొనసాగేందుకు యెహోవా తన ఆత్మతో మిమ్మల్ని బలపరచును గాక.”