“యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు!”
ప్రపంచవ్యాప్తంగా, దేవుని గురించిన మరియు మానవజాతి కొరకైన ఆయన అద్భుతమైన సంకల్పాన్ని గురించిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందాలని ఆసక్తి కలిగివున్న ప్రజలతో యెహోవాసాక్షులు దాదాపు 50 లక్షల గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. యెహోవాసాక్షులలోని పిల్లలు కూడా ఈ పనిలో భాగం వహిస్తున్నారు. ఉదాహరణకు జోయెల్ అనే పేరుగల ఒక బాలుని విషయాన్ని పరిశీలించండి. యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను సూచిస్తూ అతడు తొమ్మిది సంవత్సరాల వయస్సులో బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అతనికి ఈ అనుభవం కలిగింది:
“నేను పరిచర్యలో ఉన్నప్పుడు, కాండీ అనే పేరుగల స్త్రీని కలిశాను. ‘ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను’ అనే బ్రోషూర్ను ఆమెకు ప్రతిపాదించాను. ఆమె వద్ద అది అప్పటికే ఉంది, కాబట్టి నేను ఆమెకు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని ప్రతిపాదించాను. అది కూడా ఆమె వద్ద ఉంది. అయితే ‘నేను ఈ స్త్రీకి బైబిలు పఠనాన్ని ప్రతిపాదిస్తాను’ అని నేను తలంచాను. ఆమె అంగీకరించింది!
“కాండీ సహోదరి కాన్సర్ వలన మరణించబోతోంది, ఆమె కాండీతో నివసించేందుకు వచ్చింది. దానికి తోడు, కాండీ నర్సు ట్రైనింగ్ తీసుకుంటుంది. కాబట్టి కొంత కాలం కొరకు బైబిలు పఠనం ఆగిపోయింది. అయితే నా తలిదండ్రులు నేను ఆమెకో ఆమె భర్త డిక్కో పత్రికలను ఇస్తూనే ఉండటం ద్వారా ఆమెతో పరిచయాన్ని కొనసాగిస్తూ వచ్చాము. ఆమె ఆ పత్రికలను తన పడక ప్రక్కన పెట్టుకుని రాత్రి వాటిని చదువుతుందని డిక్ మాకు చెప్పాడు.
“కొద్ది కాలానికి, కాండీ సహోదరి మరణించింది. మా నాన్నా, అమ్మా, నేను మృతుల పరిస్థితి గురించి కాండీతో మాట్లాడాము. ఆమె తన బైబిలు పఠనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంది. మరో దినాన, తాను కూడా కాండీతోపాటు పఠనాన్ని తీసుకుంటూ దాన్ని కుటుంబ పఠనంగా చేయడం ఇష్టమేనా అని మేము డిక్ను అడిగాము. అది మంచి ఆలోచన అని డిక్ అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు, మా నాన్నతో కలిసి నేను కాండీ డిక్లతో పఠిస్తున్నాను. వారు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, బైబిలు పఠనం ఎడల మెప్పును వ్యక్తం చేస్తున్నారు.
“నేను బైబిలు పఠనం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, మరి యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు!”