కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 10/15 పేజీ 3
  • మరణం తరువాత జీవితం ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణం తరువాత జీవితం ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక దీర్ఘకాలిక ప్రశ్న
  • మరణం గురించిన కొన్ని కల్పిత కథనాల నిశిత పరిశీలన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • చనిపోయాక ఏమౌతుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • “మరణము మ్రింగివేయబడెను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 10/15 పేజీ 3

మరణం తరువాత జీవితం ఉందా?

మానవజాతిని రెండు ప్రశ్నలు వేల సంవత్సరాలుగా కలవరపెట్టాయి: మనం వృద్ధులమై చివరికి ఎందుకు మరణిస్తాము? మరణం తరువాత ఏదైనా చైతన్యవంతమైన జీవితం ఉందా?

మొదటిది అనేకమంది ప్రజలను గలిబిలిచేసింది, ఎందుకంటే ఎన్నో ప్రభావవంతమైన ఆవిష్కరణలున్నప్పటికీ ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఒక నిర్ణయాత్మకమైన లేక సంతృప్తికరమైన జవాబునివ్వలేకపోయింది.

ఇక రెండవ ప్రశ్నకు విస్తారమైన వైవిధ్యంగల జవాబులున్నాయి. అయితే సాధారణంగా, జీవితంలో ఉన్నదంతా ఇది మాత్రమే కాదన్న అనుకూల దృక్పథం ఉన్న వారికి అలాగే మరణమందు చైతన్యవంతమైన జీవితం అంతం అవుతుందని మొండిగా వాదించే వారికి మధ్య ఉన్న తేడావలె మరణం తరువాత చైతన్యవంతమైన జీవితం ఉందా లేదాయన్నదాని గురించిన జవాబులు విభిన్న ధృవాలుగా ఉన్నాయి. ఈ తరువాతి గుంపులోని అనేకులు మానవుడు అపేక్షించగలది స్వల్ప కాలావధి మాత్రమే అన్న దాని గురించి తమ మనస్సులలో ఎట్టి సందేహం లేదని మనకు చెబుతారు. తరచూ, దానికి విరుద్ధంగా ఏమైనా వాదనలు ప్రవేశపెట్టబడినప్పుడు, “సరే, మనకు చెప్పడానికి ఎవరూ తిరిగి రాలేదు, అవునా?” అనే స్వయంసంతృప్తితో కూడిన ప్రత్యుత్తరం ఎదురౌతుంది.

ఇతర వివాదాస్పద ప్రశ్నల విషయంలో వలెనే, ఇంకా నిర్ణయించుకోని అనేకమంది ఉన్నారు. వీరు తామెప్పుడూ ఏదో ఒక విధంగా ఒప్పింపబడడానికి సిద్ధంగా ఉన్నామని దృఢంగా చెబుతూ ఉంటారు. కానీ ఇతరులు, బహుశ తేలిగ్గా తీసుకుంటూ “సమయం వచ్చేంతవరకు మనం వేచి చూడాల్సిందే!” అని జవాబు చెబుతారు.

ఒక దీర్ఘకాలిక ప్రశ్న

మరణం తరువాతి జీవితాన్ని గురించిన తొలి ప్రశ్న దాదాపు 3,500 సంవత్సరాల క్రితం బాధలలో ఓర్పును ప్రదర్శించిన, ప్రముఖ ప్రాచ్య దేశపువాడైన యోబుచే లేవనెత్తబడింది. యోబు తన ప్రశ్నను లేవనెత్తిన విధం ఇలా ఉంది: “అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. . . . మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?”—యోబు 14:10-14.

కానీ మరణం తరువాతి జీవితం గురించి ప్రశ్నించేది యోబు ఒక్కడే కాదు. మతం మరియు నీతిశాస్త్రముల విజ్ఞానసర్వస్వము (ఆంగ్లం) “మృతుల స్థితి” అనే శీర్షిక క్రింద ఈ ప్రబోధాత్మక సమాచారాన్నిస్తుంది: “మరణం తరువాత తన పరిస్థితిని గురించిన విషయం కన్నా ఎక్కువగా తన మనస్తత్వ జీవితానికి సంబంధించిన ఏ విషయమూ మానవుని మనస్సును అంతగా ఆక్రమించలేదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని [స్థానిక ప్రజలు] సాధారణంగా ఆత్మప్రపంచాన్ని గూర్చి—దాని జీవితం, దాని లక్షణాలు, దాని ప్రకృతి దృశ్యాలను గూర్చి—చాలా స్పష్టమైన, ప్రస్ఫుటమైన భావనలు కలిగివున్నారు. ఆ విషయంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారని ఇది సూచిస్తుంది. మృతులను గూర్చిన బహుళ వ్యాప్తమైన భయం, మృతుల స్థితి జీవితం అంతమైనప్పుడున్నటువంటి స్థితి కాదు అనే చాలా ప్రాచీన ఆలోచన వైపు చూపుతుంది. మరణం శక్తులను తెంచివేసింది; అది విస్పష్టంగా ఉంది; కానీ ఇతర శక్తులు పనిచేయడంలేదా, లేక ఆ శక్తులకు రహస్యమైన, అద్భుతావహమైన విధానాలలో ప్రత్యక్షమయ్యే సామర్థ్యం లేదా? మొదట్లో మనుష్యులు శరీరం నుండి వేరుగానున్న ఆత్మ, ప్రాణం, లేక భూతములందు నమ్మకం ఉంచారో లేదో గాని, వారు మృతులు ఇంకా ఏదో రకమైన ఉనికిని అనుభవిస్తున్నారని పరిగణించారన్నది నమ్మడానికి ప్రతి కారణం ఉన్నట్లుంది.”

పైన పేర్కొనబడిన మూడు వర్గాలలో ఏదో ఒకదానికి మీరు చెందినవారు కావచ్చు: మరణం తరువాత ఏమి జరుగుతుందో రూఢిగా తెలియనివారు; మరణం తరువాత ఏదో రకమైన జీవితం ఉందని ఒప్పించబడినవారు; లేక ఈ జీవితంలో ఉన్నదంతా ఇది మాత్రమే అని ఒప్పించబడినవారు. మీరు ఏ వర్గానికి చెందినా, తరువాతి శీర్షికను జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అందులో మరణం తరువాత ఒక సంతోషకర జీవితం ఉందనడానికి ఒప్పించగలిగే బైబిలు ఆధార సాక్ష్యాన్ని గూర్చిన, అదెలా, ఎక్కడ, ఎప్పుడు వస్తుంది అనేవాటిని గూర్చిన అద్భుతమైన ఉత్తరాపేక్ష ఉన్నట్లు మీరు కనుగొనగలరేమో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి