కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 10/1 పేజీ 32
  • హృదయాన్ని స్పృశించే ఓ పత్రిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హృదయాన్ని స్పృశించే ఓ పత్రిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 10/1 పేజీ 32

హృదయాన్ని స్పృశించే ఓ పత్రిక

సమాచారం లేక వినోదం కొరకైన పాఠకుని తృష్ణను తీర్చేందుకు భూగోళ వ్యాప్తంగా లెక్కలేనన్ని పత్రికలు ప్రచురింపబడుతున్నాయి.

మీ చేతిలో ఉన్న పత్రికను ప్రత్యేకమైన దానిగా చేసేదేమిటి? జర్మనీలోని వాచ్‌టవర్‌ సంస్థకు వచ్చిన ఈ క్రింది ఉత్తరం, బహుశ సమాధానాన్ని ఇవ్వవచ్చు:

“ప్రియ సహోదరులారా, మీ ప్రయత్నాలు, పని విషయమై మీకెంతో కృతజ్ఞతలు. నా ఇద్దరు కుమారులు, నేను కూటంనుండి తిరిగి వచ్చినప్పుడు, రాత్రి 9:30 అవుతున్నప్పటికీ ఇటీవలి కావలికోటను [ఆడియోక్యాసెట్‌లు] నేను వినకుండా ఉండలేకపోయాను. నేను గిన్నెలు కడుగుతూ మొదటి పఠన శీర్షికను (ఏప్రిల్‌ 1, 1995) వినడం ప్రారంభించాను. నేను దాన్ని మళ్లీ వినవలసి ఉందని నేను భావించాను, అందుకు నేను వంటగదిలో నా పని ఆపేసి, టేపుతోపాటు [“మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!”] కావలికోట శీర్షికలు చదివాను. అది నా హృదయాన్ని స్పృశించింది, ప్రాముఖ్యంగా నాలుగు, ఐదు పేరాలు. తర్వాత కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి—అయితే ఎంతోసేపు కాదు. నేను సజీవంగా ఉన్నందుకు, ఆయన ప్రజలలో ఒక దానినై ఉన్నందుకు మరియు ఎంతోమంది ఇతరులతోపాటు ఆయన నామాన్ని తెలియజేయ గలుగుతున్నందుకు యెహోవాకు నేనెంతో కృతజ్ఞురాలిని. పనికిరాని వారమని భావించేందుకు వాస్తవానికి ఏ కారణమూ లేదు. యెహోవా దేవుని ఆత్మ ఆయన ప్రజలతో ఉంది. మనమందరం సహించి, ఐకమత్యంగా దృఢంగా నిలుద్దాము. క్రైస్తవ ప్రేమతో, విశ్వాసమందు మీ సహోదరి.”

కావలికోట సమాచారానికంటే ఎక్కువే ఇస్తుంది. అది దాని పాఠకుల హృదయాలను స్పృశిస్తుంది మరియు ఆత్మీయ పోషణ, సమయానుకూలమైన ప్రోత్సాహం కొరకైన వారి కోరికను తృప్తిపర్చుతుంది. అవును, కావలికోట “తగినవేళ అన్నము” పెడుతుంది.—మత్తయి 24:45.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి