కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 8/15 పేజీ 21
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల నుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దేవుడు నన్ను క్షమిస్తాడా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 8/15 పేజీ 21

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ప్రశంసించారా? అయితే, మీరు ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వగలరేమో చూడండి:

◻ “మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును” యేసు చెప్పిన మాటలకు క్రైస్తవులు పాపాలను క్షమించగలరని భావమా? (యోహాను 20:23)

క్రైస్తవులందరూ, లేదా సంఘాల్లోని నియమిత పెద్దలు పాపాలను క్షమించే దైవిక అధికారాన్ని కలిగివున్నారనే నిర్ణయానికి రావడానికి లేఖనాధారమేమీ లేదు. యేసు మాటల సందర్భం, పరిశుద్ధాత్మ ప్రక్రియ ద్వారా పాపాలను క్షమించే లేదా నిలిచియుండనిచ్చే అసమానమైన అధికారం అపొస్తలులకు దైవికంగా ఇవ్వబడింది అనే విషయాన్ని చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 5:1-11; 2 కొరింథీయులు 12:12 చూడండి.)—4/15, 28వ పేజీ.

◻ 1864లో మొదటిసారి ప్రచురించబడిన, జె. జె. స్ట్యూవర్ట్‌ పరోన్‌ కీర్తనల గ్రంథం యొక్క అనువాదపు ప్రాముఖ్యత ఏమిటి?

పరోన్‌ తన అనువాదంలో “హెబ్రీ రూపం యొక్క నుడికారంలోను మరియు పదసముదాయ నిర్మాణంలోను దగ్గరగా” ఉండేందుకు ప్రయత్నించాడు. ఈ విధంగా చేయడంద్వారా దైవిక నామమైన “యెహోవా” అన్న రూపాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడ్డాడు.—4/15, 31వ పేజీ.

◻ ప్రపంచ ప్రభుత్వాలతో తన అనుచరుల వ్యవహారాలకు సంబంధించి యేసు వారికి ఏ మార్గదర్శకాన్ని ఇచ్చాడు?

“కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని” యేసు చెప్పాడు. (మత్తయి 22:21) ఆయన ఇలా కూడా చెప్పాడు: “అధికారంలోవున్న ఒక వ్యక్తి ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతంచేస్తే, అతనితో రెండు మైళ్లు వెళ్లండి.” (మత్తయి 5:41, NW) యేసు ఇక్కడ, మానవ సంబంధాల్లోనైనా లేక ప్రభుత్వం కోరేవైనా దేవుని చట్టానికి అనుగుణంగానున్న, శాసనబద్ధమైన డిమాండ్లకు ఇష్టపూర్వకమైన విధేయతను చూపించే సూత్రాన్ని ఉదాహరిస్తున్నాడు. (లూకా 6:27-31; యోహాను 17:14, 15)—5/1, 12వ పేజీ.

◻ ‘సత్యముననుసరించి నడవడమంటే’ దాని భావమేమిటి? (కీర్తన 86:11)

ఇందులో దేవుని కట్టడలకు తగినట్లు నడుచుకోవడం, విశ్వాస యథార్థతలతో ఆయన సేవ చేయడం చేరివున్నాయి. (కీర్తన 25:4, 5; యోహాను 4:23, 24)—5/15, 18వ పేజీ.

◻ యెహోవా యోనాను నీనెవెకు పంపించడంలో ఏమి నెరవేర్చబడింది?

యోనా నీనెవెలో చేసిన ప్రకటన పని, పశ్చాత్తాపపడ్డ నీనెవె వారికీ, విశ్వాసమూ విధేయత పూర్తిగా లేని, లోబడని ఇశ్రాయేలీయులకూ మధ్య ఉన్న తేడాను చూపించింది. (ద్వితీయోపదేశకాండము 9:6, 13; యోనా 3:4-10, పోల్చండి.)—5/15, 28వ పేజీ.

◻ ఆదికాండము 3:15 నందు చెప్పబడిన సర్పము ఎవరు మరియు “స్త్రీ” ఎవరు?

సాతాను అల్పమైన పాము కాదుగాని దానిని ఉపయోగించుకున్న వాడే. (ప్రకటన 12:9) ఈ “స్త్రీ” హవ్వ కాదుగాని, భూమిపైనున్న యెహోవా ఆత్మాభిషిక్త క్రైస్తవుల తల్లియైన ఆయన పరలోక సంస్థయే. (గలతీయులు 4:26)—6/1, 9వ పేజీ.

◻ ఒక వ్యక్తి మహాబబులోనులో నుండి ఏ విధంగా బయటికి వచ్చి సురక్షితమైన స్థలాన్ని కనుగొనగలడు? (ప్రకటన 18:4)

అతడు అబద్ధమత సంస్థల నుండి మాత్రమే కాదుగాని వాటి ఆచారాలు, అవి ఉత్పన్నం చేసిన స్వభావంనుండి తనను తాను పూర్తిగా వేరు చేసుకొని, యెహోవా దైవపరిపాలనా సంస్థలో భద్రతను కనుగొనాలి.—(ఎఫెసీయులు 5:7-11)—6/1, 18వ పేజీ.

◻ గ్రద్ద లేఖనాల్లో తరచూ ఎందుకు పేర్కొనబడింది?

బైబిలు రచయితలు జ్ఞానం, దైవిక సంరక్షణ మరియు వేగం వంటి విషయాలను వివరించేందుకు గ్రద్ద లక్షణాలను ఉదాహరించారు.—6/15, 8వ పేజీ.

◻ భూ నిరీక్షణగల నేటి దేవుని సేవకులు, ఆత్మాభిషిక్తులైన క్రైస్తవులు కల్గివున్నంత దేవుని ఆత్మను కల్గివున్నారా?

నిస్సందేహంగా, దానికి జవాబు అవును అన్నదే. రెండు తరగతుల వారికి దేవుని ఆత్మ సమానంగా లభిస్తుంది మరియు రెండు తరగతుల వారు జ్ఞానాన్ని, అవగాహనను సమానంగా పొందవచ్చు.—6/15, 31వ పేజీ.

◻ యెరూషలేములోని ఆలయంనందు ఇశ్రాయేలు యాజకులు చేసిన పరిశుద్ధ సేవను పరిశీలించడం నేడు మనకు ఎందుకు ప్రయోజనకరమైనది?

అలా చేయడంద్వారా, పాపులైన మానవులు దేవునితో సమాధానపరచబడడాన్ని సాధ్యపరిచే దయాపూర్వక ఏర్పాటును మనం మరింత సంపూర్ణంగా గుణగ్రహించగల్గుతాము. (హెబ్రీయులు 10:1-7)—7/1, 8వ పేజీ.

◻ సొలొమోను నిర్మించిన మొదటి ఆలయంకన్నా యెరూషలేములో నిర్మింపబడిన రెండవ ఆలయం ఏ విధంగా గొప్ప మహిమను పొందింది?

రెండవ ఆలయం సొలొమోను కట్టిన ఆలయంకన్నా 164 సంవత్సరాలు ఎక్కువ కాలం ఉంది. దాని ఆవరణల్లోకి ఎంతో ఎక్కువమంది ఆరాధికులు, ఎన్నో ఎక్కువ దేశాల నుండి వచ్చారు. మరింత ప్రాముఖ్యంగా, ఈ రెండవ ఆలయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దాని ఆవరణల్లో బోధించే గొప్ప ఆధిక్యతను అనుభవించింది.—7/1, 12, 13 పేజీలు.

◻ దేవుడు తన ఆత్మీయ ఆలయాన్ని ఎప్పుడు నెలకొల్పాడు?

సా. శ. 29లో యేసు బాప్తిస్మం సమయంలో చేసిన ప్రార్థనను దేవుడు తాను అంగీకరించినట్లుగా చూపినప్పుడు ఇది జరిగింది. (మత్తయి 3:16, 17) యేసు తన శరీరాన్ని బలిగా అర్పించడాన్ని దేవుడు అంగీకరించడం, ఆత్మీయ భావంలో, యెరూషలేము ఆలయంలోని బలిపీఠం కంటే గొప్పదొకటి పని ప్రారంభించిందని తెలియజేసింది.—7/1, 14, 15 పేజీలు.

◻ మనం ఎందుకు క్షమించేవారమై ఉండాలి?

మనం క్రైస్తవ ఐక్యతను కాపాడుకోవాలంటే, తప్పుచేసి క్షమాపణ కోరిన వ్యక్తిని క్షమించడం అవసరం. శత్రుత్వం, పగ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనం క్షమించకపోతే, ఒకనాడు యెహోవా దేవుడు మన పాపాలను ఇక క్షమించకుండా ఉండే ప్రమాదం ఉంది. (మత్తయి 6:14,15)—7/15, 18వ పేజీ.

◻ ఇశ్రాయేలీయులు ఎలా పరిశుద్ధులు కాగలరు?

పరిశుద్ధ దేవుడైన యెహోవాతో వారు సన్నిహిత సంబంధం కలిగివుండడం ద్వారా, ఆయనకు వారు స్వచ్ఛమైన ఆరాధన చేయడం ద్వారా మాత్రమే వారు పరిశుద్ధతను పొందేవారు. “పరిశుద్ధ దేవుని” పరిశుద్ధతతోను, శారీరక మరియు ఆత్మీయ పరిశుభ్రతతోను ఆరాధించేందుకు వారికి ఆయనను గూర్చిన కచ్చితమైన జ్ఞానం అవసరమయ్యింది. (సామెతలు 2:1-6; 9:10)—8/1, 11వ పేజీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి