కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 8/15 పేజీలు 2-3
  • వాగ్దాన దేశానికి ఓ పర్యటన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాగ్దాన దేశానికి ఓ పర్యటన
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు పరదైసు నిరీక్షణ ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • వాగ్దాన దేశం నుండి ఆచరణాత్మకమైన పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవాయే రాజు
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • మీరు యెహోవాను మరచిపోకూడదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 8/15 పేజీలు 2-3

వాగ్దాన దేశానికి ఓ పర్యటన

ఓ స్నేహితుడు మీ కొరకు బహుమతిగా, అందమైన ప్రశాంతమైన పరిసరాల్లో ఉన్న ఓ క్రొత్త ఇంటిని కొన్నానని చెప్పాడనుకోండి. ‘అదెలా ఉంటుందో?’ అని మీరు ఆలోచిస్తారు. నిస్సందేహంగా, ఈ ఇంటిని మీరే స్వయంగా చూసి, అందులో నడిచి ప్రతి గదినీ పరిశీలించాలనే కుతూహలాన్ని కల్గివుంటారు. ఎంతైనా, అది మీ క్రొత్త గృహంకదా మరి!

సా.శ.పూ. 1473లో ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఓ క్రొత్త గృహాన్ని ఇచ్చాడు, అదే వాగ్దాన దేశం. ఉత్తరం నుండి దక్షిణం వరకు సుమారు 500 కిలోమీటర్లుండి, సగటున 55 కిలోమీటర్ల వైశాల్యం కల్గివున్న ప్రాంతమది.a అర్థచంద్రాకారంలోవున్న సారవంతమైన భూమి అని పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ వాగ్దాన దేశం నివసించేందుకు ఆహ్లాదకరమైన ప్రాంతంగా తనదైన విశిష్టమైన గుణాలతో సుసంపన్నం చేయబడింది.

అయితే ఎవరికో ఇవ్వబడిన, ప్రాముఖ్యంగా ఎంతో కాలంక్రితం జీవించిన ఎవరికో ఇవ్వబడిన “గృహం” గురించి మీరు ఎందుకు ఆసక్తి కల్గివుండాలి? ఎందుకంటే ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని గూర్చిన జ్ఞానం, బైబిలు వృత్తాంతాల విషయంలో మీ మెప్పును మెరుగుపరుస్తుంది. “బైబిలులోని ఆ ప్రాంతంలో, భౌగోళిక శాస్త్రమూ చరిత్ర ఎంతగా కలగలసిపోయాయంటే, ఒకదాని సహాయం లేకుండా మరో దాన్ని నిజంగా అర్థంచేసుకోలేము” అని ప్రొఫెసర్‌ యోహన్నాన్‌ అహరోని వ్రాశాడు. అంతేకాకుండ, దాని ఉన్నత స్థాయిలో, దేవుని రాజ్యం క్రింద భూవ్యాప్తంగా పరదైసు అంటే త్వరలోనే మానవజాతికి ఏమై ఉంటుందనేదాన్ని ఆ వాగ్దాన దేశం చిన్న మోతాదులో చూపించింది!—యెషయా 11:9.

యేసుక్రీస్తు తన భూ పరిచర్య సమయంలో, ఆచరణాత్మకమైన పాఠాలను నేర్పించేందుకు వాగ్దాన దేశంలో సాధారణంగా కనిపించే వాటిని ఉపయోగించాడు. (మత్తయి 13:24-32; 25:31-46; లూకా 13:6-9) ప్రాచీన పాలస్తీనాలోని కొన్ని విషయాలను పరిశీలించడంవల్ల ఆచరణాత్మకమైన విధానంలో మనం కూడా ఎంతో నేర్చుకోవచ్చు. సాదృశ్యంగా చెప్పాలంటే దాని గదుల్లోని కొన్నింటిలో నడుస్తూ, అనేక శతాబ్దాలు దేవుని ప్రజలకు గృహంగా ఉపయోగపడిన ఈ దేశంలోని కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలిద్దాము. మనం చూడబోతున్నట్లుగా, వాగ్దాన దేశంనుండి మనం నేర్చుకోగలది ఎంతో ఉంది.

[అధస్సూచీలు]

a ఈ శీర్షికల్లోని “వాగ్దాన దేశం” యొక్క ఉపయోగం, బైబిలులో అందజేయబడినట్లుగా ప్రాచీన కాలంనాటి దృక్పథంతోనే విషయాలను పరిశీలిస్తుంది, ఆ ప్రాంతాన్ని గూర్చిన ఆధునిక రాజకీయ లేక మత సంబంధమైన దావాలతో దానికి సంబంధం లేదు.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover: Pictorial Archive (Near Eastern History) Est.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి