కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 8/1 పేజీలు 3-4
  • ప్రాణము అమర్త్యమైనదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాణము అమర్త్యమైనదా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టమైన కొన్ని ప్రశ్నలు
  • మరణానంతర జీవితం—ప్రజలేమి నమ్ముతున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 8/1 పేజీలు 3-4

ప్రాణము అమర్త్యమైనదా?

స్నేహితులూ కుటుంబమూ తెరచివున్న శవపేటిక ప్రక్క నిశ్శబ్దంగా నడుస్తున్నారు. 17 ఏళ్ల అబ్బాయి శరీరంవైపు వారు చూస్తున్నారు. పాఠశాలనుండి వచ్చిన అతని స్నేహితులు అతన్ని గుర్తుపట్టడం కష్టమైంది. కెమోథెరపీ వల్ల అతని వెంట్రుకలు బాగా ఊడిపోయాయి, కాన్సర్‌వల్ల అతని శరీరం చిక్కి శల్యమైపోయింది. అతను నిజంగా తమ స్నేహితుడేనా? కేవలం కొన్ని వారాలక్రితం అతను ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు, చైతన్యంతో—జీవంతో నిండి ఉన్నాడు! ఆ అబ్బాయి తల్లి పదే పదే, “టామీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాడు. టామీ పరలోకంలో తనతో ఉండాలన్నది దేవుని చిత్తం” అని అంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంది.

గుండెపగిలిన ఈ తల్లి, తన కుమారుడు ఎలాగో ఇంకా జీవించి ఉన్నాడనే ఆలోచనలో కొంతమేరకు నిరీక్షణను ఓదార్పును కనుగొంటుంది. చర్చిలో, ప్రాణముa అమర్త్యమైనదనీ, అది వ్యక్తిత్వానికి, ఆలోచనలకు, జ్ఞాపకాలకు పీఠమని అంటే “అహం” అని ఆమె నేర్చుకుంది. ఆమె కుమారుని ప్రాణము చావనేలేదని ఆమె నమ్ముతోంది; ప్రాణము జీవిస్తుంది కనుక చనిపోయినప్పుడు అది అతని శరీరాన్ని విడిచి దేవునితోనూ దూతలతోనూ ఉండేందుకు పరలోకానికి వెళ్లింది.

దుఃఖకరమైన సమయంలో, ఎలాంటి ఆశాకిరణం కనిపించినా దానిని మానవ హృదయం అంటిపెట్టుకుంటుంది కనుక ఈ విశ్వాసం ఇంత మెప్పును ఎందుకు కల్గివుందో తెలుసుకోవడం కష్టం కాదు. ఉదాహరణకు, వేదాంతియైన జె. పాటర్సన్‌-స్మిత్‌ ది గాస్పల్‌ ఆఫ్‌ ది హియరాఫ్టర్‌ అనే పుస్తకంలో తనను తాను ఇలా వ్యక్తం చేసుకోవడాన్ని పరిశీలించండి: “మరణం తర్వాత వచ్చే దానితో పోల్చిచూస్తే—అంటే, మరణం మనకు పరిచయంచేసే అద్భుత అత్యద్భుత మహాద్భుతమైన లోకంతో పోల్చిచూస్తే మరణం అల్పమైనది.”

మానవునిలో మరణించని ఓ ప్రాణముందని, శరీరం మరణించిన తర్వాత కూడా జీవించడం కొనసాగించే ఒక చేతన ఆత్మ ఉందని ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాలు మరియు సంస్క్రతుల ప్రజలు నమ్ముతున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యపు వేలకొలది మతాలు మరియు తెగలన్నింటిలోనూ ఈ నమ్మకం ఉంది. యూదా మతంలో కూడా ఇది అధికారిక సిద్ధాంతం. ఆత్మ లేక ప్రాణము సమయం యొక్క ప్రారంభంలో సృష్టించబడి, జననమందు శరీరంలో బంధించబడి, మరణించినప్పుడు అది మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది, అలా పునర్జన్మ చక్రంలో అది కొనసాగుతుందని హిందువులు విశ్వసిస్తారు. ప్రాణము శరీరంతో సహా ఉనికిలోకివచ్చి శరీరం మరణించిన తర్వాత కూడా జీవిస్తుందని ముస్లింలు నమ్ముతారు. ఆఫ్రికా అనిమిస్ట్‌లు, షింటో వారు మరి ఒకరకంగా బౌద్ధులు సహితం అదే అంశాన్ని వివిధ రకాలుగా బోధిస్తారు.

కష్టమైన కొన్ని ప్రశ్నలు

అమర్త్యమైన ప్రాణమును గూర్చిన సిద్ధాంతం నిర్వివాదమైనది మరియు ఇంచుమించు సర్వసమ్మతం అయినదైనప్పటికీ, అది కొన్ని కలతపర్చే ప్రశ్నలను రేపుతుంది. ఉదాహరణకు, ఒక ప్రియమైన వ్యక్తి మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోతే అతని ప్రాణము ఎక్కడికి వెళుతుంది అని ప్రజలు ఆలోచిస్తారు. అతను ఏదోక తక్కువ జాతి జీవిగా పునర్జన్మనొందుతాడా? లేక పరలోకానికి వెళ్ళే అర్హతను అతను పొందేంతవరకు నిప్పుల్లో శుద్ధి చేయబడేందుకు అతను పాపవిమోచనా లోకానికి పంపించబడతాడా? అంతకంటే ఘోరంగా, అతను మండుతున్న నరకంలో నిరంతరం హింసించబడతాడా? లేక అనేక అనిమిస్ట్‌ మతాలు బోధిస్తున్నట్లుగా, అతను శాంతింపజేయాల్సిన ఒక ఆత్మయైయున్నాడా?

అలాంటి సిద్ధాంతాలు, జీవించి ఉన్నవారికి భారమైన సాధ్యతలను తయారుచేస్తాయి. మరణించిన మన ప్రియమైనవారు మనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో మనం వారి ఆత్మలను శాంతింపజేయాలా? భయంకరమైన పాపవిమోచనా లోకంలోనుండి వారు బయటికి వచ్చేందుకు మనం సహాయపడాలా? లేక వారు నరకంలో బాధపడుతున్నారనే ఆలోచనతో నిస్సహాయంగా భయంతో వణుకుతుండాలా? లేక మరణించిన మానవుల ప్రాణములను జీవించివున్న కొన్ని జంతువులు కల్గివున్నాయన్నట్లుగా ఆ జంతువులతో వ్యవహరించాలా?

దేవుని గూర్చి ఉత్పన్నమయ్యే ప్రశ్నలు కూడా కలతపర్చేవే. ఉదాహరణకు, ప్రారంభంలో ప్రస్తావించబడిన తల్లివంటి అనేకమంది తలిదండ్రులు, తనతో పరలోకంలో ఉంచుకునేందుకు తమ బిడ్డ యొక్క అమర్త్యమైన ప్రాణమును దేవుడు “తీసుకున్నాడు” అన్న ఆలోచనతో వారు మొదట ఓదార్పును పొందుతారు. అయితే, అమాయకుడైన ఓ బిడ్డను భయంకరమైన అస్వస్థతతో మొత్తి, హృదయవేదనతో ఉన్న తలిదండ్రులనుండి ఆ ప్రియమైన వానిని వేరుచేసి ఆ బిడ్డ సమయం కాకముందే పరలోకానికి తరలించిన దేవుడు ఎలాంటి దేవుడా అని అనేకులు త్వరలోనే ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాంటి దేవునిలో న్యాయం, ప్రేమ, కనికరాలు ఎక్కడున్నాయి? అలాంటి దేవుని వివేకాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తారు. ఈ ప్రాణములన్నీ చివరికి పరలోకంలో ఉండాల్సినవైనట్లైతే, వివేకవంతుడైన దేవుడు వాటిని మొదట భూమిమీద ఎందుకు పెడతాడని వారు ప్రశ్నిస్తారు. దాని భావం భూమిని సృష్టించడం నిజంగా వ్యర్థమనే కదా?—ద్వితీయోపదేశకాండము 32:4 పోల్చండి; కీర్తన 103:8; యెషయా 45:18; 1 యోహాను 4:8.

మరైతే, మానవ ప్రాణము యొక్క అమర్త్యతా సిద్ధాంతం, అంటే అది ఎలా బోధించబడినప్పటికీ అయోమయం కలిగించే ప్రశ్నలను, అసంబద్ధతలను తెస్తుంది. ఎందుకు? సమస్యలో అధికభాగం ఈ బోధ ఆరంభానికి వెళుతుంది. ఈ వ్రేళ్లను మీరు క్లుప్తంగా అన్వేషించడం జ్ఞానయుక్తమైనదని మీరు కనుగొనవచ్చు; అంతేకాకుండా ప్రాణమును గూర్చి బైబిలు ఏమని చెబుతుందో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు. మరణం తర్వాతి జీవితం విషయంలో, ఈ లోక మతాలు సాధారణంగా బోధించే దానికంటే ఎంతో శ్రేష్ఠమైన నిరీక్షణను అది అందిస్తుంది.

[అధస్సూచీలు]

a ప్రజలు సాధారణంగా, సోల్‌ అనే ఆంగ్ల పదంతో ఆత్మ అనే తెలుగు పదాన్ని జత చేసినప్పటికీ, ఇందులో మరియు దీని తర్వాతి శీర్షికలో, సోల్‌ అనే ఆంగ్ల పదాన్ని అనువదించేందుకు ప్రాణము అనే పదం సంగతంగా ఉపయోగించబడింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి