కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 7/15 పేజీ 32
  • “సింహపుగుండె” మీరు కలిగి ఉండగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సింహపుగుండె” మీరు కలిగి ఉండగలరు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 7/15 పేజీ 32

“సింహపుగుండె” మీరు కలిగి ఉండగలరు

బైబిలు కొన్నిసార్లు సింహాన్ని పరాక్రమానికి మరియు ధైర్యానికి చిహ్నంగా ఉపయోగిస్తుంది. సాహసం లేక పరాక్రమంగల మనుష్యులు “సింహపుగుండె” కలిగి ఉన్నట్లు వర్ణింపబడ్డారు మరియు నీతిమంతులు “సింహమువలె ధైర్యముగా” ఉంటారని చెప్పబడుతున్నారు. (2 సమూయేలు 17:10; సామెతలు 28:1) ప్రాముఖ్యంగా సింహాన్ని రెచ్చగొట్టినప్పుడు, “ఎల్లమృగములలో పరాక్రమముగల”ది అనే తన పేరు తనకు తగినదే అని అది చూపుతుంది.—సామెతలు 30:30.

యెహోవా దేవుడు, తన ప్రజలను కాపాడాలన్న తన తీర్మానాన్ని సింహం యొక్క నిర్భయత్వంతో సరిపోలుస్తున్నాడు. యెషయా 31:4, 5 ఇలా పేర్కొంటుంది: “తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికి . . . దిగి వచ్చును. . . . దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.” అలా యెహోవా తన సేవకులు ప్రాముఖ్యంగా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు తాను వారి ఎడల శ్రద్ధ తీసుకునేందుకు చర్య గైకొంటానని నిశ్చయతనిస్తున్నాడు.

బైబిలు, మానవజాతి యొక్క అతి పెద్ద శత్రువైన అపవాదియగు సాతానును ఒక గర్జిస్తున్న, ఆకలిగొన్న సింహానికి పోలుస్తుంది. మనం అతని వాత పడకుండా ఉండాలంటే, లేఖనాల్లో మనకిలా చెప్పబడింది: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి.” (1 పేతురు 5:8) దీన్ని చేసేందుకుగల ఒక మార్గమేమంటే, ప్రాణాంతకమైన ఆత్మీయ మగతను నివారించడం. ఈ విషయంలో యేసు ఇలా చెప్పాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా” కాకుండా “మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34-36) అవును, ఈ “అంత్యదినములలో” ఆత్మీయంగా జాగరూకంగా ఉండటం, “యెహోవాను ఆశ్రయించి స్థిరముగా” ఉండే, “సింహపుగుండె”ను మనకు ఇవ్వగలదు.—2 తిమోతి 3:1; కీర్తన 112:7, 8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి