వారికి పసితనంనుండే తర్ఫీదునివ్వండి
“పిండములు స్వరాలను విన్నప్పుడు దేహ సంబంధ ప్రతిస్పందనలను చూపుతాయి” అని ఆధునిక పరిశోధన సూచిస్తుంది. “గర్భాశయంలోని తమ పిల్లల కొరకు తల్లులు ఏదైనా చదివిన తర్వాత, అదే పాఠ్య భాగాన్ని మళ్లీ చదివి వినిపించినప్పుడు ఆ నవజాత శిశువులు ప్రతిస్పందించినట్లు” ఉత్తర కారోలీనా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు “కనుగొన్నారు” అని విన్నీపెగ్ ఫ్రీ ప్రెస్ చెబుతోంది. స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు బిగ్గరగా చదివితే, బిడ్డలో మంచి నైతిక విలువలను నాటేందుకు అది తోడ్పడగలదు. తిమోతి ‘పరిశుద్ధలేఖనములను పసితనము నుండే ఎరిగియున్నాడు’ అని బైబిలు చెబుతుంది. (2 తిమోతి 3:14, 15, NW) ఆయనకు పసితనంనుండే తర్ఫీదు ఇవ్వడం యొక్క విలువను ఆయన తల్లి మరియు అమ్మమ్మ గుణగ్రహించారని సాక్ష్యాలు చూపుతున్నాయి, ఆ తర్ఫీదులో బిగ్గరగా చదవడం కూడా తప్పకుండా ఇమిడివుంది.
చదవడమనేది, “నేడు మన సమాజంలో మనకున్న అతి శక్తివంతమైన జీవపు కౌశలమని” రచయిత జిమ్ ట్రలీస్ చెబుతున్నాడు. బిగ్గరగా చదవడం ద్వారా భాషాపరమైన మరియు ఉచ్చారణా నైపుణ్యాలు పెంపొందుతాయి.
కనీసం మీరు మీ పసివానితో మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనేనైనా బిగ్గరగా చదవడాన్ని ప్రారంభించడం జ్ఞానయుక్తమైనదే. మీరేమి చెబుతున్నారో మీ గర్భంలోని శిశువుకు లేక నవజాత శిశువుకు మొదట్లో అర్థం కాకపోయినా, భవిష్యత్తులో రాగల దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రయత్నాలు చేయడం యోగ్యమైన పనే. సామెతలు 22:6 ఇలా చెబుతుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”
ఆచరణాత్మకమైనది మరియు ప్రయోజనకరమైనది అయిన దేన్ని మీరు చదవవచ్చు? ప్రతిరోజు మీ పిల్లవానికి బైబిలును బిగ్గరగా చదివి వినిపించండి. గొప్ప బోధకుడిని వినుచుండుట (ఆంగ్లం), నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం), జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి వంటి ఇతర యోగ్యమైన ప్రచురణలను మరియు కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలను కూడా చదివి వినిపించండి.
ఈ విధంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలంటే ఎంతో సమయం అవసరమన్న విషయం వాస్తవమే, అయితే అది ఎంతో మంచిగా గడిపిన సమయమౌతుంది. మీకు మీ పిల్లవాని ఎడల శ్రద్ధ ఉందని మరియు మీరు మీ పిల్లవాన్ని ప్రేమిస్తున్నారని చూపేందుకు అది ఎంతో స్పర్శనీయమైన మార్గం.