ఉద్యోగవిరమణ—దైవపరిపాలనా కార్యానికి తెరచిన ద్వారమేనా?
ఉద్యోగవిరమణ—అనేకులకది దీర్ఘకాలిక ఒత్తిడి బాధల ద్వారం మూసినట్లే. కష్టము మరియు మానసికాందోళనతో కూడిన కార్యక్రమంలో బంధించబడిన తర్వాత, ఉద్యోగవిరమణ అనేక సంవత్సరాల విశ్రాంతికి వ్యక్తిగత స్వేచ్ఛకూ ద్వారాన్ని తెరుస్తుందని అనేకులు దానికొరకు ఎదురుచూస్తుంటారు. అయితే తరచూ, ఆ ద్వారం బోరెత్తడానికీ ఉదాసీనతకూ నడుపుతుంది. పనిచేయడంవల్ల వచ్చే భావన, వినోదమూ హాబీలవల్ల రాదు.
ఉద్యోగవిరమణ యెహోవాసాక్షుల కొరకు ‘కార్యాలకు నడిపే పెద్ద ద్వారాన్ని తెరవగలదు.’ (1 కొరింథీయులు 16:9) వయస్సుమళ్లడం వల్ల కొన్ని సమస్యలు పరిమితులు ఉన్నప్పటికీ యెహోవా సహాయంతో వారు ఆయనకు చేసే సేవను అధికం చేసికోగలరని కనుగొన్నారు. నెథర్లాండ్స్లోని కొందరు వృద్ధ క్రైస్తవుల అనుభవాన్ని పరిశీలించండి. 1995 సేవా సంవత్సరంలో ఉన్న 1,223 పయినీర్లలో (పూర్తికాల రాజ్య ప్రచారకులు) 269 మంది 50 ఏళ్లకు పైబడినవారే. వీరిలో, 81 మంది 65 ఏళ్లవారు లేక అంతకంటే ఎక్కువ వయస్సుగలవారు.
కొందరు, తాము లౌకికోద్యోగం చేసేటప్పుడు ఏర్పర్చుకున్న బిజీ పట్టికను కొనసాగించగల్గుతున్నారు. (ఫిలిప్పీయులు 3:16 పోల్చండి.) ఉద్యోగవిరమణను పొందిన కరెల్ అనే ఓ క్రైస్తవుడు ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు: “నేను లౌకికోద్యోగాన్ని చేసేటప్పుడు, 7:30కి పనిని ప్రారంభించేవాన్ని. నాకు పెన్షను రావడం ప్రారంభమైనప్పుడు కూడా, అదే దినచర్యను కల్గివుండాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రతి రోజు ఉదయం ఏడుగంటలకు రైల్వే స్టేషన్‌కి ఎదురుగా పత్రికలందిస్తూ వీధి సాక్ష్యాన్నివడంతో రోజును ప్రారంభిస్తాను.”
ఇందులో విజయం సాధించేందుకు ఓ కీలకం జాగ్రత్తగా పథకం వేసుకోవడమే. (సామెతలు 21:5) ఉదాహరణకు, తమ పరిచర్యలో ఉన్నప్పుడు తమను తాము పోషించుకునేందుకుగాను అవసరమున్నంత ధనాన్ని కొందరు దాచుకోగలిగారు. మరికొందరు స్వంత ఖర్చులను తగ్గించుకుని పార్ట్ టైమ్ ఉద్యోగాలను సంపాదించారు. టయోడొర్ మరియు ఆన్‌లను పరిగణనలోకి తీసుకోండి. కుటుంబ బాధ్యతలవల్ల పయినీరింగ్ ఆపు చేయవల్సివచ్చేంతవరకు, పయినీరింగుతో ప్రారంభించిన వారి వివాహజీవితాన్ని అలాగే కొనసాగించారు. అయితే వారి పయినీర్ స్ఫూర్తి చెక్కుచెదరలేదు! వారి కుమార్తెలు పెరుగుతుండగా వారు పయినీరింగు చేయమని ఎడతెగక ప్రోత్సహించారు. అతి ప్రాముఖ్యంగా, టయోడొర్ మరియు ఆన్ సహాయ పయినీరింగు చేస్తూ పిల్లలకు మంచి మాదిరినుంచారు. ఆ కుమార్తెలు పెరుగుతున్న కొలది ప్రాంతీయ సేవలో సమయాన్ని గడిపేందుకుగాను టయోడోర్ మరియు ఆన్ లౌకిక ఉద్యోగ సమయాన్ని తగ్గిస్తూవచ్చారు.
వారి కుమార్తెలు పూర్తికాల సేవలో ప్రవేశించి ఇల్లువిడిచిన తర్వాత ఆన్ పయినీరింగ్ ప్రారంభించింది. ఒక రోజామె టయోడొర్ను ఉద్యోగం మానేయమని ప్రోత్సహించింది. “మనమిద్దరమూ పయినీర్ సేవను చేసుకోవచ్చు” అని ఆమె చెప్పింది. తన నిర్ణయాన్ని టయోడొర్ తన యజమానికి తెలియజేశాడు. “[పరలోకంలో] పైనున్న మీ యజమాని కొరకు నువ్వు పూర్తికాలం పని చేయాలనుకుంటున్నావు కాబోలు” అని అంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాన్నిస్తానంటూ తన యజమాని సహాయపడడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు టయోడొర్ మరియు ఆన్, ఇద్దరూ కలిసి పయినీరుసేవలో ఆనందిస్తున్నారు.
తమ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులనుబట్టి కొందరు పయినీరింగ్ చేయడం ప్రారంభించారు. ఓ వృద్ధ దంపతులు తమ కుమార్తె, మనమరాళ్ల దారుణ మరణం వారు తమ శేష జీవితాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న విషయాన్ని పరిశీలించేలా చేసింది. (ప్రసంగి 7:2) దుఃఖం వారిని మ్రింగివేయడానికి అనుమతించే బదులు, వారు పూర్తికాల సేవను చేపట్టారు. ఇప్పటివరకు వారు ఎనిమిది సంవత్సరాలకంటె ఎక్కువే ఆ సేవలో ఆనందించారు!
పూర్తికాల సేవలో కొనసాగేందుకు కచ్చితమైన తీర్మానం అవసరమౌతుందని ఒప్పుకోవల్సిందే. ఉదాహరణకు, ఎర్న్స్ట్ ఆయన భార్య రీక్, తమ పిల్లలు ఇల్లు విడిచిన వెంటనే పయినీరింగును చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు మునుపు పరిచయమున్న ఓ వ్యాపారస్థుడు ఓ లాభసాటి ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు. ఎర్న్స్ట్ ఇలా జవాబిచ్చాడు: “మాకు ఎక్కడాలేని శ్రేష్ఠమైన యజమానివున్నాడు, మేము ఆయన్ని విడువదలచుకోలేదు!” ఎర్న్స్ట్ ఆయన భార్య యెహోవా “పనిలో” నిలిచివున్నారు కనుక ఇతర సేవాధిక్యతలు వారికి తెరవబడ్డాయి. వారు సుమారు 20 ఏళ్లు ప్రాంతీయ పనిలో సేవచేశారు, మరి ఈనాటి వరకూ వారు పయినీర్లుగా ఉన్నారు. స్వయం త్యాగ జీవిత విధానాన్ని ఎన్నుకున్నందుకు వారు బాధపడుతున్నారా? కొంతకాలం క్రితం ఆ దంపతులు ఇలా వ్రాశారు: “అది యెహోవా చిత్తమైతే, మూడు నెలల్లో మా 50 ఏళ్ల వివాహోత్సవాన్ని జరుపుకోవాలనుకుంటున్నాము, అది తరచూ స్వర్ణోత్సవం అని పిలువబడుతుంది. అయితే మా నిజమైన బంగారు సంవత్సరాలు మేము పయినీరింగు ప్రారంభించినప్పుడు మొదలయ్యాయని పూర్తి విశ్వాసంతో చెప్పగలం.”
అధిక కార్యక్రమానికి నడిపే ద్వారం అధిక ఆనందానికి కూడా నడుపుతుందని అనేకులు కనుగొన్నారు! తాను 65వ ఏడుకు చేరుకున్న రెండు వారాల తర్వాత పయినీరింగును చేపట్టిన ఓ సహోదరుడు ఇలా అంటున్నాడు: “గత పది సంవత్సరాల పయినీర్ సేవలో నేను అనుభవించినన్ని గొప్ప ఆశీర్వాదాలను నేనెన్నడూ అనుభవించలేదని చెప్పుకోవాలి.” ఏడు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం వరకూ పయినీర్ సేవను చేసిన ఓ వివాహ జంట ఇలా చెప్పింది: “మా వయస్సులోనూ మా పరిస్థితిల్లోనూ ఉన్న దంపతులు ఇంకేమి చేయగలరు? మేము పనిచేసే ప్రాంతంలో, హాయిగా ఇంటివద్ద ఉంటూ ఊరికే ఉబ్బుతూ, ముసలివారౌతూ బిగుసుకుపోతూ ఉండే మా వయస్సువాళ్లను మేము తరచూ చూశాము. ఈ సేవ మమ్మల్ని మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంచుతుంది. మేము ఎల్లప్పుడూ కలిసే ఉండేవారం. మేము ఎక్కువగా నవ్వుతూ మా జీవితాన్ని ఆనందిస్తున్నాము.”
నిస్సందేహంగా, వృద్ధులందరు పయినీరు సేవను చేసేందుకు వారి పరిస్థితులు అనుమతించవు. తన సేవలో ఈ క్రైస్తవులు చేసే ఏ పనినైనా యెహోవా మెచ్చుకుంటాడన్న అభయాన్ని వారు కల్గివుండగలరు. (మార్కు 12:41-44 పోల్చండి.) ఉదాహరణకు, వికలాంగురాలైన ఓ సహోదరి ఓ నర్సింగ్ హోమ్‌లో ఉండవల్సివచ్చింది. అయినప్పటికీ, కార్యాల ద్వారం ఆమెకొరకు ఇంకా తెరిచే ఉంది! ఓ డాక్టరు ఆమె తన సమయాన్ని ఎలా గడిపింది అని అడిగాడు. ఆమె ఇలా చెబుతోంది: “నాకెప్పుడూ సమయం సరిపోదని చెప్పాను. ఆయనకు ఆ విషయం అర్థంకాలేదు. నా దినాలు సంతృప్తికరమైన కార్యాలతో నిండివున్నందుకేనని నేను ఆయనతో చెప్పాను. నేను ఒంటరిగా లేను, కానీ ఒంటరిగా ఉన్నవారిని కనుగొని, మానవజాతి కొరకు దేవుడు దాచివుంచిన దానిని గూర్చి చెప్పేందుకు ప్రయత్నిస్తాను.” చివరికి ఆమె ఈ మాటలతో ముగుస్తుంది: “80 ఏళ్లు చేరుకుంటున్న వ్యక్తినుండి ఎవరైనా ఎక్కువే అపేక్షిస్తారు. నేను యెహోవా వైపుకు ఇంకా అనేకులను తెచ్చేలా నాకొరకు ప్రార్థించండి.”
మీరు ఉద్యోగవిరమణ చేసే వయస్సుగలవారా? పనితక్కువకుగల ద్వారం చాలా శోధించవచ్చు, కానీ అది ఆత్మీయ ఆశీర్వాదానికి ద్వారంకాదు. మీ పరిస్థితులను గూర్చి ప్రార్థనా పూర్వకంగా ఆలోచించండి. బహుశ మీరు యెహోవా సేవలో ఎక్కువ పనిని చేసేందుకు ఉన్న ద్వారం గుండా నడిపించబడవచ్చు.
[25వ పేజీలోని చిత్రం]
ఉద్యోగవిరమణ అధిక పనిని చేయడానికి నడిపించవచ్చు