కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/15 పేజీ 32
  • వారికి తమ బలం ఎక్కడనుండి వచ్చింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారికి తమ బలం ఎక్కడనుండి వచ్చింది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/15 పేజీ 32

వారికి తమ బలం ఎక్కడనుండి వచ్చింది?

ఈ ఫొటోలోని సీతాకోకచిలుకను మీరు దగ్గిరగా పరిశీలిస్తే, దాని నాలుగు రెక్కల్లో ఒకటి పూర్తిగా పనికిరానట్లుగా ఉన్నట్లు మీరు చూస్తారు. అయినప్పటికీ, ఆ సీతాకోకచిలుక తింటూనే ఎగురుతూనేవుంటుంది. ఇది విశేషమైన విషయం కాదు. తమ రెక్కల పైభాగం 70 శాతం పోయినప్పటికీ సీతాకోకచిలుకలు తమ అనుదిన పనులను చేస్తూనే ఉన్నట్లు గమనించబడింది.

అదేవిధంగా, అనేకమంది ప్రజలు అచంచలమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. తీవ్రమైన శారీరక, భావోద్రేక సమస్యలున్నప్పటికీ వారు అధైర్యపడరు.—2 కొరింథీయులు 4:16 పోల్చండి.

అపొస్తలుడైన పౌలు, తన మిషనరీ యాత్రా సమయంలో తానుగా తీవ్రమైన కష్టాలను సహించవల్సివచ్చింది. ఆయన కోరడాలతో కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. దానికి తోడు, ఆయన శారీరక లోపాన్ని అంటే బహుశ ఆయనకు ఎప్పుడూ “శరీరములో ఒక ముల్లు”గా ఉండే కంటి సమస్యను అనుభవించాడు.—2 కొరింథీయులు 12:7-9; గలతీయులు 4:15.

అనేక సంవత్సరాలవరకూ తీవ్రమైన కృంగుదలతో పోరాడిన ఓ క్రైస్తవ పెద్దయైన డేవిడ్‌, దానినుండి కోలుకునేందుకు తనకు యెహోవా బలం తప్పకుండా అవసరమని నమ్ముతున్నాడు. “కష్టపడి సాధించిన పురోగతి అనేకమార్లు అదృశ్యమౌతున్నట్లుగా అనిపించేది. అలాంటి నిరుత్సాహాన్ని ఎదుర్కోవల్సివచ్చినప్పుడు నేను యెహోవాపై పూర్తిగా ఆధారపడేవాణ్ణి మరి ఆయన నన్ను నిజంగా కాపాడేవాడు. నేను ఎన్నో గంటలవరకూ ప్రార్థించిన సందర్భాలున్నాయి. యెహోవాతో మాట్లాడినప్పుడు, నేననుభవించిన ఒంటరితనం, పనికిరాననే భావం మటుమాయమయ్యాయి. తీవ్రమైన బలహీనతవున్న సమయాలతో నేను పోరాడాను, అయితే యెహోవా దయవల్ల ఈ బలహీనత నుండే బలం వచ్చింది, అలాగే ఇతరులకు సహాయపడేంత బలం సహితం వచ్చింది” అని ఆయన వివరించాడు.

యెహోవా దేవుడు పౌలును బలపర్చాడు. అందుకనే ఆయన ఇలా చెప్పగలిగాడు, “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:10) అవును, పౌలు బలహీనత ఆయన దేవుడిచ్చిన బలంపై ఆధారపడేందుకు నేర్పింది. “నన్ను బలపర్చువానియందే నేను సమస్తమును చేయగలను” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఫిలిప్పీయులు 4:13) యెహోవా తన సేవకులకు బలాన్ని తప్పక ఇస్తాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి