కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/1 పేజీ 32
  • “మీకు సహనం అవసరం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీకు సహనం అవసరం”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/1 పేజీ 32

“మీకు సహనం అవసరం”

మనం ‘వాగ్దాన నెరవేర్పును’ పొందాలంటే మనకు ‘సహనం అవసరం.’ (హెబ్రీయులు 10:36) ఈ వచనంలో అపొస్తలుడైన పౌలు ‘సహనం’ కొరకు ఉపయోగించిన గ్రీకు పదం “క్లిష్టమైన, అననుకూలమైన పరిస్థితుల్లో జీవించే ఓ మొక్క సామర్థ్యాన్ని” వర్ణించేందుకు కొన్నిసార్లు పనిచేసిందని ఒక బైబిలు పండితుడు వివరిస్తున్నాడు.

యూరప్‌ పర్వతాల్లో, అలాంటి మొక్కే పెరుగుతోంది. ఉత్కంఠభరితంగా, అది నిరంతర-జీవి అని పిలవబడింది. ఈ ఆల్ఫైన్‌ మొక్క నిరంతరం జీవించదనుకోండి, కాని అది అనేక సంవత్సరాలు తాళుకొని, ప్రతి వేసవిలో అందమైన పుష్పాల్ని పూస్తుంది. ఆ మొక్క యొక్క “దారుఢ్యాన్ని, తాళుకొనేశక్తిని”బట్టి దానికి నిరంతర-జీవి అనే పేరు పెట్టబడిందని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తోంది. (ఈ మొక్కల ప్రజాతికి పెట్టబడిన శాస్త్రీయ నామమైన సెమపెర్‌వివమ్‌కు కూడా “నిరంతర జీవం” అని అర్థం.)

తాళుకొనేశక్తిగల ఈ మొక్క ఎంతో నిస్సారవంతమైన ప్రదేశాల్లో పెరగడమే దీనిని విశిష్ఠమైనదిగా చేస్తోంది. దీనిని గాలివీచే పర్వత ఏటవాలుల ఎత్తయిన ప్రదేశాల్లోనూ కనుగొనవచ్చు, అక్కడ శీతోష్ణస్థితులు కేవలం 24 గంటల్లో 35°C వరకూ తగ్గిపోగలవు. ఇది రాతి పగుళ్లలోనికి కొద్దిపాటి మట్టితోపాటు వ్రేళ్లూనుకొనగలదు. అటువంటి అననుకూలమైన పరిస్థితుల్లో అది తాళుకోవడానికిగల రహస్యాల్లో కొన్ని ఏమిటి?

ఈ నిరంతర-జీవి రసభరితమైన ఆకులను కల్గివుంది, అవి నీటిని జాగ్రత్తగా నిక్షిప్తం చేస్తాయి. ఇది, వర్షం లేక ద్రవీభవించిన మంచు నుండి లభ్యమైన తేమ అంతటి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందేగల్గేలా దానిని చేస్తుంది. అంతేకాకుండా, అది వాటి రాతి ఆధారంపై దృఢమైన పట్టును కల్గివుండేందుకు తమ బలాన్ని సంఘటితపర్చే పొదలుగా పెరుగుతుంది. కొంతమన్ను ఉన్నప్పటికీ కూడా, పగుళ్లలోనికి వ్రేళ్లూనుకోవడం వల్ల ప్రకృతి శక్తులకు వ్యతిరేకంగా అది కొంత రక్షణను కల్గివుంటుంది. ఇతర మాటల్లో చెప్పాలంటే, అది క్లిష్టమైన పరిస్థితులను బాగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిపొందుతుంది.

ఆత్మీయంగా మాట్లాడాలంటే, మన సహనం యొక్క నాణ్యతను పరిక్షించే పరిస్థితుల్లో మనం ఉన్నట్టు మనల్ని మనం కనుగొనవచ్చు. శోధనల్లో సహించుకునేందుకు మనకు ఏది సహయపడుతుంది? నిరంతర-జీవి మొక్కవలె, దేవుని వాక్యం యొక్క జీవాన్నిచ్చే జలాన్ని మనం భద్రపర్చుకొనగలం, మద్దతు రక్షణల కోసం నిజ క్రైస్తవులతో సన్నిహితంగా సహవసించగలం. విశేషంగా, ఆల్ఫైన్‌ పుష్పంవలె, మన కేడెమైన యెహోవాను అలాగే ఆయన వాక్యాన్ని మరి ఆయన సంస్థను మనం గట్టిగా హత్తుకుందాం.—2 సమూయేలు 22:3.

నిజమే అననుకూలమైన వాతావరణంలో కూడా లభ్యమౌతున్న ఏర్పాట్లనుండి మనం ప్రయోజనం పొందితే, మనం సహించుకొనగలం అనేదానికి ఈ నిరంతర-జీవి మొక్క ఓ ఆకర్షణీయమైన జ్ఞాపిక. అటువంటి సహనం మన ‘వాగ్దాన నెరవేర్పుకు’ అంటే దాని అక్షరార్థ భావమైన నిరంతర జీవానికి నడిపిస్తుందని యెహోవా మనకు అభయం ఇస్తున్నాడు.—హెబ్రీయులు 6:12; మత్తయి 25:46.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి