కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/15 పేజీ 32
  • సువార్త సత్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్త సత్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/15 పేజీ 32

సువార్త సత్యం

మత్తయి సువార్త వ్రాతప్రతిలోని p64 అని పిలువబడే మూడు చిన్న భాగాలు 1901 నుండి ఇంగ్లాండునందలి ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డలన్‌ కాలేజ్‌లో ఉంటున్నాయి. అవి సా. శ. రెండవ శతాబ్దం తుది భాగానికి చెందినవని కొందరు పండితులు కొంతకాలం నమ్మారు.

జర్మనీలోని పాడర్‌బోర్న్‌నందలి కార్‌స్టన్‌ పి. టీడె అనే పురాతన పత్ర లేఖనాల నిపుణుడు మత్తయి 26వ అధ్యాయంలోని 10 వచనాల భాగాలు ఇమిడి ఉన్న p64ను గూర్చిన సంపూర్ణ పరిశోధనను ఇటీవల జరిపాడు. దాని ఫలితమేమిటి? జెయిట్‌ష్రిఫ్ట్‌ ఫర్‌ పాపిరోలజీ అండ్‌ ఏపీగ్రాఫిక్‌ (జర్నల్‌ ఆఫ్‌ పాపిరోలజీ అండ్‌ ఎపిగ్రాఫిక్స్‌)లో వ్రాస్తూ ఆక్స్‌ఫర్డ్‌ భాగాలను “మొదటి శతాబ్దంలోని, బహుశా (కచ్చితం కాకపోయినా) క్రీ. శ. 70కి ముందటి క్రైస్తవ వ్రాతప్రతి భాగం” అని టీడె వర్ణించాడు.

టీడె యొక్క అభిప్రాయాలు పత్రికారంగంలోను పండితుల మధ్యను తీవ్రమైన చర్చాంశాలయ్యాయి. ఎందుకని? ఎందుకంటే, దాదాపు సా. శ. 125 నాటి లేదా రెండవ శతాబ్దానికి ముందటిది కానిదైన యోహాను సువార్తలోని భాగమైన p52 సువార్తల్లో మిగిలివున్న అతి పురాతనమైన పాఠ్యభాగంగా ప్రస్తుతం అంగీకరించబడుతుంది.

p64 అనే వ్రాతప్రతి భాగాలకు ఇవ్వబడిన క్రొత్త తేదీని అందరూ అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకా చూడవలసి ఉంది. ఏది ఏమైనప్పటికీ, ముందటి తేదీ p64ను ఉనికిలో ఉన్న అతి పురాతన భాగాలుగా చేయడమే కాక, మొదటి శతాబ్దంలో లేదా బహుశా సా. శ. 70కి ముందే, సువార్త సత్యానికి మద్దతునిచ్చేందుకు యేసు జీవితంలోని సంఘటనలకు అనేకమంది ప్రత్యక్షసాక్షులు ఉన్నప్పుడే నిజానికి మత్తయి సువార్త వ్రాయబడింది అని సూచించే అదనపు రుజువును కూడా ఇవ్వవచ్చు.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

By permission of the President and Fellows of Magdalen College, Oxford.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి