కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/15 పేజీ 30
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీ అత్యవసర భావాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/15 పేజీ 30

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట ప్రతులను చదివి ఆనందించారా? ఈ క్రింది విషయాలను జ్ఞాపకంచేసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది:

◻ మత్తయి 11:28 నందలి ఆయన ఆహ్వానానికి అనుగుణంగా ఒకరు ఎలా ‘యేసు యొద్దకు వస్తారు’?

యేసు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) కనుక, యేసు వద్దకు రావడం అంటే ఒక బాధ్యతా భారాన్ని అంగీకరించి, దేవుడు మరియు క్రీస్తుల చిత్తానికి తమ చిత్తాన్ని అప్పగించడమూ అలా చేయడంలో కొనసాగడమూ అని భావం.—8/15, 17వ పేజీ.

◻ మత్తయి 7:13, 14 నందు యేసు చెప్పిన ‘జీవానికి నడిపే ఇరుకు మార్గాన్ని’ ఎందుకు కొందరు మాత్రమే కనుగొంటారు?

ఇరుకు మార్గం దేవుని సూత్రాలు మరియు కట్టడలచే నిర్బంధించబడి ఉంది. కనుక తన జీవితాన్ని దేవుని కట్టడల అనుసారంగా ఉంచుకోవాలని యథార్థంగా కోరుకొనే వ్యక్తినే అది ఆకర్షిస్తుంది. నిర్బంధాలు ఉన్నట్లు కనిపించే ఇరుకు మార్గం ఒక వ్యక్తిని ప్రతి ముఖ్యమైన విషయంలోను స్వతంత్రున్ని చేస్తుంది. దాని పరిధులు “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము”చే ఏర్పరచబడ్డాయి. (యాకోబు 1:25)—9/1, 5వ పేజీ.

◻ వివేచనను ఎలా అలవర్చుకోవచ్చు?

నిస్సందేహంగా, వివేచన సులభంగా లేక సహజంగా రాదు. కాని సహనం, ప్రార్థన, తీవ్ర ప్రయత్నం, జ్ఞానయుక్తమైన సహవాసం, బైబిలు అధ్యయనం మరియు దాన్ని ధ్యానించడం, యెహోవా పరిశుద్ధాత్మపై ఆధారపడడం వంటివాటి ద్వారా దాన్ని అలవర్చుకోవచ్చు.—9/1, 21వ పేజీ.

◻ మానవుల అసూయ మంచికి నడిపే శక్తిలా ఎలా పనిచేయగలదు?

అది ఒక వ్యక్తి తనకు ప్రియమైన వారిని చెడు ప్రభావాలనుండి రక్షించడానికి పురికొల్పగలదు. అంతేకాకుండా, మానవులు యెహోవా కొరకు మరియు ఆయన ఆరాధన కొరకు అసూయను యుక్తంగా చూపగలరు. (1 రాజులు 19:10)—9/15, 8, 9 పేజీలు.

◻ వారు “యోసేపు ఒడిలో ఉంచబడిరి” అని యోసేపు ముని మనుమల గురించి ఆదికాండము 50:23 నందున్న మాటల అర్థం ఏమిటి?

ఆ పిల్లలను యోసేపు తన వంశీకులుగా గుర్తిస్తున్నాడని ఇది సూచించవచ్చు. అలాగే ఆయన పిల్లలతో ఆడుకున్నాడని, వారిని తన ఒడిలో ఆడించేవాడని కూడా ఇది సూచించవచ్చు. నేడు తండ్రులు తమ పిల్లల ఎడల అలాంటి ఆప్యాయతను చూపించడం మంచిది.—9/15, 20, 21 పేజీలు.

◻ వివాహిత మరియు కుటుంబ జీవితంలో విజయం సాధించడానికి ఎంతో ప్రాముఖ్యమైనది ఏది?

అటువంటి కోరదగిన ఫలితాలు సాధించడానికి వివాహ జతలు ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వాలి. అలా చేసే వివాహిత జతలు కలిసి జీవించడానికి ప్రయత్నించి, దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. తద్వారా వారు దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే అన్ని విధాలైన హృదయ వేదనలను తప్పించుకుంటారు. (కీర్తన 19:7-11)—10/1, 11వ పేజీ.

◻ దైవిక అత్యవసర భావం ఈనాడు ఎంత ప్రాముఖ్యము?

దైవిక అత్యవసర భావం పూర్ణప్రాణముతో యెహోవాను సేవించడంలో ఒక అంతర్గత భాగం. అది కాపాడుతుంది మరియు దేవుని సేవకులు ‘అలసట పడేలా, వారి ప్రాణములు విసుగు’ చెందేలా చేయాలని అపవాది చేసే ప్రయత్నాలను ఎదిరించేందుకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 12:3) లోకం మరియు దాని మోసకరమైన వస్తుదాయకత్వంలో ఎక్కువగా నిమగ్నమై ఉండకుండా అది వారిని కాపాడుతూ “వాస్తవమైన జీవము”పై వారి మనస్సులను ఉంచుతుంది. (1 తిమోతి 6:19)—10/1, 28వ పేజీ.

◻ మేకలూ గొఱ్ఱెల ఉపమానంలో, యేసుక్రీస్తు సింహాసనంపై ఎప్పుడు కూర్చుంటాడు మరియు ఎందుకు? (మత్తయి 25:31-33)

ఉపమానం ఆయన రాజు అయ్యే భావంలో సింహాసనంపై కూర్చున్నాడని చూపించడం లేదు. బదులుగా ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నాడు. ఆ తీర్పు అనేక సంవత్సరాల కాలం వరకు కొనసాగేది కాదు. దానికి బదులుగా ఆ ఉపమానం యేసు పరిమిత సమయంలో జనాంగములపై తీర్పును ప్రకటించి అమలుపర్చే భవిష్యత్‌ పరిస్థితిని సూచిస్తోంది.—10/15, 22, 23 పేజీలు.

◻ యేసు తరచుగా ప్రస్తావించిన ఆ “తరము” ఏది?

యూదా జనాంగంగా తయారైన తన సమకాలీన సామాన్య ప్రజలను వారి ‘గ్రుడ్డి మార్గదర్శకుల’తో కలిపి ఏకరీతిగా “ఈ తరము” అనే పదాన్ని యేసు అన్వయించాడు. (మత్తయి 11:16; 15:14; 24:34)—11/1, 14వ పేజీ.

◻ మత్తయి 24:34-39 నందున్న యేసు ప్రవచనం యొక్క చివరి నెరవేర్పులో “ఈ తరం” అనే మాటలు దేన్ని సూచిస్తున్నాయి?

స్పష్టంగా క్రీస్తు ప్రత్యక్షత యొక్క సూచనను చూసినప్పటికీ తమ మార్గాలను సరి చేసుకోడానికి తప్పిపోయే ప్రజలను యేసు సూచిస్తున్నాడు.—11/1, 19, 31 పేజీలు.

◻ ఆశ్రయపురములను ఏర్పాటు చేయడం వాటి నిర్బంధాలన్నిటితో సహా, ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూర్చింది?

వారు మానవ జీవం గురించి అజాగ్రతగా లేక నిర్లక్ష్యంగా ఉండకూడదని ఇశ్రాయేలీయులపై అది ఎంతో ప్రభావం చూపింది. దయ చూపించడం తగినదైనప్పుడు దయ చూపించవలసిన అవసరతను కూడా అది ఉన్నతపరిచింది. (యాకోబు 2:13)—11/15, 14వ పేజీ.

◻ సూచనార్థక ఆశ్రయపురము అంటే ఏమిటి?

ఇది రక్తం యొక్క పవిత్రతను గూర్చి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినందుకు వచ్చే మరణం నుండి మనల్ని కాపాడడానికి ఆయన చేసిన ఏర్పాటు. (ఆదికాండము 9:6)—11/15, 17వ పేజీ.

◻ మనం శక్తిని తిరిగి పొందడానికి క్రైస్తవ సహోదరత్వం ఎలా సహాయం చేస్తుంది? (యెషయా 40:31)

అలాంటి ఒత్తిళ్ళను లేక శ్రమలను ఎదుర్కొని, మనకున్నలాంటి భావాలనే కలిగివుండిన కొందరు నిస్సందేహంగా మన క్రైస్తవ సహోదర సహోదరీలలో ఉన్నారు. (1 పేతురు 5:9) మనం ఎదుర్కొంటున్నది అసామాన్యమైనది కాదని, మన భావాలు అసాధారణమైనవి కావని తెలుసుకోవడం ధైర్యాన్నిస్తుంది మరియు విశ్వాసాన్ని బలపరుస్తుంది.—12/1, 15, 16 పేజీలు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి