కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/15 పేజీలు 8-10
  • అమ్మోనీయులు—దయకు మారుగా ద్వేషం చూపిన ప్రజలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అమ్మోనీయులు—దయకు మారుగా ద్వేషం చూపిన ప్రజలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • గిలాదు బలాఢ్యులకు పుట్టినిల్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు
    నా బైబిలు కథల పుస్తకము
  • యెఫ్తా ఇచ్చిన మాట
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/15 పేజీలు 8-10

అమ్మోనీయులు—దయకు మారుగా ద్వేషం చూపిన ప్రజలు

హాషేమైట్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ జోర్డాన్‌ ముఖ్యపట్టణమైన అమ్మాన్‌ అనే పేరుగల ఆధునిక నగరం, భూమిపైనుండి నిర్మూలింపబడిన ఒక జనమును జ్ఞాపకం చేస్తుంది. వారు అమ్మోనీయులని పిలువబడ్డారు. వారెవరు, వారి పతనం నుండి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు?

అమ్మోనీయులు నీతిమంతుడైన లోతు సంతానంవారు. (ఆదికాండము 19:35-38) లోతు అబ్రాహాము సహోదరుని కుమారుడైయుండెను గనుక, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులకు సహోదరులైయుండిరని మీరనవచ్చు. అయితే, లోతు సంతానంవారు అబద్ధ దేవుళ్లను ఆరాధించడం ప్రారంభించారు. అయినప్పటికీ, యెహోవా దేవుడు వారి ఎడల శ్రద్ధ కలిగివుండెను. ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశాన్ని సమీపిస్తుండగా, దేవుడు వారినిలా హెచ్చరించాడు: “[అమ్మోనీయులను] బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.”—ద్వితీయోపదేశకాండము 2:19.

అమ్మోనీయులు అలాంటి దయను మెచ్చుకొన్నారా? బదులుగా, యెహోవా తమకేదైనా ఇచ్చాడనే విషయాన్ని గుర్తించడానికి వారు నిరాకరించారు. దేవుడు వారి ఎడల కలిగివున్న దయాపూర్వకమైన శ్రద్ధకు బదులుగా వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎడల కనికరం లేని ద్వేషాన్ని చూపారు. ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞను గౌరవించి వారికి వ్యతిరేకంగా కఠినంగా ప్రవర్తించకపోయినప్పటికీ, అమ్మోనీయులు మరియు వారి సహోదరులైన మోయాబీయులు భయపడ్డారు. నిజమే, అమ్మోనీయులు సైనిక దాడి చేయలేదు, కాని వారు బిలాము అనే ప్రవక్తను కిరాయికి తెచ్చుకొని, అతడు ఇశ్రాయేలీయులను శపించాలని కోరారు.—సంఖ్యాకాండము 22:1-6; ద్వితీయోపదేశకాండము 23:3-6.

అప్పుడు ఒక వింత జరిగింది. బిలాము శపించలేకపోయాడని బైబిలు నివేదిస్తుంది. “నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును” అని చెబుతూ, అతడు వారి కొరకు కేవలం ఆశీర్వాదాలనే పలుక గలిగాడు. (సంఖ్యాకాండము 24:9) అమ్మోనీయులతో సహా దానిలో చేరివున్నవారు దీని నుండి ఈ శక్తివంతమైన గుణపాఠం నేర్చుకొనివుండవచ్చు: దేవుని ప్రజలు ఇమిడివున్నప్పుడు, ఆయన వారి పక్షాన జోక్యం చేసుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉండేవాడు!

అయితే, అమ్మోనీయులు మాత్రం ఇశ్రాయేలును వ్యతిరేకించే మార్గాల కొరకు వెదకడం కొనసాగించారు. న్యాయాధిపతుల కాలంలో, మోయాబు మరియు అమాలేకుతో కలిసి అమ్మోను దాదాపు యెరికో వరకు చేరుతూ, వాగ్దాన దేశాన్ని ఆక్రమించింది. అయితే, ఇశ్రాయేలీయుల న్యాయాధిపతియైన ఏహూదు ఆక్రమణదారులను వెనక్కి తరమడంతో వారి విజయం ఎంతోకాలం నిలువలేదు. (న్యాయాధిపతులు 3:12-15, 27-30) వ్యాకులతతో కూడిన స్వల్పకాల యుద్ధ విరమణ న్యాయాధిపతియైన యెఫ్తా కాలం వరకు కొనసాగింది. అప్పటికల్లా ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధనలో పడిపోయింది, కాబట్టి యెహోవా వారి మీద నుండి తన కాపుదలను తీసివేశాడు. దాదాపు 18 సంవత్సరాల వరకు, దేవుడు అలా “అమ్మోనీయుల చేతికి . . . వారినప్పగించెను.” (న్యాయాధిపతులు 10:6-9) ఇశ్రాయేలీయులు విగ్రహారాధనను విడిచిపెట్టి యెఫ్తా నాయకత్వం క్రింద నడిచారు గనుక మళ్లీ అమ్మోనీయులు ఘోరాపజయాన్ని అనుభవించారు.—న్యాయాధిపతులు 10:16–11:33.

ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతుల పరిపాలనా శకం వారి మొదటి రాజైన సౌలు కిరీటధారణతో ముగింపుకొచ్చింది. సౌలు పరిపాలించడం ప్రారంభించిన వెంటనే, అమ్మోను ద్వేషం మళ్లీ తలెత్తింది. రాజైన నాహాషు ఇశ్రాయేలీయుల నగరమైన యాబేష్గిలాదుపై హఠాత్తుగా దాడి చేశాడు. ఆ నగర ప్రజలు శాంతి కొరకు వేడుకున్నప్పుడు, అమ్మోనీయుడైన నాహాషు ఈ దారుణమైన కోరిక కోరాడు: ‘మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదను.’ పాక్షికంగా తనను తాను రక్షించుకోవడంలో భాగంగా “వారి ఎడమ కన్నులు డాలు చేత కప్పబడినప్పుడు, వాళ్లు పూర్తిగా యుద్ధానికి పనిరాకుండా అయ్యేలా” ఇది కోరడం జరిగిందని చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ తెలియజేస్తున్నాడు. అయితే, ఈ కఠినమైన ఉత్తరువు యొక్క అసలు సంకల్పం ఏమిటంటే, ఈ ఇశ్రాయేలీయులను హీనమైన ఉదాహరణగా చేయాలన్నదే.—1 సమూయేలు 11:1, 2.

యెహోవా దయకు బదులు అమ్మోనీయులు మళ్లీ ద్వేషాన్ని చూపారు. ఈ దుర్మార్గమైన బెదిరింపును యెహోవా నిర్లక్ష్యం చేయలేదు. “సౌలు [నాహాషు యొక్క] ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహు”డయ్యెను. దేవుని ఆత్మ నడిపింపు క్రింద, “వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ” అమ్మోనీయులను తరిమిన 3,30,000 మంది యోధులను సౌలు సమకూర్చాడు.—1 సమూయేలు 11:6, 11.

అమ్మోనీయులు తమ స్వంత ఆసక్తులలో స్వార్థపూరితంగా ఇమిడివుండడం, వారి కఠినత్వం, వారి అత్యాశ చివరికి వారి పూర్తి నాశనానికి దారి తీశాయి. యెహోవా ప్రవక్తయైన జెఫన్యా ప్రవచించినట్లుగా, వారు “గొమొఱ్ఱాపట్టణమువలె . . . నిత్యము పాడుగా” అయ్యారు ఎందుకంటే వారు “అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి.”—జెఫన్యా 2:9, 10.

అమ్మోనుకు ఏమి జరిగిందనే దాన్ని ప్రపంచ నాయకులు నేడు గమనించాలి. తన పాదపీఠమైన భూమిపై జీవించడానికి అనుమతించడం ద్వారా దేవుడు దేశాల ఎడల అలాగే కొంత దయను చూపించాడు. స్వార్థపూరిత దేశాలు భూమి గురించి శ్రద్ధ తీసుకునే బదులు దాన్ని నాశనం చేస్తున్నాయి, చివరికి భూగ్రహాన్ని అణు విధ్వంసంతో బెదిరించారు కూడా. భూమిపైనున్న యెహోవా ఆరాధికుల ఎడల దయ చూపించే బదులు, దేశాలు తరచూ వారిని కఠినమైన హింసకు గురిచేస్తూ వారి ఎడల ద్వేషాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి అమ్మోనీయులను గూర్చిన గుణపాఠం ఏమిటంటే, తన దయకు బదులుగా ద్వేషం చూపడాన్ని యెహోవా అలక్ష్యం చేయడన్నదే. ఆయన పూర్వకాలంలో చేసినట్లుగానే తన నిర్ణీత సమయంలో, చర్య తీసుకుంటాడు.—కీర్తన 2:6-12 పోల్చండి.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[9వ పేజీలోని చిత్రం]

అమ్మోనీయుల ముఖ్యపట్టణమగు రబ్బా అనే ప్రదేశం, అమ్మాన్‌లోని రోమా శిధిలాలు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

[10వ పేజీలోని చిత్రం]

అమ్మోనీయులు ఈ ప్రాంతంలో నివసించారు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి