కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/1 పేజీలు 2-4
  • పారంపర్యాచారం సత్యంతో విభేదించాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పారంపర్యాచారం సత్యంతో విభేదించాలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • పారంపర్యాచారం సత్యంతో విభేదించినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • విజ్ఞానశాస్త్రం, బైబిలు వివాద ఆరంభం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మార్టిన్‌ లూథర్‌ —ఆ మహాపురుషుడు ఆయన వారసత్వం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీ నమ్మకాలకు ఆధారం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/1 పేజీలు 2-4

పారంపర్యాచారం సత్యంతో విభేదించాలా?

మార్టిన్‌ లూథర్‌ తను నమ్మేది సరైనదని ఒప్పించబడ్డాడు. బైబిలు తనకు మద్దతునిస్తుందని అతను విశ్వసించాడు. మరో వైపు, ఆనాటి పారంపర్యాచార విశ్వాసం తప్పని పోలండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడైన కాపర్‌నికస్‌ భావించాడు.

ఏ విశ్వాసం? విశ్వానికి కేంద్రం భూమేనని, దాని చుట్టూ ప్రతిదీ పరిభ్రమిస్తుందనేదే ఆ విశ్వాసం. భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తుందన్నదే కాపర్‌నికస్‌ చెప్పిన సత్యం. ఇలా చెబుతూ, లూథర్‌ దాన్ని త్రోసిపుచ్చాడు: “విశ్వం, ఆకాశం, సూర్యుడూ చంద్రుడూ కాక భూమే పరిభ్రమిస్తుందని నిరూపించేందుకు కృషి చేస్తున్న ఈ నడిమంతపు ఖగోళ శాస్త్రజ్ఞుని మాటలను ప్రజలు వింటున్నారు.”—పాశ్చాత్య తత్త్వజ్ఞానం యొక్క చరిత్ర.

పారంపర్యాచార విశ్వాసాలు తరచూ వాస్తవాలతో, సత్యంతో విభేదించాయి. హానికరమైన సంగతులను చేయడానికి కూడా అవి ప్రజల్ని నడపగలవు.

అయితే, పారంపర్యాచారం ఎల్లప్పుడూ సత్యంతో విభేదిస్తుందని దీని భావం కాదు. వాస్తవానికి, తాను వారికి అందజేసిన పారంపర్యాచారాలను అనుసరిస్తూ ఉండమని అపొస్తలుడైన పౌలు తన కాలంనాటి క్రైస్తవులను ప్రోత్సహించాడు: “నేను మీకు అప్పగించిన పారంపర్యాచారములను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 11:2, NW; 2 థెస్సలొనీకయులు 2:15; 3:6 కూడా చూడండి.

“పారంపర్యాచారములు” అంటే పౌలు భావమేమిటి? “పారంపర్యాచారం” కొరకు ఆయన ఉపయోగించిన గ్రీకు పదం, పా·రాʹడో·సిస్‌, “మౌఖిక సంభాషణ ద్వారా లేక వ్రాతపూర్వకంగా అందించబడినదని,” దానర్థమని లేఖనములపై అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 2, పేజీ 1118 సూచిస్తుంది. ఆంగ్ల పదము, “తలిదండ్రులనుండి పిల్లలకు అందింపబడిన లేక స్థాపింపబడిన ఆలోచనా విధానం మరియు ప్రవర్తనగా మారిన సమాచారం, సిద్ధాంతాలు లేక అభ్యాసాలు,” అనే భావాన్ని కలిగి ఉంది.a అపొస్తలుడైన పౌలు వాళ్లకు అందించిన పారంపర్యాచారాలు ఒక మంచి మూలంనుండి వచ్చాయి గనుక, వాటికి హత్తుకొని ఉండటంలో క్రైస్తవులు మంచే చేశారు.

గనుక, పారంపర్యాచారం సత్యంగా లేక అసత్యంగా, మంచిగా లేక చెడుగా ఉండగలదన్నది వాస్తవం. ఉదాహరణకు, పారంపర్యాచార విశ్వాసాలను సవాలు చేయగల యథార్థతను, ధైర్యాన్ని కలిగివుండిన 16వ శతాబ్దపు కాపర్‌నికస్‌ వంటి ప్రజలను బ్రిటిష్‌ తాత్వికుడైన బెర్ట్‌రాండ్‌ రసల్ల్‌ మెచ్చుకుంటున్నాడు. “ప్రాచీన కాలంనుండి నమ్మబడుతున్నది అసత్యం కాగలదన్న గ్రహింపును” వారు వృద్ధిలోకి తెచ్చారు. పారంపర్యాచారాన్ని గ్రుడ్డిగా ఆచరించకపోవడంలో ఉన్న జ్ఞానాన్ని మీరు చూస్తున్నారా?—మత్తయి 15:1-9, 14 పోల్చండి.

అలాంటప్పుడు, మత విశ్వాసాలు, ఆచారాల సంగతేమిటి? అవి సరైనవి, హానికరం కానివని మనం నిశ్చయతను కలిగి ఉండగలమా? మనమెలా తెలుసుకోగలం? మతపర పారంపర్యాచారాలు వాస్తవానికి సత్యంతో విభేదిస్తున్నాయని మనం కనుగొంటే మనమేమి చేయాలి? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వారు ప్రచురించినది.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover: Jean-Leon Huens © National Geographic Society

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Universität Leipzig

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి