కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/15 పేజీ 20
  • ఫలదీకరణ మరియు యుద్ధ దేవతలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫలదీకరణ మరియు యుద్ధ దేవతలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/15 పేజీ 20

ఫలదీకరణ మరియు యుద్ధ దేవతలు

సిరియానందలి ఎబ్ల వద్ద జరిగిన పురావస్తు త్రవ్వకాల సమయంలో, బబులోనుకు సంబంధించిన ఫలదీకరణ మరియు యుద్ధ దేవతయైన ఇష్తారును వర్ణించే అవశేషము కనుగొనబడింది. పురావస్తు శాస్త్రజ్ఞుడైన పౌలో మాతై దాన్నిలా వర్ణిస్తున్నాడు, “అది ఒక దైవిక రూపం ఎదుటవున్న ముసుగు వేసుకొనిన అర్చకురాలిని సూచిస్తున్న పూజాసంబంధ దృశ్యం గల ఒక వృత్తాకారపు ముద్ర . . . దాని తల ఒక పొడవైన సన్నని ఊతమీద బిగించబడివుంది.”

ఆ విగ్రహం సా.శ.పూ. 18వ శతాబ్దారంభానికి చెందినది గనుక ఆ పరిశోధన విశేషమైనది. మాతై చెప్పినదాని ప్రకారం, ఇష్తారు ఆరాధన దాదాపు 2,000 సంవత్సరాల కాలనిడివిగలదని చెప్పడానికి ఇది “తుది సాక్ష్యాధారాన్ని” అందజేస్తుంది.

ఇష్తారు ఆరాధన బబులోనులో ప్రారంభమై, తర్వాతి శతాబ్దాల్లో రోమా సామ్రాజ్యమంతటా వ్యాపించింది. వాగ్దాన దేశంలో నుండి అబద్ధ ఆరాధనకు సంబంధించిన ప్రతి గుర్తును నిర్మూలించమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, కాని వాళ్లు అలా చేయడానికి విఫలమైనందున, అష్తారోతు ఆరాధన (కనానుకు సంబంధించిన ఇష్తారుకు ప్రతిమూర్తి) వారికి ఒక ఉరి అయ్యింది.—ద్వితీయోపదేశకాండము 7:2, 5; న్యాయాధిపతులు 10:6.

ఇష్తారు మరియు ఆమె ప్రతిమూర్తి అయిన అష్తారోతు ఇక ఉనికిలో లేకపోయినప్పటికీ, అవి ప్రాతినిధ్యం వహించిన లక్షణాలైన అనైతికత మరియు దౌర్జన్యం మాత్రం ప్రబలి ఉన్నాయి. ఈ ఫలదీకరణ మరియు యుద్ధ దేవతలను ఆరాధించిన ఆ ప్రాచీన నాగరికతల నుండి ఆధునిక సమాజం నిజంగా ఎక్కువ తేడాను కలిగివుందా అని మనం ప్రశ్నించవచ్చు.

[20వ పేజీలోని చిత్రం]

తానిత్‌కు పిల్లలు బలి ఇవ్వబడేవారు

[క్రెడిట్‌ లైను]

Ralph Crane/Bardo Museum

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి