కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/15 పేజీ 31
  • అర్థరహితమైన ఆచారమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అర్థరహితమైన ఆచారమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/15 పేజీ 31

అర్థరహితమైన ఆచారమా?

కాథోలిక్కులు శతాబ్దాలుగా తప్పు ఒప్పుకోవడమనే ఆచారాన్ని కలిగివున్నారు. అయితే అనేకులకు అది నిష్ప్రయోజనకరమైన దినచర్య. ఉన్నత పాఠశాల అధ్యక్షుడైన బాబ్‌ అనే వ్యక్తి తన యౌవనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెబుతున్నాడు: “నేను యౌవనున్ని, అయినప్పటికీ నేను దాన్ని గంభీరమైన విషయంగా పరిగణించలేదు.” ఎందుకు? ఆయనకు తప్పు ఒప్పుకోవడమన్నది అర్థరహితమైన ఆచారంలా తయారైంది. ఆయనిలా వివరిస్తున్నాడు: “తప్పు ఒప్పుకోవడం, మనం పాపాలతో నిండివున్న మన సామానంతా విమానాశ్రయంవద్ద కస్టమ్స్‌ వ్యక్తి యొద్దకు తీసుకురావడంలా ఉండేది. ఆయన మీ పాపాల గురించి ప్రశ్నలడిగి, మీరు విదేశాల్లో ఉన్నప్పుడు కొన్న విలాస వస్తువులకు ఏదైనా కొంత చెల్లిస్తే, మిమ్మల్ని వెళ్లనిస్తాడు.”

అలాగే, యుఎస్‌ కాథోలిక్‌ నందు వ్రాస్తూ ఫ్రాంక్‌ వెస్లింగ్‌, తప్పు ఒప్పుకొనే ఆచారం “పశ్చాత్తాపానికి సంబంధించిన కంఠస్థం చేయబడిన ప్రార్థన ద్వారా సాధారణ పాపాల నిర్మూలన నుండి కనీస పాపవిమోచన సంస్కారం యొక్క మతాచార క్రియ వరకు ఎంతో సరళం చేయబడిన అంచెలంచెల మార్గనిర్దేశకం వంటిదని” వివరించాడు. వెస్లింగ్‌ ముగింపేమిటి? “ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ క్షేమానికి తప్పుఒప్పుకోవడమన్నది మంచిదని నేను అంగీకరిస్తున్నాను. కాని, కాథోలిక్కులు దాన్ని చేసే విధానమే ఒక సమస్య” అని ఆయన చెబుతున్నాడు.

తప్పు ఒప్పుకోవడాన్ని బైబిలు పూర్తిగా వేరే విధంగా తెలియజేస్తుంది. దేవుని ఎదుట తప్పు ఒప్పుకోవడం అత్యంత ప్రాముఖ్యం. (కీర్తన 32:1-5) క్రైస్తవ శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు [“యెహోవా,” NW] నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి.”—యాకోబు 5:14, 16.

తప్పు చేసిన వ్యక్తి తన పాపభరితమైన విధానాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేసేందుకు బైబిలులో నుండి ఆచరణయోగ్యమైన ఉపదేశాన్ని ఇవ్వగల సంఘాధ్యక్షులను పాపభారంగల క్రైస్తవుడు పిలిపించవచ్చు. ఆత్మీయపరంగా బాధననుభవిస్తున్న వ్యక్తి అభివృద్ధిని వారు గమనిస్తుంటారు గనుక అధ్యక్షులు తగిన ప్రోత్సాహాన్నివ్వగలరు. నేడు చర్చీలు ఆచరిస్తున్న సాంప్రదాయబద్ధమైన తప్పు ఒప్పుకొనే ఆచారానికి ఇదెంత భిన్నం! సంఘ పెద్దల వ్యక్తిగత సహాయంతో బలపర్చబడి పశ్చాత్తాపం పొందిన తప్పిదస్థులు దావీదు పొందినలాంటి ఉపశమనాన్ని పొందవచ్చు, ఆయన దాన్ని ఒక కీర్తనలో ఇలా వ్యక్తం చేశాడు: “నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని—యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.”—కీర్తన 32:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి