కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/15 పేజీ 32
  • పక్షులు పువ్వుల నుండి ఒక పాఠం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పక్షులు పువ్వుల నుండి ఒక పాఠం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/15 పేజీ 32

పక్షులు పువ్వుల నుండి ఒక పాఠం

నేడు ప్రజలకు దేని ఎడల అత్యధిక శ్రద్ధ ఉంది? అధికశాతం మందికి అదేమిటంటే, తమ కుటుంబానికి సరిపోయేంత సంపాదించుకోవడం లేక తమ జీవన స్థితిని మెరుగుపర్చుకోవడం.

తమకు, తమ కుటుంబానికి తగినంత సంపాదించుకోవడమన్నది యేసుక్రీస్తు భూమ్మీద ఉన్న కాలంలో కూడా ప్రముఖ విషయమై ఉండింది. కాని ఈ న్యాయమైన శ్రద్ధ ఆత్మీయ విషయాలను మూసివేస్తూ, చింతను అధికం చేసేది కాగలదని ఆయన హెచ్చరించాడు. తాను చెప్పేదాన్ని ఉదాహరించేందుకు, పక్షులను పువ్వులను నిశితంగా గమనించమని యేసు తన శిష్యులకు చెప్పాడు.

పక్షులు ప్రతిరోజు తినాలి—వాటి జీవరసాయన ప్రక్రియ యొక్క అధిక రేటును బట్టి మనం తినేదానితో పోలిస్తే అవి ఎంతో ఎక్కువ తినవల్సి ఉంటుంది. అంతేగాక, అవి విత్తనాలు నాటలేవు, కోయలేవు లేక భవిష్యత్తు కొరకు ఆహారాన్ని దాచుకోలేవు. అయినప్పటికీ, యేసు చెప్పినట్లుగా మన ‘పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు.’ (మత్తయి 6:26) అలాగే, దేవుడు అందమైన “అడవి పువ్వుల”ను చక్కని వస్త్రాలతో అలంకరిస్తున్నాడు.—మత్తయి 6:28-30.

మనం వస్తుసంబంధ అవసరాలను తగిన స్థానంలో ఉంచి, ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే, మనకు అవసరమైన ఆహారం మరియు వస్త్రాలు మనకు లభించేలా దేవుడు చూస్తాడని యేసు మనకు హామీ ఇస్తున్నాడు. యెహోవా దేవుడు పక్షులు మరియు పువ్వుల గురించే శ్రద్ధ తీసుకుంటే, తనను ప్రేమించి, ‘రాజ్యమును నీతిని మొదట వెదికే వారి’ గురించి ఆయన తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాడు. (మత్తయి 6:33) మీరు దేవుని రాజ్యాసక్తులను మీ జీవితంలో ముందుంచుతున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి